ఇట్స్‌ ఇండియన్‌–2 టైమ్‌ | indian 2 shootings starts on dec 14 | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ ఇండియన్‌–2 టైమ్‌

Nov 30 2018 5:47 AM | Updated on Aug 8 2019 11:13 AM

indian 2 shootings starts on dec 14 - Sakshi

కమల్‌హాసన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు పనిచేశారు శంకర్‌. సినిమా రిలీజైంది కదా.. కొన్ని నెలలు రిలాక్స్‌ అవుతారేమో అనుకుంటే.. నో చాన్స్‌ అంటున్నారు శంకర్‌. తన తర్వాతి సినిమా ‘ఇండియన్‌ 2’(తెలుగులో భారతీయుడు)కి ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా షూటింగ్‌ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారాయన. కమల్‌హాసన్‌– శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కించనున్నారు శంకర్‌. ఈ సినిమా సెట్‌ వర్క్‌ని ఇటీవల ఆరంభించారు. రెగ్యులర్‌ షూటింగ్‌కి  డిసెంబరు 14న కొబ్బరికాయ కొట్టనున్నాయట చిత్రవర్గాలు. ‘2.ఓ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శంకర్, అక్షయ్‌ కుమార్, నిర్మాత కరణ్‌ జోహార్‌ ముంబయ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలోనే ‘ఇండియన్‌ 2’ సినిమా డిసెంబరు 14న ప్రారంభం కానుందని కరణ్‌ జోహార్‌ రివీల్‌ చేశారు. ‘భారతీయుడు’ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన సేనాపతి (తండ్రి కమల్‌ పాత్ర) పాత్రను ‘ఇండియన్‌ 2’లో కూడా కొనసాగించబోతున్నారట శంకర్‌. ఇప్పటికే సేనాపతి పాత్రకి టెస్ట్‌ షూట్‌ చేసి కమల్‌ లుక్‌ ఫైనల్‌ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement