
దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) లంచాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ తాత లంచగొండులందర్నీ క్లీన్ చేశారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ‘ఇండియన్ 2’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలపై దృష్టి పెట్టారని చెన్నై టాక్. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ డైరెక్ట్‌గా అటాక్ చేయకుండా సెటిల్డ్‌గా ప్రస్తావించనున్నారని సమాచారం. కమల్‌హాసన్ పూర్థి స్థాయి పాలిటిక్స్‌లోకి వెళ్లే లోపు ఈ మూవీని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం తమిళ్‌లో ‘బిగ్ బాస్ సీజన్ 2’ హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ ఈ షో కంప్లీట్ అవ్వగానే ‘ఇండియన్ 2’ షూటింగ్‌లో జాయిన్ అవుతారట. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో ఆగిపోయిన కమల్ ‘విశ్వరూపం 2’ సెన్సార్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment