YSR CONGRESS PARTY
సాక్షి ప్రతినిధి, కర్నూలు,సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తోంది. మున్సిపాలిటీల్లో ఆళ్లగడ్డలో 2, బనగానపల్లెలో ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్న పార్టీ అభ్యర్థులు.. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. మొత్తం 19 ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం విశేషం. టీడీపీ 3, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకోగా.. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో ఏకగ్రీవమయ్యారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికలకు ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.
జెడ్పీటీసీకి 397 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. విత్‌డ్రా, ఉపసంహరణల అనంతరం 196 మంది బరిలో నిలిచారు. మొత్తం 815 ఎంపీటీసీ స్థానాలకు 3,719 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్‌కు ముందే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో నిస్తేజం అలుముకుంటోంది.
ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు నూతనోత్సాహంతో దూసుకుపోతున్నారు. ఓటర్లు సైతం రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ పట్ల గుర్రుగా ఉండటం.. వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతుండటంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది.