మొదలైన చోటుకి వచ్చేశా! | Sai Pallavi signs a Malayalam film after three years | Sakshi
Sakshi News home page

మొదలైన చోటుకి వచ్చేశా!

Published Mon, Mar 18 2019 12:29 AM | Last Updated on Mon, Mar 18 2019 12:29 AM

Sai Pallavi signs a Malayalam film after three years - Sakshi

సాయిపల్లవి

‘భానుమతి ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’ అని ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి చేసిన అల్లరికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ అంతకంటే ముందే మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో 2015లో కథానాయికగా పరిచయం అయ్యారు సాయిపల్లవి. ఈ చిత్రం తెలుగు రీమేక్‌ ‘ప్రేమమ్‌’లో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే మలయాళం ‘ప్రేమమ్‌’ చిత్రంలో నటించిన తర్వాత తెలుగులో (ఫిదా, ఎమ్‌సీఏ: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, పడి పడి లెచే మనసు), తమిళం (దియా, మారి 2 ఎన్‌జీకే: నంద గోపాల కుమరన్‌) సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు సాయిపల్లవి.

ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ మలయాళంలోకి వెళ్లారు. ‘అథిరన్‌’ అనే మలయాళం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ‘‘నా సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చాను. మూడేళ్ల తర్వాత మలయాళంలో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సాయిపల్లవి. ఫాహద్‌ ఫాజల్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement