బొబ్బిలి, న్యూస్‌లైన్ : ‘బొబ్బిలి పురపాలక సంఘంలో మాదే విజయం... మాకు స్వతంత్రంగా బలం రాకపోతే పక్క పార్టీని కలుపుకొని చైర్‌పర్సన్ సీటును కొట్టేస్తాం. పందెం ఎంతకైనా రెడీ..’ ఇదీ.. గ్రామాలు, పట్టణాల్లో కొందరు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల ప్రచారం.
‘గెలుపు పక్కన పెట్టండి... మా నలుగురిలో ముగ్గురికి ఎన్ని ఓట్లు వచ్చాయో.. అంతకంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుంది. పందెం వేయడానికి ఎవరైనా ఉన్నారా...?’ పట్టణంలోని ఓ అభ్యర్థి ధీమా.
ఇదీ పురపాలక సంఘం ఎన్నికల్లో గెలుపోటములపై పట్టణాలు, పల్లెల్లో జరుగుతున్న పందాల జోరు... మున్సిపల్ ఎన్నికల బరిలో సర్వశక్తులు ఒడ్డి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన అభ్యర్థులు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెనక్కి వెళ్లడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వారి టెన్షన్‌లో వారుంటే... పందెంరాయుళ్లు మాత్రం తెగ పందాలు కాసేస్తున్నారు. మున్సిపల్ పోలింగ్ జరగకముందే కాంగ్రెస్, టీడీపీలు పని కట్టుకొని గ్రామాల వెంట తిరిగి ప్రచారం చేశాయి.
‘గెలిస్తే మా రెండే గెలాలి.. ఎట్టి పరిస్థితిల్లోనైనా మేమే గెలుస్తామ’ంటూ ప్రచారం చేసి ఓటర్లను పక్కదోవ పట్టించడానికి ఆ నాయకులు సిద్ధపడ్డారు. ఈ ప్రచారం ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల్లో తమ రెండు పార్టీలకే ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుని జిమ్మిక్ములు ప్రదర్శించారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని వారు ఇప్పటికే రుచి చూశారు.
ఆ పార్టీని ఎదుర్కోడానికి రెండు పార్టీలూ వేర్వేరుగా కాకుండా ఒకే అభ్యర్థిని నిలబెట్టినా ఫలితం దక్కలేదు. ఇక ఎలాగూ తమ పప్పులు ఉడకవన్న అభిప్రాయానికి వచ్చి.. ఇప్పుడు ఇటువంటి ప్రచారాలకు తెర తీశారు. ైవె ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా దెబ్బకొట్టడానికి చర్యలు మొదలు పెట్టారు. అయినా నియెజకవర్గంలో ఆ రెండు పార్టీల పరిస్థితిని ఇప్పటికే ప్రజలందరూ గమనించడంతో ఇక వారి ఆటలు పారే స్థితిలో లేవు.
ఇప్పుడు గ్రామాల్లో ప్రత్యేకంగా తిరుగుతూ పట్టణంలోని ఫలితాలపై పందాలు కాయడానికి సిద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు రూ.లక్షలు కుమ్మరించినా... గెలుస్తామనే నమ్మకం లేక ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితిలో ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు అవే స్థానాలపై వీరు పందాలు కాస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమ అభద్రతా భావాన్ని తొలగించుకోవడానికే ఆ రెండు పార్టీలూ ఇలా పందాలకు వెళ్తున్నాయనే ప్రచారం సాగుతోంది.
పాలిటిక్స్‌లో చీప్‌ట్రిక్స్
Published Sat, Apr 5 2014 1:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement