తొలి పోరు నేడు
తొలి పోరు నేడు
Published Sun, Apr 6 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా బ్బిలి,కురుపాం,పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన పార్వతీపురం డివిజన్‌లోని 15 మండలాల్లో 767 కేంద్రాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్, సమస్యాత్మక గ్రామాల్లో సూక్ష్మ పరిశీలకుల ద్వారా ఎన్నికల పక్రియను అధికారులు పరిశీలించనున్నారు.
పోలింగ్ సిబ్బంది వివరాలు: పోలింగ్ ప్రక్రియలో 843 మంది పీఓలు, 843 మంది ఏపీఓలు, 3374 మంది ఓపీఓలు పాల్గొంటారు.
ఎంపీటీసీలకు సంబంధించి 6,33,000 బ్యాలెట్ పత్రాలు, జెడ్పీటీసీలకు 6,39,400 బ్యాలెట్ పత్రాలు వినియోగించనున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్, ఎంపీటీసీల ఎన్నికకు ఎరుపు రంగు బ్యాలెట్ వినియోగించనున్నారు.
30 గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ : 30 అతి సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 111 సమస్యాత్మక గ్రామాల్లో సూక్ష్మపరిశీలకులను, 80 మంది వీడియోగ్రాఫర్‌లను ఏర్పాటు చేశారు.
మొత్తం ఓటర్లు : 5,79,755
పురుషులు : 2,86,194
మహిళలు : 2,93,556
ఇతరులు : ఐదుగురు
ఎంపీటీసీ స్థానాలు : 225
బరిలో ఉన్న అభ్యర్థులు : 605
జెడ్పీటీసీ స్థానాలు : 15
బరిలో ఉన్న అభ్యర్థులు : 54
Advertisement