ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా రెండు తెలుగు సినిమాలు! | Fahadh Fazil Latest Movie Updates | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలోకి రాజమౌళి తనయుడు.. ఫహాద్‌ ఫాజిల్‌తో రెండు సినిమాలు

Published Wed, Mar 20 2024 10:54 AM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM

Fahadh Fazil Latest Movie Updates - Sakshi

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ ఫస్ట్‌ లుక్‌

మలయాళ స్టార్‌ హీరోల్లో ఒకరైన ఫహాద్‌ ఫాజిల్‌ రెండు తెలుగు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి ‘ఆక్సిజన్‌’ కాగా మరొకటి ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్ర ద్వారా ఫహాద్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్‌’ లో నటిస్తున్న ఆయన హీరోగా రెండు తెలుగు చిత్రాల ప్రకటన వచ్చింది.

మలయాళ హిట్‌ మూవీ ‘ప్రేమలు’ చిత్రాన్ని  తెలుగులో రిలీజ్‌ చేసి, హిట్‌ కొట్టిన కార్తికేయ (డైరెక్టర్‌ రాజమౌళి తనయుడు) ‘ఆక్సిజన్‌’, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌పై ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్‌ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఈ సినిమాలను నిర్మించనున్నట్లు కార్తికేయ ప్రకటించారు. ‘ఆక్సిజన్‌’ చిత్రంతో సిద్ధార్థ్‌ నాదెళ్ల, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ మూవీతో శశాంక్‌ ఏలేటి దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాలకు ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement