అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని ప్రముఖ నటుడు, త్వరలో రాజకీయ పెట్టనున్నానంటూ ప్రకటించిన కమల్ హాసన్ అన్నారు.
చెన్నై : అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని ప్రముఖ నటుడు, త్వరలో రాజకీయ పెట్టనున్నానంటూ ప్రకటించిన కమల్ హాసన్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారని చెప్పారు. గురువారం అనూహ్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ కమల్‌హాసన్‌లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత వారిద్దరు మీడియాతో మాట్లాడారు.
‘నా తండ్రి కాలం నుంచే మా కుటుంబం కాస్తంత రాజకీయాలకు దూరంగా ఉంది. నేను కూడా దూరంగా ఉన్నాను. త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయాలనుకున్న నాకు అరవింద్ కేజ్రీవాల్ సలహా కావాలని అనిపించింది. అందుకే కోరాను’ అని కమల్ చెప్పారు. ఇక కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘కమల్ హాసన్ చేసే పనికి నేనెప్పుడూ పెద్ద అభిమానిని. మే మధ్య చాలా అద్భుతమైన సమావేశం జరిగింది. భవిష్యత్‌లో కూడా మేం ఒకరికొకరం అందుబాటులో ఉండి తరుచుగా సమావేశం అవుతుంటాం. కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలి. కమల్‌తో భేటీ కావడం ఆనందంగా ఉంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.