తమిళనాడులో రోజుకో ఎపిసోడ్ రాజకీయ ప్రకంపలను రేపుతూనే ఉంది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభం రగులుతుండగా.. తాజాగా సినీ లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.