సాక్షి,కరీంనగర్‌క్రైం: మలయాళ నటుడు ఫహాద్ పాసిల్ పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పేరుతో పోలీస్ క్యారెక్టర్ చేశారు. కరీంనగర్‌లో అచ్చు ఆయనలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఆయనతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ఈ విషయం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరో ఘటనలో..
బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం
సాక్షి,కరీంనగర్: నాణ్యమైన విద్యనందించడమే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ నిర్వన్ బిర్లా అన్నారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ట్రినిటి విద్యాసంస్థల అధినేత దాసరి ప్రశాంత్ రెడ్డిచే స్థాపించబడిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను బుధవారం ఆయన ప్రార ంభించారు. ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో నాణ్యమైన విద్యనందించడాని కి కరీంనగర్‌కు బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ప్రమోటర్ బీవోఎంఐఎస్ డాక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ వీబీఎస్‌సీ ఎలమంచిలి సందీప్, డైరెక్టర్ ఆఫ్ సౌత్ మాస్టర్ బీవోఎంఐఎస్ ఎల్‌బీ నగర్ విష్ణువర్దన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ భవిత విశ్వచేతన్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ప్చ్.. వీళ్లింతే.!
Comments
Please login to add a commentAdd a comment