ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ తండ్రీ కూతుళ్లుగా కమల్‌హాసన్, శ్రుతీహాసన్ యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘శభాష్ నాయుడు’. ఈ చిత్రం గత ఏడాదే ప్రారంభం అయినప్పటికీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఈ సినిమాను ‘ఇండియన్ 2’ (భారతీయుడు సీక్వెల్) స్టార్ట్ అయ్యేలోపే కంప్లీట్ చేస్తామని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘దశావతారం’ సినిమాలోని బలరామ్ నాయుడు క్యారెక్టర్‌కి కొన సాగింపుగా స్వీయ దర్శకత్వంలో ‘శభాష్ నాయుడు’ సినిమాని రూపొందిస్తున్నారు కమల్ హాసన్. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ గురించి కమల్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్2’తో బిజీగా ఉన్నాను. అది అయిపోగానే ‘శభాష్ నాయుడు’ పనులు మొదలుపెడతాం. ‘ఇండియన్ 2’ షూటింVŠ స్టార్ట్ చేయడానికి కంటే ముందే ఈ సినిమాను కంప్లీట్ చేసి, వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. కమల్ హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొం దించిన ‘విశ్వరూపం 2’ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment