ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో జడ్‌పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నిక లు ఆదివారం జరుగనున్నాయి. 18 జడ్‌పీటీసీ, 298 ఎం పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారు లు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ఉదయం ఏడు గం టలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. శనివారమే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు.
ఆయా మండ ల కేంద్రాల నుంచి పోలింగ్ బాక్సులు, ఇతర సామగ్రితో సిబ్బంది, అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో మధ్యాహ్నం బయలు దేరి సాయంత్రం వరకు పో లింగ్ కేంద్రానికి చేరుకున్నా రు. ఇందుకోసం మొత్తం 209 వాహనాలను వినియోగించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత చీకటి పడితే, మహిళా ఉద్యోగులను సురక్షితంగా ఇళ్లకు పంపించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.
మొదటి విడతలో మొత్తం 7,28,809 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పిల్లలను భర్తలకు అప్పగించి మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఒక రోజు ముందుగానే బయలుదేరిన మహిళా ఉద్యోగులు తమ చిన్నారులను వదలలేక ఇబ్బం దులు పడ్డారు.
పిల్లలను తండ్రికి అప్పగించి తల్లి వెళ్తుండగా పిల్లలు ఏడుపులు మొదలు పెట్టారు. ‘‘చిన్నా.. రేపటికల్లా వచ్చేస్తా ఏడవకు కన్నా’’ అంటూ తల్లులు బ్యాలెట్ బాక్సులు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పిల్లలకు సమయానికి భోజనం పెట్టు, పాలు తాగించు, రాత్రికి సమయానికి పడుకోబెట్టు అంటూ పలు సూచనలు చేస్తూ వెళ్లారు.
పరిషత్ ‘తొలి’ సమరం నేడే
Published Sun, Apr 6 2014 3:06 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement