కౌంటింగ్ కేంద్రంపై తేనెటీగల దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలోని కౌంటింగ్ కేంద్రంపై మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్బంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతుంది.
అయితే పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుండగా తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాయి.