సాక్షి, విజయవాడ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ మంగళవారం వీడనుంది. మే ఏడున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తే దాని ప్రభావం ఆ ఎన్నికలపై పడుతుందంటూ హైకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను మే ఏడు వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పలితాలు ముందుగానే ప్రకటిస్తారా.. లేక వీటిని కూడా సాధారణ ఎన్నికలు ముగిసేవరకు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశిస్తుందా అనేది తేలాల్సి ఉంది. మంగళవారం ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఇదే అంశంపై జరిగిన వాదోపవాదాల సమయంలో ైెహ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ యథాతథంగా జరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఓటర్లు ఆంత అమాయకులు కాదని, ఈ ఎన్నికల ఫలితాలతో ఎలా ప్రభావితం అవుతారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు అనుకూలంగానే తీర్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఓటరు తీర్పు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రం...
మున్సిపాలిటీల్లో నెలరోజులుగా నెలకొన్న ఎన్నికల హడావిడి ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. ఓటింగ్ యంత్రాలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. ఉగాది కావడంతో ఎన్నికల సిబ్బంది మొత్తం సోమవారం సెలవు తీసుకున్నారు. మంగళవారం కోర్టు తీర్పు వచ్చి కౌంటింగ్ నిర్వహించమని ఆదేశిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
ఈసారి ప్రతిష్టాత్మకమే...
ఈసారి నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎన్నడూ లేనివిధంగా 59 డివిజన్లలో గెలుపు కోసం 508 మంది పోటీ పడ్డారు. ఒక్కో డివిజన్‌లో 16 మంది వరకూ బరిలో ఉండటంతో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే అని లెక్కలు కడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా, జై సమైక్యాంధ్ర పార్టీ ఈ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీలోకి వచ్చాయి.
గత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నాటికి ఈ పార్టీలు ఏర్పడని విషయం తెలిసిందే. జై సమైక్యాంధ్ర పార్టీకి గుర్తు కూడా ఖరారు కాకపోవడంతో వేరే పార్టీ గుర్తుపై పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2005 నుంచి పాలకపక్షంగా ఉన్న కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోయింది. వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య పోటీ నడిచింది.
కౌంటింగా? వాయిదానా?
Published Tue, Apr 1 2014 1:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement