ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసినప్పటికీ లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల వద్ద కట్టు దిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఈ నెల 6వ తేదీన భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, 11వ తేదీన ఖమ్మం డివిజన్‌ల లో ఎన్నికలు నిర్వహించిన విషయం విది తమే.
ఎన్నికల అనంతరం భద్రాచలం రెవె న్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. పాల్వంచ డివిజన్‌లోని మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను మణుగూరులోని స్త్రీ శక్తిభవనంలో, మరో మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను పాల్వంచలోని కేఎల్‌ఆర్ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు.
కొత్తగూడెం డివిజన్‌లోని ఆరు మండలాలకు చెందిన బ్యా లెట్ బాక్సులను పాత ఇల్లెందులోని సింగరేణి ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మరో ఐదు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పాల్వం చ డివిజన్‌లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు, ఖమ్మం డివిజన్‌లోని నాలుగు మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రపరి చారు.
మిగిలిన ఖమ్మం డివిజన్‌లోని 13 మండలాల బ్యాలెట్ బాక్సులను కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రేస్ జూనియర్ కళాశాలలో భద్రపరిచారు. వచ్చే నెల 12, 15 తేదీల్లో ఓట్లను లెక్కించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అభ్యర్థులకు తప్పని ఎదురు చూపులు..
ఇప్పటికే ఎన్నికలు ముగిసి 12 గడుస్తుండడం, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది.
స్ట్రాంగ్ రూముల్లో ‘స్థానిక’ బ్యాలెట్‌లు
Published Sun, Apr 20 2014 3:45 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement