కౌంటింగ్‌ను పరిశీలించిన ఎస్పీ | Counting on to take a look at the SP | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ను పరిశీలించిన ఎస్పీ

Published Tue, May 13 2014 1:56 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

Counting on to take a look at the SP

 గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ :  స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల్లోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు సోమవారం పరిశీలించారు.  కౌంటింగ్ వివరాలను మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్, ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య, కార్యాలయపు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే సిబ్బందికి తెలియజేయాలని అధికారులకు సూచించారు.

మంచినీళ్లు ఏర్పాటు చేయలేదని, తాగడానికి బయటకు వెళ్తుంటే పోలీసులు మరలా లోపలికి రానివ్వడం లేదంటూ పలు వార్డుల అభ్యర్థులు  ఎస్పీ దృష్టికి తీసుకురాగా... స్పందించిన ఎస్పీ డిఎస్పీ జి.నాగన్నను పిలిచి మంచినీళ్లు ఏవి అని ప్రశ్నించారు. మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేయలేదని డీఎస్పీ బదులిచ్చారు. దీంతో రూమ్‌లో ఓ పక్కన మంచినీళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. దీంతో ఎస్పీ వెళ్లిన అరగంట తరువాత మంచినీళ్లు ఏర్పాటు చేశారు.
 
 మచిలీపట్నంలో...

 మచిలీపట్నం క్రైం : హిందూ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ జె ప్రభాకరరావు  సందర్శించారు. ఉదయం 9 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా తక్షణమే తనకు సమాచారం అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలకు ఆయన సూచించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement