బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు సీనియర్లకు, కీలక నేతలకు సీటు ఇవ్వకపోవడంతో వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాడు.
వివరాల ప్రకారం.. కర్నాటకలోని ధనవంతుల లిస్టులో కేజీఎఫ్‌వాసి యూసుఫ్ షరీఫ్ కూడా ఒకరు. యూసుఫ్‌ను అలియాస్ కేజీఎఫ్ బాబుగా పిలుస్తారు. అయితే, కేజీఎఫ్ బాబు రెండేండ్ల క్రితం కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను చిక్కపేట నుంచి పోటీచేయాలని భావించి ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కాంగ్రెస్ కేజీఎఫ్ బాబుకు అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో సస్పెండ్‌ను సీరియస్‌గా తీసుకున్న కేజీఎఫ్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి ఆయన తన భార్య షాజియాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఇక, కేజీఎఫ్ బాబు కర్నాటకలో గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదించారు. కేజీఎఫ్ బాబు అంతుకుముందు ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తిని రూ.1,743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో, దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. ఇక, తాజాగా ఆయన భార్య కూడా ఎన్నికల బరిలో నిలవడంతో మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు.
Comments
Please login to add a commentAdd a comment