strong room
-
భండార్ నుంచి స్ట్రాంగ్ రూంకు
పురీ: పురీ జగన్నాథుని ఆలయంలోని అమూల్య వస్తువులు, ఆభరణాల తరలింపు గురువారం పూర్తయింది. రత్న భండార్ లోపలి గదిలో ఉన్న అమూల్య సంపదను ఆలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. చెక్క, ఇనుప అల్మారాలు, భోషాణాలు తదితర ఏడింటిలో ఉన్న వీటిని స్ట్రాంగ్ రూంకు మార్చేందుకు ఏడు గంటలు పట్టిందని ఆలయ ప్రధాన అధికారి అరబింద చెప్పారు. అనంతరం రత్న భండార్తోపాటు స్ట్రాంగ్ రూంకు కూడా నిబంధనలను అనుసరించి తాళం, సీల్ వేసి తాళం చెవులను కలెక్టర్‌కు అందజేశామన్నారు.రత్న భండార్ లోపలి భాగంలోని అమూల్య సంపదను తాము పరిశీలించామని సూపర్వైజరీ కమిటీ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. రత్న భండార్‌కు అవసరమైన మరమ్మతులను భారత పురావస్తు శాఖ చేపట్టనుందని, ఆ తర్వాతే స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అభరణాలు, ఇతర వస్తువుల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని పూరీ రాజవంశీకుడు దిబ్య సింఘ దేబ్ వివరించారు. లోపలి చాంబర్ కింద సొరంగం ఉన్నదీ లేదని సర్వేలోనే తేలుతుందన్నారు.అమూల్య వస్తువులు, నగల తరలింపు ప్రక్రియను వీడియోలో చిత్రించినట్టు పురీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వాన్ చెప్పారు. ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత ఉంటుందని ఎస్పీ పినాక్ మిశ్రా చెప్పారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాములు పట్టేవాళ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. రత్నభండార్ లోపల రక్షణగా పాము ఉందన్న వార్తలపై స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు సువేందు మాలిక్ స్పందిస్తూ...అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. -
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
-
ఆర్డీవో ఆఫీసులోనే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటంపై పెద్దదుమారమే రేగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో శనివారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. వివరాలిలా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పోలీసులు, ఇతర ఉద్యోగులు నవంబర్ 21 నుంచి 29 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిని భద్రపరిచే విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు.. సీల్ లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటం వివాదానికి కారణమైంది. ఈ విషయమై పోలింగ్ ఏజెంట్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాటిని తెరిచి ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి కౌంటింగ్ పాసుల కోసం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లు ఈ విషయాన్ని గుర్తించి, ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ ఆఫీ సర్ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన.. లాఠీ చార్జ్ ఆందోళనకారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్డీఓ అనంతరెడ్డి చాంబర్ నుంచి మరో గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ టి నుంచి డోర్‌ను బలంగా బాదారు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచె ప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. 2018 సాధారణ ఎన్నికల్లో ఫలితాల సమయంలోనూ అధికారులు ఇదేవిధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రిటర్నింగ్ అధికారి కూడా ఆయనే కావడంతో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మ«ధ్య తోపులాట చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయానికి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హోళీకేరీ రాత్రి 10.30 గంటలకు ఆర్డీఓ ఆఫీసుకు చేరుకున్నారు. బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు, బాక్స్‌లను భద్రపరిచిన విధానంపై ఆరా తీశారు. ఈ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల ఏజెంట్లు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంపై మీకెంత నమ్మకం ఉందో మాకూ అంతే ఉంది. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకే మేమున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రాగలం’అని చెప్పారు. ఇదే సమయంలో పలువురు కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసు ముందు బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తోపులాటలో పంబ శ్రీను అనే వ్యకికి చేతికి బలమైన గాయాలు కాగా.. కృష్ణ అనే మరో వ్యక్తి తలకు గాయమైంది. ఆగ్రహించిన ఆందోళనకారులు ఆర్డీఓ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. -
RangaReddy: ఆర్డీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. పోస్టల్ బ్యాలెట్‌కు నో సీల్!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు పంపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో ఆఫీసు వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించలేదు. దీంతో, ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడ ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది. అనంతరం, పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్ బ్యాలెట్‌ను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్ వేశారు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవోను నిలదీశారు. -
స్ట్రాంగ్ రూమ్‌లో అభ్యర్థుల భవితవ్యం.. మూడంచెల భద్రత (ఫొటోలు)
-
ఆదిలాబాద్: బ్యాంకు సిబ్బందికి షాకిచ్చిన దొంగ
నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్‌రూం తాళం యమా స్ట్రాంగ్‌గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్‌పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. ముసుగు వేసుకుని గురువారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్‌పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్‌ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్‌తో రాశాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్‌ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
కొలిక్కి వచ్చిన ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఎపిసోడ్
-
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్: 17 గంటలు పరిశీలన.. 26 దాకా ఉత్కంఠ
సాక్షి, జగిత్యాల: తాళాలు మిస్సింగ్ లాంటి అనేక మలుపుల మధ్య సాగిన ధర్మపురి స్ట్రాంగ్ రూం ఎపిసోడ్ ఓ కొలిక్కికి వచ్చింది. నాలుగున్నరేండ్ల గది తెరిచిన అధికారులు.. సుమారు 17 గంటలపాటు స్ట్రాంగ్ రూమ్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. హైకోర్ట్ ఆదేశాలతో నిన్న (ఏప్రిల్ 23 ఆదివారం) ఉదయం 11 గంటలకు తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవగా.. ఇవాళ(సోమవారం) ఉదయం 4 గంటల 50 నిమిషాలకు డాక్యుమెంట్ల పరిశీలన ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా అధికారులు పరిశీలించారు. సేకరించిన డాక్యుమెంట్స్ ను నివేదిక రూపంలో ఈనెల 26 లోపు హైకోర్టుకు సమర్పించనున్నారు జగిత్యాల జిల్లా అధికారులు. డాక్యుమెంట్ల పరిశీలన ముగింపుతో హైడ్రామాకు తెర పడగా హైకోర్ట్ తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అడ్లూరి అభ్యంతరాలు.. 👉హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారుల పర్యవేక్షణ లో 17A మరియు 17 c కి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది 👉కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ లేవు అని అధికారులు చెప్పడం జరిగింది. 👉ఎలక్షన్ పోలింగ్ అయిన తరువాత ఈవీఎంలను ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతంలో ఉంచాలి. కానీ, ధర్మపురి జూనియర్ కాలేజి లో ఈవీఎంలను ఉంచడం జరిగింది. అది ప్రభుత్వం నోటిఫైడ్ చెయ్యని ప్రాంతం!. 👉పోలింగ్ అయిన దగ్గర నుండి ఈవీఎంలను భద్రపరిచే వరకు అధికారులు ఎక్కడ నిబంధనలు పాటించలేదు.. 👉 నాలుగున్నర సంత్సరాలుగా స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్ అయిన పరిస్థితి లోపల కోర్టు ఆదేశాల ప్రకారం తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తే పోలింగ్ కి సంబంధించిన పత్రలు సీల్ లేకుండా, ఒక క్రమ పద్దతిలో లేకుండా ఉన్నాయి. 👉209 కి సంబంధించిన పోలింగ్ బూత్ కి సంబందించిన 17C డాక్యుమెంట్స్ కి సీల్ వేసి లేదు. 👉ఒక క్యాబినెట్ మంత్రి కి సంబంధించిన ఎన్నికల పోలింగ్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి అయినప్పటికీ మేము కోరెది రికౌంటిన్ మాత్రమే.. 👉స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి అని అధికారికంగా ప్రకటించారు.దానికి కారణం అయిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,వారి పైన క్రిమినల్ కేసు ఫైల్ చెయ్యాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. 👉అదే విధంగా 17c కి సంబంధించిన ఈవీఎంలను మళ్ళీ లెక్కించాలి.. 👉ఇదంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్రరపూరితంగ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. 👉దీనిపై హైకోర్టు కి మా అడ్వకేట్ ద్వారా విన్నవిస్తం. మరోవైపు కోర్ట్ ఆదేశాల మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందని, నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు వెల్లడించిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతినిధులు. ► గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ► కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి 17ఏ, 17సీ డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉండగా, స్ట్రాంగ్ రూం నంబర్ 786051 నంబర్ తాళాలు మిస్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ► సుమారు ఐదు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో తాళాన్ని బ్రేక్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఢిల్లీ నుంచి త్రీమెన్ కమిటీ సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలను సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► దీంతో రంగంలోకి దిగిన త్రీమెన్ కమిటీ సభ్యులు ఈ నెల 17న కొండగట్టులోని జేఎన్టీయూలో గతంలో కలెక్టర్లుగా పనిచేసిన శరత్, రవితో పాటు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతిలను ఎంక్వయిరీ చేశారు. ఆ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను వారు కోర్టుకు నివేదించారు. ► దీంతో ఈ నెల 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్ పగలగొట్టాలని లేదా టెక్నీషియన్ తో తీయాలని, ప్రతి ఘటనను కెమెరాలో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 26న కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ► అయితే, ఈ కేసు రెండున్నరేళ్ల పాటు పెండింగ్ లో ఉండగా, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతి కోర్టుకు హాజరుకాకపోవడం.. అరెస్ట్ వారంట్ రావడంతో మళ్లీ కొంత పురోగతి కనిపించింది. ► కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నూకపల్లిలో వీఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ను ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లాక్ పగలగొట్టి ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, సీసీటీవీ ఫుటేజీలకు చెందిన జిరాక్స్ లను అటెస్ట్ చేసి వాటిని ఈ నెల 26న అధికారులు కోర్టుకు అందజేయనున్నారు. -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
-
కాసేపట్లో తెరుచుకోనున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్
-
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
సాక్షి, జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. నాటి ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రొసీడింగ్స్, 17ఏ, 17 సీ ఫామ్స్‌తో పాటు, ఫలితాల రోజు కౌంటింగ్ రూమ్ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను జిల్లా అధికారులు సమర్పించనున్నారు. ఏప్రిల్ 26లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మపురి ఎన్నిక వివాదంపై కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ! -
ధర్మపురి ఎన్నిక వివాదం.. హైకోర్టు సంచలన ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్ పగలగొట్టాలని జిల్లా కలెక్టర్‌కు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని.. అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ ఎన్నిక వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉద్దేశ పూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్స్మిత్ సహకారం తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది. అంతకు ముందు, ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీ ప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచి రిటర్నింగ్ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. మొత్తం 3 గదుల్లో ఎన్నికల సామగ్రి ఉండగా ఒక గది తాళాలు తెరవలేపోయారు. -
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
కావాలనే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ చేశారు..
-
తెరుచుకున్న జగిత్యాల స్ట్రాంగ్ రూమ్..!
-
ట్విస్ట్: ధర్మపురి ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్
జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికల డాక్యుమెంట్ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మిస్సయ్యాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుమారు నాలుగున్నరేళ్లుగా కొనసాగుతోంది. అయితే, ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి 17ఏ, 17సీ డాక్యుమెంట్ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న తమకు సమరి్పంచాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సమక్షంలో మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు ఉద్యోగులు వెళ్లారు. ధర్మ పురి నియోజకవర్గానికి సంబంధించిన మూడు స్ట్రాంగ్‌రూమ్‌లు వీఆర్కే కళాశాలలో ఉండగా, అందులో కోర్టు అడిగిన 17ఏ, 17సీ వీడియో ఫుటేజీలు భద్రపర్చిన గది లాక్ ఓపెన్ కాలేదు. మిగతావి రెండు ఓపెన్ అయ్యాయి. అందులో ఈవీఎంలు, వీవీప్యాడ్లు భద్రంగానే ఉన్నాయి. కోర్టు అడిగిన డాక్యుమెంట్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్ మాత్రమే ఓపెన్ కాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్–3కి లాక్ ఓపెన్ కావడం లేదని తెలిపారు. పతినెలా వచ్చి చూసినప్పుడు తాళానికి సీల్ వేసే ఉందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, నివేదిక సమరి్పస్తామని, హైకోర్టు నిర్ణయానుసారం వ్యహరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ తప్పిదం వల్లే: అడ్లూరి ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల వీడియో ఫుటేజీ, డాక్యుమెంట్లు ఉంచిన రూమ్ 786051 తాళం చెవి లేకపోవడానికి కలెక్టర్, మంత్రి కొప్పుల ఈశ్వరే బాధ్యత వహించాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ తప్పిదం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. -
‘కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ నేర్పుతున్నారు’
సాక్షి, కొల్లాపూర్: జిల్లాలో స్ట్రాంగ్రూంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బుధవారం నాడు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు స్ట్రాంగ్రూంపై దాడి చేశారని పేర్కొన్నారు. వారు ఇంక్ బాటిల్స్ తీసుకొని రావడం, కట్టెలతో సిబ్బంది, పోలీసులపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ సంస్కృతిని నేర్పుతున్నారని హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులే దాన్ని కించపరచడం శోచనీయన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. తప్పులు చేస్తే అది నేనైనా, ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులపై, అమాయకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. కొల్లాపూర్ పట్టణంలో నిన్న రాత్రి 10 గంటలకు ఆకస్మాత్తుగా కరెంట్ పోయింది. చెన్నపురావుపల్లి ఫీడర్లో జంపర్స్ కట్ అయ్యాయనే కారణంతో కరెంట్ నిలిచిపోయినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కరెంట్ లేని సమయంలో బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ పుకార్లు రావటంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి స్ట్రాంగ్‌రూం వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు మార్చేందుకు కరెంట్ సరఫరా నిలిపివేశారంటూ ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్‌రూం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కొందరు నాయకులను స్ట్రాంగ్ రూం వద్దకు తీసుకెళ్లి సీల్‌ను చూపించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఎస్ఐలు రాజు, రమేష్‌లకు గాయాలవగా, పోలీసుల వాహనాల అద్దాలు పగిలాయి. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా, స్కాలర్స్ స్కూల్‌కు వెళ్లేదారి, పాత పోస్టాఫీస్ ఏరియాలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు అక్కడికి చేరుకుని.. పోలీస్ బలగాలను రప్పించారు. రోడ్ల వెంట గస్తీ ఏర్పాటు చేసి గుమిగూడిన నాయకులను చెదరగొట్టారు. ఆందోళన విషయాన్ని కలెక్టర్, ఎస్పీలకు చేరవేయడంతో వారు రాత్రి 12 గంటలకు కొల్లాపూర్‌కు వచ్చి స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అర్ధరాత్రి వరకు కొల్లాపూర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన రూములకు వేసిన సీల్లు యథాతథంగా ఉన్నాయని, తప్పుడు వదంతులను నమ్మవద్దని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. చదవండి: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గపోరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత పెంపు -
భద్రత కట్టుదిట్టం
ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో తొలివిడతగా పోలింగ్ పూర్తయిన జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహారాను కట్టుదిట్టం చేశారు. ఒంగోలుకు శివారులోని పేస్ ఇంజినీరింగ్ కళాశాల, రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీంఎలను భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్, ఎస్పీలే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మే 22వ తేది వరకు తహశీల్దార్లకు పర్యవేక్షణ బా«ధ్యతలను అప్పగించారు. వీరు మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు పని చేయాలి. వీరితో పాటు విధుల్లో ఉన్న భద్రతా దళాల విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు కోఆర్డినేటింగ్ అధికారులుగా ఆర్మ్‌ర్డ్ రిజర్వు అధికారులను నియమించారు. మూడంచెల్లో భద్రత నిర్వహించాలి. వాహనాలను బయటే నిలపాలని ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లకు రెండు తాళాలు..ఒకటి కలెక్టర్ దగ్గర.. మరొకటి రిటర్నింగ్ అధికారి వద్ద ఉంచాలి. స్ట్రాంగ్ రూమ్ ద్వారం కన్పించేలా సీసీ కెమెరాలు సాయుధ బలగాల గస్తీ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, ఎస్పీ ఆకస్మికంగా స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు తహశీల్దార్లను నియమించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు,రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మూడో షిఫ్ట్ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిర్వహించే విధంగా నిర్ణయించారు. ఈ షిఫ్ట్‌లకు నియమించిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. పేస్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లకు.. ♦ ఏప్రిల్ 26వ తేదీ చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు ఆర్.రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 27వ తేదీ: వేటపాలెం, సంతమాగులూరు, ఎస్‌ఎన్‌పాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 28వ తేదీ: మార్టూరు,కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారిగా డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 29వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, ఆర్.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 30వ తేదీ: కొరిశపాడు, సంతనూతలపాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈశ్వరరెడ్డి, డి.పద్మనాభుడు, షేక్ గౌస్‌బుడే సాహెబ్. పోలీసు అధికారి డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ మే 1వ తేదీ: నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్.మల్లేశ్వరరావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 2వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 3వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 4వ తేదీ: చినగంజాం,మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 5వ తేదీ: వేటపాలెం,సంతమాగులూరు, ఎస్ఎన్ పాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 6వ తేదీ: మార్టూరు,కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు.పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 7వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, ఆర్.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 8వ తేదీ: కొరిశపాడు, ఎస్ఎన్ పాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈశ్వరరెడ్డి, పద్మనాభుడు, షేక్ గౌస్‌బుడే సాహెబ్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 9వ తేదీ నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్.మల్లేశ్వరరావు. పోలీసు అ«ధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 10వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 11వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 12వ తేదీ: చిన్నగంజాం,మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 13వ తేదీ: వేటపాలెం, సంతమాగులూరు, సంతనూతలపాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ జె.రాజారావు. ♦ 14వ తేదీ: మార్టూరు, కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 15వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, కె.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 16వ తేదీ: కొరిశపాడు,సంతనూతలపాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈ«శ్వరరెడ్డి, డి.పద్మనాభుడు, షేక్ గౌస్‌బుడే సాహెబ్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్.ఐ జె.రాజారావు. ♦ 17వ తేదీ: నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్.మల్లేశ్వరరావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 18వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు డి.పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 19వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ రాజారావు. ♦ 20వ తేదీ: చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు ఆర్.రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 21వ తేదీ: వేటపాలెం,సంతమాగులూరు, సంతనూతలపాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 22వ తేదీ:మార్టూరు, కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావులను నియమించారు. రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ♦ 26వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వీవీ రామకృష్ణ, ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 27వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 28వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎన్.రవీంద్రనాథ్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీ.ఎక్స్.అజయ్‌కుమార్. ♦ 29వ తేదీ: హెచ్ఎం పాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 30వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటరత్నం, ఎస్.కె.జాన్ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ మే 1వ తేదీ: తాళ్లూరు,ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సుధాకర్, జి.నాంచారయ్య, బీకేఎం ఐయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీ.ఎక్స్.అజయ్‌కుమార్. ♦ 2వ తేదీ: తర్లుపాడు,కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్.వరకుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 3వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వీవీ రామకృష్ణ, ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 4వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందకుమార్, సి.రవీంద్రబాబు.పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీ.ఎక్స్.అజయ్‌కుమార్. ♦ 5వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, రవీంద్రనాథ్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 6వ తేదీ: హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 7వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటరత్నం, ఎస్.కె.జాన్ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 8వ తేదీ: తాళ్లూరు,ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సుధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకేఎం అయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 9వ తేదీ: తర్లుపాడు, కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్.వరకుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీసీఐ కె.రవికిరణ్. ♦ 10వ తేదీ: దోర్నాల, పొదిలి,కనిగిరి తహశీల్దార్లు వీవీఎం రామకృష్ణ , ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 11వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 12వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల,టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎన్.రవీంద్రనాథ్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ రవికిరణ్. ♦ 13వ తేదీ:హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 14వ తేదీ: పామూరు,కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటత్నం, ఎస్.కె.జాన్‌సైదా, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 15వ తేదీ: తాళ్లూరు, ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకెఎం ఐయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 16వ తేదీ: తర్లుపాడు, కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్.రవకుమార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 17వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వవీఎం రామకృష్ణ, ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 18వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 19వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎణ్.రవీంద్రనాధ్. పోలీసు అధికారి వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 20వ తేదీ: హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ కె.రవికిరణ్. ♦ 21వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకట రత్నం, ఎస్.కె.జాన్ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 22వ తేదీ: తాళ్లూరు, ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకె సుధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకేఎం అయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ స్ట్రాంగ్ రూమ్‌ల విధులకు కేటాయించిన వారిని సమన్వయం చేసుకోవడానికి జిల్లా అధికారులను నియమించారు. పేస్ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌ల పర్యవేక్షణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అదెయ్య, స్టెప్ సీఈవో బి.రవి, మెప్మా పీడీ సింగయ్య, డీఈవో సుబ్బారావు, పీఆర్ ఎస్ఈలను నియమించారు. అలాగే రైస్ ఇంజినీరింగట్ కళాశాలకు ఎస్ఎస్ఏ పీవో వెంకటేశ్వరరావు, ఆర్అండ్బి ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఐసీ జీఎం, ఏపీఎస్ఎంఐడీసీ ఈఈలను నియమించారు. -
స్ట్రాంగ్‌రూమ్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రతపై రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. న్యాయవాదుల బృందంతో జిల్లా ఏఎస్పీ,ఆర్డీవోను కలిసి వైఎస్సార్సీసీ నేతలు మెమోరాండంను సమర్పించారు. అనుమతులు లేకుండా స్ట్రాంగ్‌రూమ్‌లోకి ఇతరులు ప్రవేశిస్తున్నారని మండిపడ్డారు. అధికారులే అనుకూల న్యూస్ చానెల్ రిపోర్టర్లను వీడియో గ్రాఫర్ పేరుతో స్ట్రాంగ్‌రూమ్‌కు తీసుకువెళ్లడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు కల్పించే భద్రత ఇదేనా అని అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు వీడియో కవరేజ్ పేరుతో టీడీపీ నేతలు చెప్పిన వారికే బాధ్యతలు అప్పగించడం విస్మయం కల్గిస్తోందని మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ పుటేజ్ బయటకు వచ్చినా.. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో కలెక్టర్ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సిలార్ దాదా పేర్కొన్నారు. -
స్ట్రాంగ్ రూమల వద్ద మూడంచెల భద్రత
-
అత్యుత్సాహం అరెస్ట్‌కు దారితీసింది
సాక్షి, హైదరాబాద్: ఓ పోలింగ్ ఏజెంట్ ప్రదర్శించిన అత్యుత్సాహం అతని అరెస్ట్‌కు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లో ఫొటో దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి ఆ పార్టీకి చెందిన నాయకుడు వెంకటేశ్ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నారు. అయితే గురువారం పోలింగ్ ముగిశాక అధికారులు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను భోగారంలోని హోలీమేరి కళాశాలలో భద్రపరిచారు. అయితే పోలింగ్ ఏజెంట్‌గా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లిన వెంకటేశ్ స్ట్రాంగ్ రూమ్‌లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల వద్ద నిలుచుని ఫొటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కీసర పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా, వెంకటేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్టు కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు. -
అనంతపురం: ఓటెత్తిన చైతన్యం
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ‘అనంత’ ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. గురువారం ఉదయం నుంచే ఓటేసేందుకు వెల్లువెత్తారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు స్వగ్రామాలకు తరలివచ్చారు. పచ్చమూకలు రెచ్చిపోయినా...దాడులతో భయాందోళనలు కలిగించినా...అభిమాన నేతకు అధికారం ఇచ్చేందుకు ముందుకే సాగారు. ఐదేళ్లు ఎవరు పాలించాలో తీర్పు చెప్పారు. రెచ్చిపోయిన ‘పచ్చ’మూకలు పోలింగ్‌రోజున టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో రక్తపాతం సృష్టించారు. మరిన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లదాడి, భౌతిక దాడులకు దిగి భయోత్పాతాన్ని సృష్టించేందుకు యత్నించారు. అయినప్పటికీ ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లోహింసాత్మక చర్యలు: తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో హింసచోటు చేసుకుంది. కదిరి, మడకశిర, శింగనమల, ధర్మవరం, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవకర్గాల్లో అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు మినహా తక్కిన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. తాడిపత్రి మండలం వీరాపురంలో టీడీపీ నేతలు ఓటర్ల వెంట వెళ్లి సైకిల్‌కు ఓటేసేలా అత్సుత్యాహం చూపించారు. క్యూలో ఉన్నవారి వద్దకే వెళ్లి ప్రచారం చేశారు. ఇది గ్రహించిన వైఎస్సార్సీపీ నేతలు వాదనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీయగా...రాళ్లురువ్వుకున్నారు. ఈ సమయంలో చింతా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. వెంటనే అతన్ని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. భాస్కర్‌రెడ్డి గతంలోనూ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు దీన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం భాస్కర్‌రెడ్డి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదిక వస్తే ఎలా చనిపోయారని తెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఘర్షణలోనే టీడీపీ నేతల రాళ్లు రువ్వగా పుల్లారెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. రాప్తాడులో రక్తపాతం రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో టీడీపీ ఏజెంట్లు వృద్ధుల ఓట్లను సైకిల్ గుర్తుపై వేసేందుకు యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ ఏజెంట్, పార్టీ మండల కన్వీనర్ బాలపోతన్న అడ్డుకున్నారు. వృద్ధులకు ఓటువేయడం తెలీకపోతే అధికారుల సాయం తీసుకోవాలని.. ఇలా చేయడం తగదన్నారు. దీంతో టీడీపీ నేతలు పోతన్నపై దాడికి దిగారు. అంతేకాకుండా అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లదాడి చేశారు. ఈ ఘర్షణలో వినోద్ అనే యువకుడి తలకు, జ్యోతి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపు చేశారు. కానీ టీడీపీ నేతలు మిద్దెలపై రాళ్లు వేసుకుని, తలపాగాలు చుట్టకుని వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టి పోలింగ్‌కు విఘాతం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నించారు. గుత్తి, తలుపుల మండలాల్లో ఈవీఎంలు ధ్వంసం కదిరి నియోజకవర్గం తలుపుల మండలం కుర్లిలో మధ్యాహ్నం 3.15 గంటల వరకూ పోలింగ్ జరిగింది. పోలైన ఓట్లలో 85 శాతం వైఎస్సార్సీపీకి పోలైనట్లు గ్రామంలో చర్చ జరిగింది. ఇది గ్రహించిన టీడీపీ ఏజెంట్ ఆదినారాయణ ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ పట్టణంలోని ఓ సెంటర్లో వైఎస్సార్సీపీ ఏజెంట్ ఖలందర్పై దాడి చేశారు. ఇక ఈవీఎంలు పనిచేయలేదన్న కోపంతో గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా గుత్తిలో ఈవీఎంను కిందపడేసి ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. యల్లనూరులో జేసీ రచ్చ శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైఎస్సార్సీపీ నేత భోగాతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించకపోయినా...భోగాతిని స్టేషన్‌కు తరలించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్టేషన్‌కు వెళ్లి ప్రతాప్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ‘ఏయ్ బలిసిందారా? నీ కథ చూస్తా? అంటూ రాయలేని భాషలో బూతులు మాట్లాడుతూ వెళ్లిపోయారు. పోలీసులు అక్కడే ఉన్నా...ప్రేక్షకపాత్ర వహించారు. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నపుడు స్టేషన్‌కు వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై రెచ్చిపోయి మాట్లాడిన ఎంపీ జేసీని వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఓటమి భయంతోనే దాడులు? ‘అనంత’లో ఎదురుగాలి వీస్తోందని గ్రహించిన టీడీపీ నేతలు పోలింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే దాడులకు దిగి, తద్వారా భయోత్పాతం సృష్టించి ఓటర్లు పోలింగ్సెంటర్కు రాకుండా నిలువరించేందుకు కుట్రపన్నారు. అయితే ఓటర్లు ఏమాత్రం భయపడకుండా వచ్చి ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ♦ మొరాయించిన ఈవీఎంలు జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అయితే జిల్లా వ్యాప్తంగా 97 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఈ సెంటర్లలో పోలింగ్ రెండు గంటల పాటు పోలింగ్ ఆలస్యమైంది. ఈ కారణంతోనే పలు కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. జనం అర్ధరాత్రి వరకూ క్యూలో ఉండి మరీ ఓటు వేశారు. ♦ వాహనాల లైటింగ్ మధ్య పోలింగ్ గుంతకల్లు మండలం మొలకలపెంట గ్రామంలోని 12వ పోలింగ్ బూత్‌లో రాత్రి 8 గంటలకు వరకూ పోలింగ్ సాగింది. గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.దీంతో పోలీస్ వాహనాల లైటింగ్ మధ్య పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. ♦ స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల తరలింపు పోలింగ్ ముగిసిన తర్వాత ఇరుపార్టీల ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఈవీఎలకు సీల్‌వేశారు. వాటిని పోలీస్‌బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలో ఎస్కే యూనివర్సిటీ, జేఎన్టీయూలోని స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. అక్కడ వాటిని గట్టి బందోబస్తు మధ్య భద్రపరిచారు. ♦ మే 23న కౌంటింగ్ మార్చి 10న షెడ్యూలు వెలువడిన తర్వాత సరిగ్గా నెలరోజులకు పోలింగ్ జరిగింది. గతంలో పోలింగ్ ముగిసిన వారం పదిరోజుల్లో కౌంటింగ్ ఉండేది. అయితే ఈ దఫా ఏకంగా 43 రోజులు పోలింగ్, కౌంటింగ్‌కు మధ్య సమయం ఉంది. మే 23న కౌంటింగ్ జరగనుంది. అప్పటి వరకూ ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్‌రూంలు గట్టి బందోబస్తు పర్యవేక్షణలో ఉంటాయి. -
స్టాంగ్ రూంల వద్ద ఆర్మీతో భద్రత కల్పించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద ఆర్మీ లేదా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌కు మరో 42 రోజుల గడువున్న నేపథ్యంలో ఈవీఎంలు ఎలాంటి ట్యాంపరింగ్‌కు గురికాకుండా భద్రంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో కోరారు. స్ట్రాంగ్ రూంలలోకి స్థానిక పోలీసులకు ప్రవేశం కల్పించవద్దని, భద్రతను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే వారికి అప్పగించాలన్నారు. హైసెక్యూరిటీ జామర్లను స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన అన్ని పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూంల సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలన్నారు. ఈ ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎంలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని, లేదంటే సీజ్ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చినందున ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కేడర్‌తో స్ట్రాంగ్‌రూంల వద్ద విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే టీపీసీసీ నాయకత్వానికి తెలియపర్చాలని కోరారు. -
రేపు కౌంటింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్న పుకార్లు గ్రేటర్లో గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో నిద్రాహారాలు మాని అక్కడే ఉంటున్నారు. తాము అక్కడ లేకపోతే తమ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండింటి వద్ద భద్రతా సిబ్బందితో పాటు కాంగ్రెస్ కూటమి తరఫున పోటీచేసిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యలు, ముఖ్య అనుచరులు మకాం వేశారు. వాస్తవానికి అక్కడ పోలీస్, పారా మిలటరీ బలగాలు, సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేసినా.. అభ్యర్థులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. పాల్మాకుల స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇలా.. శంషాబాద్ మండలంలోని పాల్మాకులలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. ఇక్కడ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం అనుమతితో ‘కూటమి’ బృందాలు శనివారం సాయంత్రం నుంచి కాపలా కాస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి, పగలు ఇక్కడే ఉండి స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రధాన కేంద్రం చుట్టూ పహారా తిరుగుతున్నారు. భోగారం కేంద్రానికి కూటమి నేతలు మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను కీసర మండలం భోగారంలోని హోలిమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరించారు. అయితే ఆదివారం ఉప్పల్, కుత్బుల్లా పూర్, కూకట్పల్లి ప్రజాకూటమి అభ్యర్థులైన తూళ్ల వీరేందర్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, సుహాసిని ఆ కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న రూమర్స్‌తో తమంతా ఆందోళన చెందామని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు స్వయంగా వచ్చామన్నారు. పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి కౌంటింగ్ జరిగే మంగళవారం పాస్ హోల్డర్స్‌కి మాత్రమే స్ట్రాంగ్ రూమ్‌ల్లోకి అనుమతి ఉంటుంది. మొదటి అంచలో వాహనాలు తనిఖీ ఉంటుందని పోలీసులు చెప్పారు. రెండో అంచలో 500 మీటర్ల వరకు కేంద్రం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా బలగాలు మోహరించాయి. మూడో అంచెలో సీసీ కెమెరా>లు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు నిఘా ఉంది. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు అదే రోజు ఎలాంటి సభలు, ర్యాలీలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటల లోపు కేంద్రాలకు చేరుకోవాలి. వీరికి సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ పాసులు ఇస్తారు. సెల్ఫోన్లు కేంద్రాల్లోకి అనుమతించరు. ఆయా కేంద్రాల వద్ద రెండు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాం. ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు’ అని ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల వాహనాల పార్కింగ్‌ను బెంగళూరు జాతీయ రహదారి పక్కన వెంగమాంబ హోటల్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి షటిల్ బస్సుల ద్వారా ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు. గ్రేటర్ జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలు.. హైదరాబాద్: 15 పాల్మాకుల(రంగారెడ్డి): 01 భోగారం(మేడ్చల్) 01 కేంద్రాల వద్ద భారీ పోలీస్ భద్రత సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలోని మూడు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల(స్ట్రాంగ్‌రూమ్స్) వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భారీ భద్రత కల్పించారు. కేంద్ర సాయుధ బలగాలు, ఇద్దరు డీసీపీ స్థాయి అధికారులు, పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పాల్మాకులలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ భవనంలోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఓట్లను లెక్కించనున్నారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసరలోని హోలిమేరీ కాలేజ్, భువనగిరిలోని ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రేపు కౌంటింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నగరంలోని 15 కేంద్రాల్లో మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. ఈమేరకు అనుమతి లేకుండా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడ కూడదు. అలాగే మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నగర వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిషేధించారు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు మిలటరీ క్యాంటీన్లకూ ఇది వర్తిస్తుందని ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని కొత్వాల్ స్పష్టం చేశారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం పైనా ఆంక్షలు విధించారు. డీజేలతో పాటు పరిమితికి మించి శబ్దం చేసే వాటిని వాడటాన్ని కూడా నిషేధించారు. వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ హెచ్చరించారు. -
స్ర్టాంగ్ రూంలో పనిచేయని సీసీటీవీలు
భోపాల్ : ఉత్కంఠభరితంగా సాగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపూ డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్ వైపు మళ్లింది. ఈవీఎంల భద్రతపై విపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీటిని భద్రపరిచిన స్ర్టాంగ్ రూంలో గంటపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోవడంతో శుక్రవారం స్ర్టాంగ్‌రూంలో అమర్చిన సీసీటీవీలు పనిచేయలేదని ఈసీ వర్గాలు అంగీకరించాయి. ఓటింగ్ యంత్రాలు సురక్షితంగా ఉంచేందుకు జనరేటర్లు, ఇన్వర్టర్లను తెప్పించామని ఈసీ పేర్కొంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్ రూం వద్ద పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను నియోగించామని తెలిపింది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ సత్నాలోని స్ర్టాంగ్ రూంలోకి ఓ వ్యక్తి కార్టన్‌ను తీసుకువెళుతున్న వీడియో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు స్ర్టాంగ్ రూం వెలుపల ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
స్ట్రాంగ్ రూమ్‌లో దూరి.. రూ.1.35 కోట్లు చోరి
రాజ్‌కోట్: చిన్న సందు దొరికితే చాలు దొంగలు దూరిపోతున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన ఓ బ్రాంచ్‌లో చోరబడిన దుండగులు ఏకంగా కోటి 35 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్‌లో జరిగింది. శనివారం రాత్రి దొంగలు తొలుత బ్యాంక్ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌కు ఉన్న వెంటిలేటర్ ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. ఆ చిన్న సందులో నుంచి ఓ వ్యక్తి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నగదుతో అదే వెంటిలేటర్ నుంచి ఉడాయించారు. కాగా శనివారమే చోరి జరిగినప్పటికీ ఆదివారం, సోమవారం(కృష్ణాష్టమి) రెండు రోజులు బ్యాంక్‌కు సెలవు కావడంతో.. మంగళవారం బ్యాంక్ తెరవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం బ్యాంక్ అధికారులు అమ్రేలి పోలీసులను ఆశ్రయించారు. ఎంత నగదు చోరికి గురైందో తెలుసుకోవడానికి అధికారులు రికార్డులను పరిశీలించారు. 1.35 కోట్ల రూపాయలకు పైగా దొంగిలించబడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. దొంగలు వెనుక వైపు నుంచి రావడంతో వారు స్ట్రాంగ్ రూమ్ డోర్లను తాకలేదని.. అందువల్ల అలారమ్ మోగలేదన్నారు. దొంగలు ప్రవేశించిన పాత బిల్డింగ్‌ను గతంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ వారు వినియోగించుకున్నారని.. ప్రస్తుతం అది ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఈ చోరిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై స్పష్టత లేదాన్నారు. -
పది ప్రశ్నపత్రాలు వచ్చేశాయ్
నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. గురువారం వచ్చిన సెట్–1 ప్రశ్నపత్రాలను స్థానిక పొదలకూరురోడ్డులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో స్ట్రాంగ్‌రూంలో పోలీసు పహారా మధ్య భద్రపరిచారు. శుక్రవారం డీఆర్వో వి.వెంకటసుబ్బయ్య, డీఈఓ కె.శామ్యూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా జిల్లాలోని 56 పోలీసుస్టేషన్లకు తరలించారు. శనివారం రానున్న మిగిలిన సెట్–1 పేపర్లను అదేరోజు పోలీసుస్టేషన్లకు తరలించనున్నారు. రెండో సెట్ ప్రశ్నపత్రాలు ఈ నెల 17,18 తేదీలలో రానున్నాయి. పరిశీలకులుగా గీత పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులుగా డిప్యూటీ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్.గీతను నియమించారు. ఈమె ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల తీరు తెన్నులను పరిశీలించనున్నారు. -
పోరు ముగిసింది
► ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ► జిల్లాలో 72.7% ఓటింగ్ నమోదు ► పొడవైన బ్యాలెట్ పత్రంతో ఓటర్ల తికమక ► అభ్యర్థుల ఫొటోల్లో లోపించిన స్పష్టత ► ఉదయం మందకొడిగా పోలింగ్ ► సాయంత్రం 2 గంటల్లోనే 14% ఓటింగ్ ► స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సులు భద్రం ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పోలింగ్ గురువారం ముగిసింది. జిల్లాలో 72.7 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోనున్న 31,381 మంది ఓటర్లలో 22,815 మంది (72.7 శాతం) పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్దా రెండేసి శిబిరాలు ఏర్పాటు చేసిన బీజేపీ, టీడీపీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజను కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు ఎన్నికల సిబ్బంది తరలించారు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల పరిధిలోనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1,55,993 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే 31,381 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అయితే వారిలో 22,815 మంది మాత్రమే గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం జిల్లాలోని 54 పోలింగ్ కేంద్రాల్లోనూ మందకొండిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు కేవలం 45 శాతమే నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 58.91 శాతానికి పెరిగింది. ఆఖరి రెండు గంటల సమయంలో ఓటింగ్ ఊపందుకుంది. సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ ముగిసింది. మొత్తంమీద 72.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు అధికారులు ప్రకటించారు. జిల్లా కేంద్రం సహా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 54 పోలింగ్ కేంద్రాల్లో 407 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించారు. ప్రతి కేంద్రంలోనూ వెబ్కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ విధానంలో ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనరసింహం, జాయింట్ కలెక్టరు కేవీఎస్ చక్రధరబాబు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్) సహా 13 మంది జోనల్ అధికారులు, 19 మంది రూట్ అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడంలో సఫలమయ్యారు. నిబంధనలు పట్టని అధికారపార్టీ...: ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నాయకులు పలుమార్లు ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే తీరు పోలింగ్ రోజున కూడా కొనసాగింది. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో అదీ పార్టీకి ఒక్కటి మాత్రమే శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు మాత్రం రెండేసి శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఓటర్లను ప్రభావితం చేయడానికి యథాశక్తి ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి కేటాయించిన ఒక్క ఎమ్మెల్సీ సీటులోనూ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌ను గెలిపించకపోతే పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచారనే విమర్శలకు బలం చేకూరుతుంది. ఇది భవిష్యత్తులో ఇరు పార్టీల మైత్రిపై ప్రభావం చూపడమే గాకుండా ఓటుకు కోట్లు కేసులోనూ అధినేత చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవనే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే ఏదిఏమైనా మాధవ్‌ను గెలిపించి తీరాలని పార్టీ అధినేత చంద్రబాబు హుంకుం జారీ చేయడంతో టీడీపీ నాయకులు ఆపసోపాలు పడ్డారు. వామపక్షాలు పక్కాగా ఏర్పాట్లు: ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గతంలో రెండు సార్లు విజయం సాధించిన సీపీఎం నాయకుడు ఎంవీఎస్ శర్మ ఒరవడినే కొనసాగించేందుకు పీడీఎఫ్ అభ్యర్థిగా అజశర్మ బరిలో నిలిచారు. ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాలతో పాటు వివిధ వృత్తి సంఘాల్లో గట్టి పట్టున్న ఆయనకే ఎక్కువ ఓట్లు పడ్డాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవ్, కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజులతో పాటు లోక్‌సత్తా మద్దతు ప్రకటించిన సీనియర్ జర్నలిస్టు (లీడర్) రమణమూర్తి, స్వతంత్య్ర అభ్యర్థి చింతాడ రవికుమార్లకు కూడా జిల్లాలో చెప్పుకోతగిన సంఖ్యలో ఓట్లు పడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వారిలో చింతాడ రవికుమార్ టీడీపీ ఓట్లను చీల్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాధవ్‌కు ఓట్ల శాతంలో కోత పడినట్లే! ఏదిఏమైనా త్వరలో జరిగే ఓట్ల లెక్కింపులో కనీసం 50 శాతం ఓట్లు సాధించినవారే ఎమ్మెల్సీ పీఠం దక్కించుకుంటారు. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 2,803 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తర్వాత స్థానంలో ఆమదాలవలస నిలిచింది. 1,780 మంది ఓటు వేశారు. అత్యల్పంగా వంగరలో 127 మంది, ఎల్ఎన్ పేటలో 131, భామినిలో 173 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం ప్రకారం చూస్తే సీతంపేటలో అత్యధికంగా 87 శాతం ఓటింగ్ నమోదైంది. తర్వాత స్థానాల్లో కంచిలి (84.10%), ఇచ్చాపురం (83.03%), టెక్కలి (83%), సంతబొమ్మాళి (81.45%), రణస్థలం (79.47%) నిలిచాయి. అత్యల్పంగా వంగర (45.36%), సంతకవిటి (59.61%) కేంద్రాల్లో ఓటింగ్ నమోదైంది. ఓటింగ్‌లో పదనిసలు ► రాజాంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. ► టెక్కలి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుర్తింపు కార్డు తీసుకురాలేదని ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. తర్వాత గుర్తింపుకార్డు తెచ్చి చూపించిన తర్వాత ఓటింగ్‌కు అనుమతించారు. ► పాలకొండ నియోకవర్గంలోని వీరఘట్టం, పాలకొండ, భామిని, సీతంపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ► ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యోగులు, కార్మికులు మధ్యాహ్న భోజన విరామంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ► రణస్థలం పోలింగ్ కేంద్రాన్ని విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ సందర్శించారు. ► ఇచ్చాపురం, కవిటి పోలింగ్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు పరిశీలించారు. ► నరసన్నపేటలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ బ్రహ్మారెడ్డి పరిశీలించారు. నరసన్నపేటలోని నాలుగు మండలాల్లో టీడీపీ శ్రేణులు హడావుడి కాస్త ఎక్కువ కావడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. ► పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, ఐటీడీఏ పీఓ ఎల్. శివశంకర్, డీఎస్పీ భార్గవరావునాయుడు పరిశీలించారు. ► ఆమదాలవలసలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన ఏజెంటు ఎం.రమేష్‌కుమార్ ప్రచారం చేస్తున్నట్లు ప్రత్యర్థి అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీం తో తహసిల్దారు తారకే శ్వరి సీఐ నవీన్‌కుమార్ సహాయంతో రమేష్‌ను కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. -
పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!
-
పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!
రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంకుకు కొత్త చిక్కు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాత నోట్లను భద్రపరిచేందుకు రిజర్వు బ్యాంకు అవస్థలు పడుతోంది. సరిపడేంత స్థలం లేకపోవడంతో స్ట్రాంగ్ రూమ్‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్రం రద్దు చేయటంతో నవంబర్ 9 నుంచి గురువారం వరకు (44 రోజుల్లో) రాష్ట్రవ్యాప్తంగా రూ.60 వేల కోట్ల విలువైన పాత నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా బ్యాంకులు ఏరోజుకారోజు పాత నోట్లను ఆర్బీఐకి చేరవేస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం తమ పరిధిలో ఉన్న ఒక డెలివరీ పాయింట్లో కొత్త కరెన్సీతోపాటు పాత నోట్ల నిల్వకు స్థలం కేటాయించింది. అలాగే వివిధ బ్యాంకుల అధ్వర్యంలో ఉన్న 18 కరెన్సీ చెస్ట్లలోనూ పాత నోట్లను భద్రపరిచింది. అయితే ఆర్బీఐ ముద్రణాలయం నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న కొత్త కరెన్సీని సైతం బ్యాంకులకు చేరే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల్లోనే భద్రపరుస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న పాత నోట్ల నిల్వలను భద్రపరిచే పరిస్థితి లేదని ఆర్బీఐ అధికారులు గుర్తించారు. పాత నోట్లు మరో రెండు వేల కోట్లు దాటితే నిల్వ సమస్య తీవ్రమవుతుందని, నోట్లు భద్రపరిచేందుకు అదనంగా స్ట్రాంగ్ రూమ్‌లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను వినియోగించుకోవాలని ఆర్బీఐ యోచిస్తోంది. ట్రెజరీలు, సబ్ ట్రెజరీల్లో పాత నోట్లను నిల్వ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ఆర్బీఐ అధికారులు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం సైతం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్దేశించిన గడువు మేరకు ప్రజలు తమ దగ్గరున్న పాత నోట్లు డిపాజిట్ చేసేందుకు ఇంకా 8 రోజుల గడువు ఉండటంతో మరో రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు జమ అవుతాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. -
బ్యాంకు దోపిడీకి యత్నం
- కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించిన దుండగులు - స్ట్రాంగ్‌రూం తాళాలు తెరుస్తుండగా మోగిన సైరన్ - సీసీ కెమెరా, డీవీడీ, మోడెమ్తీసుకుని పరార్ పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దోపిడీ చేసేందుకు ఓ ముఠా శుక్రవారం అర్ధరాత్రి యత్నించింది. లోనికి ప్రవేశించాక స్ట్రాంగ్‌రూమ్ తాళాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్ మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుముందు ఇదే గ్రామంలోని ఓ పారిశ్రామికవేత్త ఇంటి వద్ద కూడా వీరు చోరీకి ప్రయత్నించినట్టు తెలిసింది. మొత్తం మీద ఆరితేరిన దొంగలే ఈ దోపిడిలో పాల్గొని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలమాసనపల్లె గ్రామం లో జనావాసాలకు దూరంగా గ్రామీణ బ్యాంకు ఉంది. గతంలో ఎప్పుడూ ఇక్కడ చోరీలు జరిగిన సందర్భాలు లేవు. కానీ బ్యాంకులో సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేశారు. ఈ ధైర్యంతో అక్కడ వాచ్‌మన్‌ను పెట్టడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఇదే దొంగలకు అనుకూలంగా మారింది. శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దొంగల ముఠా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు కిటికీని తెరచి అందులోని రెండు ఇనుప గ్రిల్స్‌ను ఆక్సాబ్లేడ్, లేదా ఎలక్ట్రానిక్ కటింగ్ మెషీన్ సాయంతో కట్ చేశారు. కట్ చేస్తున్నప్పుడు శబ్దం రాకుండా ఉండేందుకు నీరు పోస్తూ గ్రిల్స్ తొలగించారు. ఆ కిటికీ గుండా లోనికి ప్రవేశించి తొలుత సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అయితే సైరన్‌కు సంబంధించిన వైర్లు కనిపించపోవడంతో వాటిని కత్తిరించడం మరిచారు. బ్యాంకులోని అన్ని డ్రాలను ఓపెన్‌చేసి స్ట్రాంగ్‌రూమ్ తాళాలకోసం వెతికారు. ఎక్కడా లేకపోవడంతో స్ట్రాంగ్‌రూమ్ తాళాలను తీసేందుకు స్క్రూడ్రైవర్ ద్వారా ప్రయత్నించారు. దీంతో సైరన్ మోగడం ప్రారంభించింది. వెంటనే దొంగలు కిటికీ గుండా బయటికి వెళ్లి పక్కనే ఉన్న వాహనంలో పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేయితిరిగిన ముఠాపనేనా! దోపిడీకి యత్నించిన తీరును బట్టి చూస్తే ఈ ముఠాలో కనీసం నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు బ్యాంకులోకి వెళ్లిన తీరు, లోన సీసీ కెమెరాల వెర్లను తొలగించడం, వీడియో ఫుటేజీ కనిపించకుండా మోడెమ్‌ను తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే ఇది చేయితిరిగిన ముఠా పనేనని తెలుస్తోంది. వీరుముందే ఇక్కడ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. బ్యాంకు వద్దకు వెళ్లకముందే వీరు గ్రామ సమీపంలోని ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇంటి తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ వాచ్‌మన్ ఉండడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అర్థమవుతోంది. బ్యాంకులో అలారం మోగినపుడు సరిగ్గా సమయం 12.48గా నమోదై ఉంది. అంటే వీరు అర్ధరాత్రి 12నుంచే ఈ దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో కొలమాసనపల్లె గ్రామం ఉలిక్కిపడింది. సంఘటన స్థలాన్నిసందర్శించిన నిపుణులు.. బ్యాంకు వద్ద అలారం మోగిన కాసేపటికే కొందరు స్థానికులు జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరోవైపు పలమనేరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గంగవరం సీఐ రవికుమార్, డీఎస్పీ శంకర్ బ్యాంకును సందర్శించారు. అనంతరం చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌లు ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసుజాగిలాలు బ్యాంకు నుంచి పలమనేరు రోడ్డు మీదుగా గొల్లపల్లె వరకు వెళ్లిఆగాయి. ఇప్పటికే ఈ కేసును ఛేదిం చేందుకు సర్కిల్ ఐడీ పార్టీ రంగంలోకి దిగిం ది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పలమనేరు ఇన్చార్జ్ సీఐ రవికుమార్ తెలిపారు. -
తాళాల్లేవు... నమ్మకముంది!
దైవాదీనం: బయట గార్డు ఉంటాడు.. బ్యాంకు తాళాలేసి ఉంటాయి.. లోపల స్ట్రాంగ్ రూంకు ఇంకో తాళమేసి ఉంటుంది.. అందులో హైలెవెల్ సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య డబ్బు, బంగారం దాచి ఉంటాయి.. అయినా ఆ డబ్బు, బంగారం పోదని గ్యారెంటీ లేదు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా బ్యాంకు దొంగతనాలు ఆగని రోజులివి! అలాంటిది అసలు తాళాలే వేయకుండా, తలుపులే మూయకుండా ఓ బ్యాంకు నడపడం సాధ్యమా? లోపలున్న కోట్ల రూపాయల డబ్బు భద్రంగా ఉంటుందా? ఈ ఆలోచన అసలు ఊహకైనా అందుతుందా? కానీ మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఈ అద్భుతమే చోటు చేసుకుంది. అక్కడ తాళాల్లేని, తలుపులే మూయని బ్యాంకు మొదలైంది. ఇదెలా సాధ్యమైంది? ఈ బ్యాంకు కథేంటి? శని శింగనాపూర్.. పేరును బట్టే ఈ ఊరి కథేంటో చెప్పేయచ్చు. శనీశ్వరుడి ఆలయానికి ప్రసిద్ధి ఈ ఊరు. అహ్మద్‌నగర్ జిల్లాలో మూడు వేల జనాభాతో ఉన్న ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయముంది. తమ గ్రామాన్ని శనీశ్వరుడే పాలిస్తాడని.. ఆయనే తమకు రక్ష అని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఎవరైనా తప్పు చేస్తే శని ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి.. తిష్టవేసుకుని కూర్చుంటాడని.. అతనికి ఎప్పటికీ కష్టాలే అన్నది వారి నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆ గ్రామంలో ఏ ఇంటికీ తాళాలు వెయ్యరు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగతున్న సంప్రదాయం. ఎలాంటి స్థితిలోనైనా గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు మూయడం, తాళాలు వేయడమన్నది జరగదు. ఐతే శని శింగనాపూర్‌లో ఎప్పుడూ దొంగతనాలు లేకుండా ఏమీ లేదు. 2010లో ఓసారి, తర్వాతి ఏడాది మరోసారి రెండు దొంగతనాలు జరిగాయి. అవి మినహాయిస్తే మరే కేసులూ లేవు. గత మూడేళ్ల కాలంలో చిన్న దొంగతనం కూడా జరగలేదు. శని శింగనాపూర్‌లో తాళాలేయని సంప్రదాయం కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ దుకాణాలు, కార్యాలయాలు, గుళ్లు, పాఠశాలలు కూడా తాళాల్లేకుండానే పని చేస్తున్నాయి. తాళాలేయమన్న షరతులతోనే ఇక్కడ దుకాణాలు తెరవాల్సి ఉంటుంది. ఐతే వీటి సంగతి బాగానే ఉంది కానీ.. కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే బ్యాంకుల సంగతేంటి మరి! శని శింగనాపూర్ గ్రామ సంప్రదాయం గురించి తెలియక ఇక్కడ బ్రాంచి తెరుద్దామని చూశాయి చాలా బ్యాంకులు. కానీ బ్యాంకుకు తాళాలేస్తే ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు గ్రామస్థులు. తాళాల్లేకుండా బ్యాంకు తెరవడానికి ససేమిరా అన్నారు అధికారులు. దీంతో బ్యాంకుల ద్వారా కలిగే ప్రయోజనాలేవీ అందక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డారు శని శింగనాపూర్ గ్రామస్థులు. ఐతే శంకర్ గడఖ్ అనే ఎన్సీపీ నేత ప్రయత్నంతో ఓ ముందడుగు పడింది. ఆయన యూకో బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఊరి సంప్రదాయం గురించి చెప్పి, గ్రామస్థులే బ్యాంకును కాపాడుకుంటారని హామీ ఇచ్చారు. ప్రతి బ్యాంకుకూ హై సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పక్కనబెట్టి మరీ యూకో బ్యాంకు శని శింగనాపూర్ తన బ్రాంచి ఆరంభించింది. గ్రామస్థుల కోరిక ప్రకారమే తాళాలేయకుండా బ్యాంకు లావాదేవీలు నడపడానికి అంగీకరించింది. ఈ ఏడాది జనవరిలో మొదలైన శని శింగనాపూర్ యూకో బ్యాంకు బ్రాంచి ఏ ఇబ్బందులూ లేకుండా నడిచిపోతోంది. ఐతే ప్రధాన ద్వారానికి తాళాలు వేయనప్పటికీ.. నగదు, బంగారం ఇతరత్రా ముఖ్యమైన వస్తువులన్నింటినీ కొంచెం భద్రమైన చోటులోనే ఉంచి లావాదేవీలు సాగిస్తున్నారు. బ్యాంకు సిబ్బందిలో కొందరు ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేసుకోగా.. గ్రామస్థులు సైతం బ్యాంకుపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. స్థానిక పోలీసులు, అధికారులు బ్యాంకు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ ఇబ్బందులూ లేకుండా బ్యాంకు కార్యకలాపాలు సాగిపోతున్నాయి. శని శింగనాపూర్‌లోని శనీశ్వరుడి ఆలయానికి రోజూ దాదాపు పది వేల మంది భక్తులు వస్తారు. వారాంతాల్లో ఆ సంఖ్య 50 వేల దాకా ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతుంది కూడా. ఇంతమంది వస్తూ పోతున్నా ఇక్కడి జనాలు ధైర్యంగా తలుపులు, తాళాలు వేయకుండా జీవనం సాగిస్తుండటం విశేషం. అందులోనూ ఓ బ్యాంకు తాళాలే లేకుండా తన కార్యకలాపాలు సాఫీగా సాగిస్తుండటం ఇంకా పెద్ద విశేషం. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంతో ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఆయా స్ట్రాంగ్ రూమ్‌ల పరిధిలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టేబుళ్లు, మెస్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల వద్దకు తేవడం నుంచి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. లెక్కింపు కోసం ఇప్పటికే సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, వలంటీర్లను నియమించారు. కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు కౌంటింగ్ అబ్జర్వర్లను సైతం ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని 10 అసెంబ్లీలకు 143 మంది అభ్యర్థులు, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 27 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ప్రత్యేకంగా పాస్‌లు ఇచ్చారు. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఖమ్మం పార్లమెంట్ ఫలితాలను విజయ ఇంజనీరింగ్ కళాశాల(తనికెళ్ల) వద్ద, కలెక్టరేట్లో వెల్లడించేందుకు ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 14,39,983 మందికి గాను 11,79,136 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 5,77,018 మందికి గాను 4,49,489 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పది నియోజకవర్గాల పరిధిలో 253 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 36 రౌండ్ల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీని ప్రకారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి 36 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే... ఖమ్మంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఖమ్మం అసెంబ్లీ, మౌంట్‌ఫోర్ట్ పాఠశాలలో పాలేరు, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కొత్తగూడెం, తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి, బ్రౌన్స్ కళాశాలలో వైరా నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ ఇలా... కౌంటింగ్ ప్రక్రియకు ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగా, ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపును కౌంటింగ్ హాలులో ఉన్న ఇతర టేబుళ్ల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేపడతారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కింపు టేబుళ్ల వద్దకు తెస్తారు. మొదటి పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్‌ను మొదటి టేబుల్‌తో మొదలై... రెండో పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ రెండో టేబుల్‌కు... ఇలా కొనసాగుతుంది. ప్రతి లెక్కింపు బల్ల వద్ద ఒక పోలింగ్ స్టేషన్లో పోలయిన ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఉన్న లెక్కింపు బల్లల సంఖ్యను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. అంటే ఒక నియోజకవర్గానికి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తే ఒకే రౌండ్లో 12 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారన్నమాట. లెక్కింపు బల్లల సంఖ్య పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రౌండ్లలో గణన జరిగి లెక్కింపు పూర్తవుతుంది. అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 30 నుంచి ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలతోపాటు ప్రజల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ నెలకొనడంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయి... క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే అనుమానాలతో అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. -
సిద్ధార్థ కళాశాల వద్ద తెలుగు తమ్ముళ్ల హడావుడి
ఓటమి భయంతో అర్థరాత్రి స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కళాశాల వద్ద ఓ మీడియా సిబ్బంది కాపలా ఈవీఎంలపై ఎల్లో ప్రచారం సాక్షి,విజయవాడ, పెనమలూరు, న్యూస్‌లైన్ : ఆడలేక మద్దెల దరువు అనే చందాన ఎన్నికల్లో గెలుపు పై నమ్మకంలేక తెలుగుతమ్ముళ్లు బుధవారం అర్థరాత్రి ఈవీఎంలు భద్రపర్చిన కానూరు సిద్ధార్థ కళాశాల వద్ద హడావుడి చేసి భంగపాటుకు గురయ్యారు. ఓ ప్రతిక (సాక్షికాదు)లో పని చేస్తున్న పాత్రికేయులను కళాశాల వద్ద తెల్లవార్లు వేచి ఉన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న హడావుడిని చూసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులతో పాటు,జిల్లా అధికారులు నివ్వెర పోయారు. వివరాలిలా ఉన్నాయి ..కానూరు వీఆర్ సిద్ధార్థ,పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్కాలేజీల్లో జిల్లాకు చెందిన రెండు ఎంపీ,16 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలు పటిష్టమైన కేంద్ర బలగాలు సీఆర్పీఎఫ్ పహారాలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చారు.అయితే బుధవారం అర్ధరాత్రి విజయవాడ టీడీపీ ఎంపీ ఎలక్షన్ ఏజెంట్ అంటూ వచ్చిన వ్యక్తి తాను స్ట్రాంగ్ రూమ్ చూడాలని హడావుడి చేశాడు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు ,ఇతర అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. వీడియో గ్రాఫర్ సమక్షంలో ఆయనను పరిశీలనకు అనుమతించారు.అయితే సదురు అభ్యర్థి ఏజెంట్ కాలేజీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లకు పని చేస్తున్న సిబ్బందిని చూసి లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటానికి కుట్ర జరుగుతుందని తమ్ముళ్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.తీరా అటువంటిది ఏమీ లేదని తెలుసుకుని చల్లగా జారుకున్నారు. తెల్లవారే వరకు ఒక దిన పత్రిక(సాక్షికాదు) విలేకర్లు కళాశాల వద్దనే కాపుకాసి వచ్చే పోయే వాహనాలను వీడియో తీయడం గమనార్హం. ఓటమి భయం... కాలేజీ వద్ద తెలుగుతమ్ముళ్లు, భయంతో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయం ఓ అధికారి మీడియా ముందు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గురువారం జిల్లా కలెక్టర్ రఘునందనరావు కాలేజీలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించి వెళ్లారు.అన్ని సక్రమంగా ఉండటమే కాకుండా కట్టుదిట్టమైన భద్రత ఉండటం పై ఆయస సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాన్‌లో వచ్చారంటూ హడావుడి.... కొంతమంది వ్యక్తులు బొలారో వ్యాన్‌లో సిద్ధార్ధ క ళాశాలలోకి ప్రవేశించారని, తాము వెళ్లే సరికి ఆ వాహనాన్ని వెనుక గేటు నుంచి బయటకు పంపేశారని హడావుడి చేశారు. ఈ వ్యాన్ నెంబర్లు ఎంట్రీగేటులోనూ నమోదు చేయకపోవడంతో తమకు అనుమానం వస్తోందని ఆరోపించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పట్టాభిరామ్ కలెక్టర్ రఘనందనరావు, జాయింట్ కలెక్టర్ మురళి , పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సిద్ధార్థలో డబ్బులు దొరికితే స్పందించని నేతలు.... నగర నడిబొడ్డులో ‘సిద్ధార్ధ’అకాడమీలో సుమారు రూ.3.75 కోట్లు నగదును ఎన్నికలు అధికారులు పట్టుకున్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు కాని, వీరికి వత్తాసు పలికే సదరు దినపత్రిక విలేకర్లు కాని ఏమాత్రం స్పందించలేదు. ఎన్నికలకు ఒకరోజు ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కోట్ల రూపాయల నిధుల్ని అకాడమి భవనం నుంచే రెండు మూడు జిల్లాలకు పంపించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. స్థానిక అధికారులు పట్టుకున్న సొమ్ము పై ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన విషయం విధితమే. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపుపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని రెండు పార్లమెంటు, 16 అసెంబ్లీ (ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం లోని కైకలూరు, నూజివీడు) నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు. ఈ నెల 16వ తేదీన కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో శనివారం ఉదయం స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరి శీలించారు. అవసరమైన చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లకు వెలుపలి భాగంలో టార్పాలిన్ పట్టాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలేజీ లోపలకు ప్రవేశించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి, ఏబ్లాక్ నుంచి ఏ బ్లాక్‌కు చేరుకోవచ్చు, భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. పరిశీలకులకు కేటాయించిన రూమ్‌లు, మీడియా సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. కళాశాల ఆవరణలో వాహనాల కదలికలను నియంత్రించటానికి కొత్తగా వేస్తున్న రోడ్డు మార్గాన్ని కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి తదితర అధికారులు కలెక్టర్‌తో పాటు ఏర్పాట్లను పరిశీలించారు. -
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్: మున్సిపల్, పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈనెల 12న మున్సిపల్ ఎన్నికల ఓట్లను, 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ఎన్నికల ఓట్లను జిల్లా కేం ద్రంలోని నిర్మల హృదయ కాన్వెంట్ స్కూల్ లో లెక్కించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లు గా పోటి చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో కౌటింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీ సులు జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక పోలీ సుల బలగాలను బందోబస్తులో వినియోగిస్తున్నారు. ఈవీఎంలను నిర్మల హృదయ కాన్వెం ట్ స్కూల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరుగనున్న కౌటింగ్‌కు నలుగురు డీఎస్పీల నేతృత్వంలో 12 మంది సీఐలు, ఎస్సై లు 34 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది, కానిస్టేబుళ్లు 159 మంది, మహిళ కానిస్టేబుళ్లు, మహిళ హోంగార్డులు 34 మంది, హోంగార్డులు 61 మంది, మూడు కంపెనీల స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను బందో బస్తుకు వినియోగిస్తున్నారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థుల ఏజెంట్లు, జర్నలిస్టులు మినహా మరెవ్వరిని లోపలకు అనుమతించడం లేదు. లెక్కింపు కేంద్రానికి వందమీటర్ల దూరంలో అభ్యర్థుల అనుచరులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గానీ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ లెక్కింపు బలగాలు ... ఈనెల 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నిజామాబాద్, ఆర్మూర్ సబ్డివిజన్ల పరిధిలోని 18 మండలల ఎంపీటీసీ, జడ్పీటీసీల బ్యాలెట్ బాక్సులను నగరం నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో తిరుమల నర్సింగ్ కాలేజ్‌లో భద్రపరిచారు. ఇక్కడే కౌటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు , సీఐలు 8 మంది, ఎస్సైలు 16 మంది, ఏఎస్సైలు నలుగురు, హెడ్‌కానిస్టేబుళ్లు 32 మంది, కానిస్టేబుళ్లు 172 మంది , మహిళ కానిస్టేబుళ్లు 15 మంది, హోంగార్డులు 20 మందితో పాటు మూడు కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కామారెడ్డిలో ..... కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన సదాశివనగర్ మండలంలోని మర్కల్ వద్ద గల విజయ ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్‌లోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఎస్సైలు 13 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 19 మంది, కానిస్టేబుళ్లు 39 మంది , మహిళ కానిస్టేబుళ్లు 18 మంది, హోంగార్డులు 20 మంది, స్పెషల్ పార్టీ పోలీసుల బృందం విధులను నిర్వహించనున్నారు. బోధన్‌లో .... బోధన్ సబ్‌డివిజన్ పరిధిలోకి వచ్చే మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పట్టణ సమీపంలోని ఆర్కే కాలేజ్‌లో చేపట్టనున్నారు. ఇక్కడ డీఎస్పీ ఒకరు, సీఐలు ఐదుగురు, ఎస్సైలు 19 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది, కానిస్టేబుళ్లు 141 మంది, మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు 23 మంది, హోంగార్డులు 33 మంది , రెండు స్పెషల్పార్టీల పోలీసుల బృందం బందోబస్తు నిర్వహించనున్నారు. -
‘స్ట్రాంగ్’ భద్రత
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో పోలింగ్ ముగియడంతో ఈవీఎంలన్నింటినీ స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఓట్ల లెక్కింపునకు మరో వారం రోజుల గడువు ఉండటంతో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. దీంతో పాటు కౌంటింగ్ రోజు బందోబస్తు కోసం 37 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రాష్ట్రంలోనే ఉంచారు. ఈ కంపెనీల్లో 30 స్ట్రాంగ్ రూమ్స్ వద్ద విధుల్లో ఉండగా... మిగిలిన ఏడింటిని రిజర్వ్‌లో ఉంచారు. తెలంగాణలో 26,135, సీమాంధ్రలో 68,678 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఈవీఎంలను ఆయా జిల్లా హెడ్క్వార్టర్లకు తరలించి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరిచారు. సదరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలనూ అక్కడే ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 ప్రాంతాల్లో స్ట్రాంగ్‌రూమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రం జిల్లా కేంద్రమైన వికారాబాద్‌తో పాటు చేవెళ్లలోనూ స్ట్రాంగ్ రూమ్ ఉంది. స్ట్రాంగ్ రూమ్స్ భద్రతా ఏర్పాట్లివీ... స్ట్రాంగ్ రూమ్‌లకు ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసి ఒకటి రూమ్ ఇన్చార్జ్ వద్ద, మరోటి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ స్థాయి అధికారి వద్ద ఉంచారు. 24 గంటలూ సాయుధ గార్డును ఉంచడంతో పాటు అనునిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. వీటి పక్కనే నిర్విరామంగా పని చేసే కంట్రోల్ రూమ్ నెలకొల్పి ఇందులో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారిని ఉంచారు. రూమ్‌ల వద్ద జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతలో భాగంగా తొలి అంచెలో (రూమ్ డోర్ దగ్గర) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉండాలి. దీనికోసం కనీసం ఒక సెక్షన్ (13 మంది) బలగాలు, 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు ఓ ప్లటూన్ (39 మంది) ప్రత్యేకంగా కేటాయించారు. రెండో అంచెలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో అంచెలో జిల్లా సాయుధ బలగాలను మోహరించారు. ఈవీఎంలు భద్రపరిచిన భవన ప్రాంగణంలోనే స్ట్రాంగ్‌రూమ్ ప్రవేశ ద్వారం కనిపించేలా టెంట్లువేసి అభ్యర్థుల ప్రతినిధులకు సౌకర్యాలు కల్పించారు. ఇలా అవకాశం లేని చోట సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ ద్వారాన్ని టెంట్లో ఉండి చూసేలా, అప్పుడప్పుడు రూమ్స్ సమీపంలోకి స్వయంగా వెళ్లి పర్యవేక్షించే అవకాశం కల్పిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలోకి పోలీసు ఉన్నతాధికారుల సహా ఎవరి వాహనాలను అనుమతించట్లేదు. స్ట్రాంగ్ రూమ్స్ సమీపంలోని వెళ్లే ప్రతి ఒక్కరి వివరాలు కేంద్ర సాయుధ బలగాల వద్ద ఉన్న లాగ్‌బుక్‌లో ఎంట్రీ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియనూ వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కలసి ప్రతి రోజూ స్ట్రాంగ్రూమ్స్ను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక ఇస్తున్నారు. వీరితో పాటు పోలీసు ఉన్నతాధికారులూ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎంలు భద్రం
పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్లు అభ్యర్థులు,అధికారుల సమక్షంలో సీళ్లు బలగాలతో మూడంచెల భద్రత 16న కౌంటింగ్‌కు ఏర్పాట్లు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లను పోలింగ్ అనంతరం సిబ్బంది సంబంధిత స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. అక్కడ వాటిని భద్రపరిచారు. భీమిలి, విశాఖ-తూర్పు, విశాఖ-ఉత్తరం నియోజకవర్గాలవి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి న్యూ క్లాస్ కాంప్లెక్స్‌లో ఉంచారు. విశాఖ-దక్షిణం సెగ్మెంట్వి జైల్‌రోడ్డులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, విశాఖ-పశ్చిమానివి జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కాలేజిలోని, గాజువాకవి మింది వద్ద ఉన్న బీహెచ్‌పీవీ ఎయిడెడ్ తెలుగు మీడియం స్కూల్లో, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలవి ఏయూ మెయిన్ బిల్డింగ్‌లో, నర్సీపట్నంవి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఉంచారు. మాడుగుల, యలమంచిలి నియోజకవర్గాలవి ఏయూ కెమికల్ ఇంజినీరింగ్ బ్లాక్‌లోను, పెందుర్తివి ఏయూ మెరైన్ ఇంజినీరింగ్ బిల్డింగ్‌లో, పాయకరావుపేట నియోజకవర్గానివి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో, అరకు, పాడేరు నియోజకవర్గాలవి రుషికొండ ప్రాంతంలో ఉన్న గాయత్రీ విద్యా పరిషత్ కాలేజిలో ఉంచారు. ఆయా కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపును కూడా చేపట్టనున్నారు. బుధవారం పోలింగ్ అనంతరం ఈవీఎంలను అర్ధరాత్రికి ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాలకు చేర్చారు. పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు కొనసాగడంతో తీసుకురావడం ఆలస్యమైంది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోలు యూనిట్లను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆర్వో సిబ్బంది పీవోల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న వివరాలు సేకరించారు. మొరాయించిన ఈవీఎంల స్థానే ఉపయోగించిన కొత్తవాటి వివరాలు నమోదు చేసుకుని వాటిని పెట్టెల్లో పెట్టి సీళ్లు వేశారు. ఉదయాన్నే ప్రత్యేక వాహనాల్లో పటిష్ట బందోబస్తు మధ్య విశాఖలోని ఆయా కేంద్రాలకు తరలించారు. మూడంచెల భద్రత : ఏయూ ఇంజినీరింగ్ కాలేజి నూతన భవనంలో భద్రపర్చిన ఈవీఎంలను అబ్జర్వర్ అనీల్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు తనిఖీ చేశారు. వారి సమక్షంలో ఆయా గదులకు సీల్ వేయించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు సివిల్ పోలీసులు మోహరించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, అబ్జర్వర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల డైరీ స్క్రూటినీ నిర్వహించారు. అభ్యర్థులు ఎన్నికల నిర్వహణలో జరిగిన లోటుపాట్లను, సలహాలను, సూచనలను అబ్జర్వర్లకు తెలియజేశారు. 16న కౌంటింగ్‌కు ఏర్పాట్లు : ఓట్ల లెక్కింపు అన్ని నియోజకవర్గాలకు ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ఆ రోజు మధ్యాహ్నం 12, ఒంటి గంట సమయానికల్లా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరు వేరుగా కౌంటింగ్ చేపడుతున్నారు. ఎంపీ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, మరో హాల్లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేయడం ద్వారా మధ్యాహ్నం 12 గంటల కల్లా లెక్కింపు పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
‘సీమాంధ్ర’కు జిల్లా పోలీసులు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 7న సీమాంధ్ర జిల్లాల్లో జరగనున్న ఎన్నికల కోసం జిల్లా పోలీసులు తరలనున్నారు. ఏప్రిల్ 30న తెలంగాణ జిల్లాల్లో కేంద్ర బలగాలతోపాటు సీమాంధ్ర జిల్లాల పోలీసులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం సీమాంధ్రలో జరగనున్న ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 2,900 మంది పోలీసుల బలగాలను పంపించనున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం, ఈవీఎంలకు కూడా భారీ భద్రత కల్పించడంలో పోలీసులు సఫలం అయ్యారు. జిల్లా కేంద్రంలో భద్ర పరిచిన ఈవీఎంల బందోబస్తు కోసం ఎస్సై స్థాయి అధికారులను నియమించారు. ప్రతి గంటకోసారి జిల్లా పోలీ సు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాత్రి సమయంలో మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేసిన అధికారులు సెంట్రీల వద్ద ఉన్న రిజి స్ట్రేషన్‌లో సంతకాలు చేయాలి. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ఈవీఎంల భద్రతపై జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సీమాంధ్రకు 2,900 మంది బలగాలు ఈనెల 7న సీమాంధ్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు జిల్లా నుంచి 2,900 మంది పోలీసు బలగాలు బయల్దేరనున్నాయి. వీరిలో డీఎస్పీలు-5, సీఐలు-23, ఎస్సైలు-94, ఏఎస్సైలు-142, హెడ్‌కానిస్టేబుళ్లు- 322, మహిళా కానిస్టేబుళ్లు-40, కానిస్టేబుళ్లు-1,445, హోంగార్డులు-650 మం దిని పంపించనున్నారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు-2080, గుంటూరుకు-250, తిరుపతి-250, రాజమండ్రికి-250 మందిని కేటాయించారు. బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూం జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ ఈవీఎంలను భద్రత పరిచిన స్ట్రాంగ్‌రూంలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటి భద్రత కోసం ఇండో టిబిటెన్ బార్డర్ పోలీసులతోపాటు, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఈనెల 16న సార్వత్రిక ఫలితాలు వెలువడనుండడంతో నేతల భవితవ్యం ఉన్న ఈవీఎంలకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్ర పరిచిన కేంద్రాల్లోని చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫలితాల గడువు మరో పది రోజులు ఉండడంతో పోలీసులు కంటిమీద కునుకులేకుండా ఈవీఎంలకు కాపలాకాస్తున్నారు. రెండు నెలలుగా అలుపెరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలీసులకు ఇప్పుడు ఫలితాలు వచ్చేంత వరకు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఏదేమైన నేతల భవితవ్యం ఉన్న ఈవీఎంలకు భద్రత కల్పించడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. -
స్ట్రాంగ్‌రూంల భద్రతపై నిర్లక్ష్యం వద్దు
అనంతగిరి, న్యూస్‌లైన్: ఈవీఎంలు భ ద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించకూడదని, వాటిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా చేపట్టాలని, లాగ్‌బుక్‌లు, సీసీ టీవీలపై రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ మహావీర్ వైద్య కళాశాలలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌కు సంబంధించిన స్ట్రాంగ్‌రూంలను ఆయన పరిశీలించారు. మొత్తం ఎంతమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లను చూస్తున్నారని ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కళాశాల నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎందుకు ఉందని.. దాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం సమీపంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం భద్రత విషయంలో ఇన్చార్జి అధికారి ఎవరని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ ఎస్ఐ ఉన్నాడని.. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్లాడని వికారాబాద్ సీఐ లచ్చిరాం నాయక్ బదులిచ్చారు. ఇన్చార్జిగా ఎవరినైతే నియమించామో ఆ అధికారి ఇక్కడే ఉండాలి కదా అని కలెక్టర్ పేర్కొన్నారు. లాగ్‌బుక్ ఎక్కడ ఉందని ఆరా తీయగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులపై శ్రీధర్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద గట్టి భద్రత ఉండాలని అడిషనల్ఎస్పీ వెంకటస్వామిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూం భద్రతపై రిటర్నింగ్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక పోలీస్ శాఖ నుంచి ముఖ్య ద్వారం వద్ద భద్రత పటిష్టం చేయాలని, స్థానిక సివిల్ పోలీస్ అధికారిని ఇక్కడ ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సీసీ టీవీలు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. కౌంటింగ్ రోజు మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లోపలికి ఎవరూ రాకుండా గట్టి భద్రత చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, పరిగి రిటర్నింగ్ అధికారి సంధ్యారాణి, చేవేళ్ల ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ నర్సింలు, ఆయా నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. -
స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిన ఈవీఎంలు
16న తేలనున్నఅభ్యర్థుల భవితవ్యం ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు బుధవారం ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఈవీఎంలు సెయింట్ జోసఫ్, మౌంట్‌ఫోర్ట్ హైస్కూళ్లలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఖమ్మం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. భారీ బందోబస్తు మధ్య ఆయా స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. మే 16న కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు వరకు ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధులు నిర్వహించనున్నారు. 16న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో స్ట్రాంగ్‌రూమ్‌లలోని ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు ఉన్నాయి. వీరి భవితవ్యం తేలాలంటే ఈనెల 16 వరకు ఆగాల్సిందే. ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు ఒక అంచనాకు వస్తున్నారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటని బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. -
భద్రత డొల నీళ్లలో ఈవీఎంలు
వికారాబాద్, న్యూస్‌లైన్: ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)ల భద్రత డొల్లేనని తేలింది. అధికారుల నిర్లక్ష్యానికి వికారాబాద్ స్ట్రాంగ్‌రూం ఘటన నిలువుటద్దంగా నిలిచింది. బుధవారం కురిసిన ఆకాల వర్షానికి అందులోని ఓటింగ్ యంత్రాలు తడిసిముద్దయ్యాయి. మోకాల్లోతు నీరు గది లోపలికి చేరడంతో ఈవీఎంలు నీటిలో మునిగాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు తాపీగా అక్కడకు చేరుకొని.. తడిసిన ఈవీఎంలను అరబెట్టడం కొసమెరుపు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 580 బ్యాలెట్ యూనిట్లు, 520 కంట్రోల్ యూనిట్లను ఇక్కడి గదుల్లో ఉంచారు. వీటిని కంటికిరెప్పలా కాపాడేందుకు సాయుధ పోలీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ స్థాయి అధికారిని నియమించారు. అయితే, భారీ వర్షం కురిసిన సమయంలో ఇక్కడ వీరెవ్వరూ లేనట్లు ఉన్నతాధికారుల విచారణలో స్పష్టమైంది. తాపీగా వచ్చారు.. బుధవారం సాయంత్రం ఎడతెరిపిలేకుండా వాన కురిసింది. గాలి కూడా తోడుకావడంతో వాన ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే ఈవీఎంలను భద్రపరిచిన మహావీర్ ఆస్పత్రి గదుల ను వర్షపు నీరు ముంచెత్తింది. స్ట్రాంగ్ రూంలోకి నీరొచ్చిన విషయాన్ని అర్ధరాత్రి తెలుసుకున్న సబ్‌కలెక్టర్/ రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తడిసిన ఈవీఎంలను ఆమెతో సహా ఎన్నికల సిబ్బంది శుభ్రపరిచారు. గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే తిష్టవేసిన ఆమ్రపాలి ఈవీఎంలను అరబెట్టడాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలావుండగా, స్ట్రాంగ్‌రూంలకు కాపలా ఉండాల్సిన పోలీసులు/ ఏఆర్ఓ సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో ఈవీఎంలు నీటమునిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సాయంత్రం వర్షంకురిస్తే అర్ధరాత్రి ఒంటి గంటవరకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వర్షంపడే సమయంలో వీరు అక్కడలేకపోవడంతో సమాచారం చేరవేయలేదని, ఈవీఎంల భద్రతను చూడాల్సిన సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని రిట ర్నింగ్ అధికారిని ఆదేశించినట్లు తెలిసింది. -
స్ట్రాంగ్ రూముల్లో ‘స్థానిక’ బ్యాలెట్లు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసినప్పటికీ లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల వద్ద కట్టు దిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఈ నెల 6వ తేదీన భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, 11వ తేదీన ఖమ్మం డివిజన్ల లో ఎన్నికలు నిర్వహించిన విషయం విది తమే. ఎన్నికల అనంతరం భద్రాచలం రెవె న్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. పాల్వంచ డివిజన్లోని మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను మణుగూరులోని స్త్రీ శక్తిభవనంలో, మరో మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను పాల్వంచలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. కొత్తగూడెం డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన బ్యా లెట్ బాక్సులను పాత ఇల్లెందులోని సింగరేణి ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మరో ఐదు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పాల్వం చ డివిజన్లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు, ఖమ్మం డివిజన్లోని నాలుగు మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రపరి చారు. మిగిలిన ఖమ్మం డివిజన్లోని 13 మండలాల బ్యాలెట్ బాక్సులను కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రేస్ జూనియర్ కళాశాలలో భద్రపరిచారు. వచ్చే నెల 12, 15 తేదీల్లో ఓట్లను లెక్కించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు తప్పని ఎదురు చూపులు.. ఇప్పటికే ఎన్నికలు ముగిసి 12 గడుస్తుండడం, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. -
సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత ఏర్పాట్లపై అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమై మే 7న పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలూ ప్రత్యేక సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసి ప్రతిక్షణం పోలీస్ పహారాతో స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతాచర్యలు అమలు చేస్తామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌కు రెండు ద్వారాలు ఉంటే ఒక ద్వారాన్ని యుద్ధప్రాతిపదికపై ఇటుకల కట్టడంతో మూసివేసి కేవలం ఒక ప్రవేశద్వారాన్ని మాత్రమే ఉండేలా చూస్తామన్నారు. అగ్నిప్రమాదం, వరద ముంపునకు గురికాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సురక్షితమైన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని, సీఆర్పీఎఫ్ పహారాతో భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో అసెంబ్లీ, లోక్‌సభ, ఎన్నికలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని ఎక్కాడా చిన్న లోపం లేకుండా సమగ్ర అవగాహనతో ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. నిత్యం 32 రిపోర్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని, ముఖ్యంగా అభ్యర్థులకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా అమలు చేయాలని సూచించారు. ఓటర్లకు గుర్తింపు కార్డులను అందించడంలో ఎన్నికల సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోవాలో అవసరమైన స్లిప్‌లను పోలింగ్‌కు రెండురోజులు ముందుగానే అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఙస్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, అత్యవసర సమయాలలో ప్రత్యామ్నాయంగా జనరేటర్లను కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు పాల్గొన్నారు. -
కౌంటింగా? వాయిదానా?
సాక్షి, విజయవాడ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ మంగళవారం వీడనుంది. మే ఏడున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తే దాని ప్రభావం ఆ ఎన్నికలపై పడుతుందంటూ హైకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను మే ఏడు వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పలితాలు ముందుగానే ప్రకటిస్తారా.. లేక వీటిని కూడా సాధారణ ఎన్నికలు ముగిసేవరకు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశిస్తుందా అనేది తేలాల్సి ఉంది. మంగళవారం ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇదే అంశంపై జరిగిన వాదోపవాదాల సమయంలో ైెహ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ యథాతథంగా జరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఓటర్లు ఆంత అమాయకులు కాదని, ఈ ఎన్నికల ఫలితాలతో ఎలా ప్రభావితం అవుతారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు అనుకూలంగానే తీర్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటరు తీర్పు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రం... మున్సిపాలిటీల్లో నెలరోజులుగా నెలకొన్న ఎన్నికల హడావిడి ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. ఓటింగ్ యంత్రాలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. ఉగాది కావడంతో ఎన్నికల సిబ్బంది మొత్తం సోమవారం సెలవు తీసుకున్నారు. మంగళవారం కోర్టు తీర్పు వచ్చి కౌంటింగ్ నిర్వహించమని ఆదేశిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈసారి ప్రతిష్టాత్మకమే... ఈసారి నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎన్నడూ లేనివిధంగా 59 డివిజన్లలో గెలుపు కోసం 508 మంది పోటీ పడ్డారు. ఒక్కో డివిజన్లో 16 మంది వరకూ బరిలో ఉండటంతో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే అని లెక్కలు కడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా, జై సమైక్యాంధ్ర పార్టీ ఈ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీలోకి వచ్చాయి. గత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నాటికి ఈ పార్టీలు ఏర్పడని విషయం తెలిసిందే. జై సమైక్యాంధ్ర పార్టీకి గుర్తు కూడా ఖరారు కాకపోవడంతో వేరే పార్టీ గుర్తుపై పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2005 నుంచి పాలకపక్షంగా ఉన్న కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోయింది. వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య పోటీ నడిచింది.