
వెంకటేశ్ మహా
మొదటి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో రూపొందిస్తున్నారట. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రానికి ఈ సినిమా రీమేక్ అని తెలిసింది. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్ ఫాజల్ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్‌లో ఆయన పాత్రను సత్యదేవ్ చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment