
మహేశ్‌బాబు సినిమాల్లో ప్రకాశ్‌రాజ్ ఇప్పటివరకూ ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించారు. కానీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు’ సినిమాల్లో మాత్రం మహేశ్‌కు తండ్రిపాత్రలో నటించిన ప్రకాశ్‌రాజ్ ముచ్చటగా మూడోసారి ఫాదర్‌గా నటించనున్నా రట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న సినిమాలో మహేశ్‌కు తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారని సమాచారం.
ప్రస్తుతం డెహ్రా డూన్‌లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో మహేశ్‌బాబు, కథానాయిక పూజా హెగ్డే, ‘అల్లరి’ నరేశ్ పాల్గొంటున్నారు. ప్రజెంట్ కాలేజీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నార ట. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.