
న్యూఢిల్లీ: సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ గురువారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని కలిశారు. జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో కలిసి తమిళనాడు రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు అనంతరం కమల్ విలేకరులకు చెప్పారు. తాను కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లు భావించాలనీ, ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనన్నారు.
బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన..ఆ అంశాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశమైన విషయం తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సమావేశాలు కూడా భాగమని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment