జిల్లాలో ఒక్కొక్క విడతలో మూడేసి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని జెడీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
సాక్షి, కాకినాడ : నెల రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలను మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే ప్రకటించాలన్న సుప్రీం ఆదేశాలు ప్రధాన రాజకీయ పార్టీలకు కొంత ఊరటనిచ్చాయి. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు 242 మంది తలపడుతుండగా, ఎన్నికలు జరుగుతున్న 1040 ఎంపీటీసీ స్థానాలకు 2705 మంది పోటీ పడుతున్నారు.
జిల్లాలో ఒక్కొక్క విడతలో మూడేసి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని జెడీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోను, రెండో విడతలో అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలోను జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
తొలి విడతలో..
26 జెడ్పీటీసీ స్థానాలు, 513 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాకినాడ డివిజన్ పరిధిలో 8 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 164 ఎంపీటీసీ స్థానాలకు, రాజమండ్రి డివిజన్ పరిధిలో ఆరు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 124 ఎంపీటీసీ స్థానాలకు, పెద్దాపురం డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 225 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతలో మూడు డివిజన్ల పరిధిలోని 26 జెడ్పీటీసీ స్థానాలకు 111 మంది పోటీ పడుతుండగా, 513 ఎంపీటీసీ స్థానాలకు 1321 మంది తలపడుతున్నారు.
రెండో విడతలో
వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్ కార్యకర్తలు రెండో విడతలో అమలాపురం డివిజన్ పరిధిలో 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 309 ఎంపీటీసీ స్థానాలకు, రామచంద్రపురం డివిజన్ పరిధిలో 8 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 156 ఎంపీటీసీ స్థానాలకు, రంపచోడవరం డివిజన్ పరిధిలో 7 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో ఎన్నికలు జరిగే 31 జెడ్పీటీసీ స్థానాలకు 131 మంది పోటీ పడుతుండగా, 527 ఎంపీటీసీ స్థానాలకు 1384 మంది ఈ ఎన్నికల పోరులో తలపడుతున్నారు.