
ముంబై : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
దేశాన్ని విభజించే వ్యాఖ్యలను ఏ ఒక్కరూ చేయరాదని అన్నారు. ‘కమల్ సార్..మీరు గొప్ప నటులు..కళకు ఎలాగైతే మతం ఉండదో ఉగ్రవాదానికీ మతం ఉండదు..గాడ్సే ఉగ్రవాదని అంటున్న మీరు హిందూ అని నిర్ధిష్టంగా ఎందుకు చెప్పారు..? మీరు ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో ఉన్నందున వారి ఓట్ల కోసం అలా చెప్పారా..? అని వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు. దయచేసి దేశాన్ని విభజించేలా వ్యవహరించకండి..మనమంతా ఒక్కటే అంటూ ఒబెరాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment