నిజామాబాద్‌క్రైం, న్యూస్‌లైన్: మున్సిపల్, పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈనెల 12న మున్సిపల్ ఎన్నికల ఓట్లను, 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ఎన్నికల ఓట్లను జిల్లా కేం ద్రంలోని నిర్మల హృదయ కాన్వెంట్ స్కూల్ లో లెక్కించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్‌లు గా పోటి చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో కౌటింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీ సులు జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక పోలీ సుల బలగాలను బందోబస్తులో వినియోగిస్తున్నారు. ఈవీఎంలను నిర్మల హృదయ కాన్వెం ట్ స్కూల్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరుగనున్న కౌటింగ్‌కు నలుగురు డీఎస్పీల నేతృత్వంలో 12 మంది సీఐలు, ఎస్సై లు 34 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది, కానిస్టేబుళ్లు 159 మంది, మహిళ కానిస్టేబుళ్లు, మహిళ హోంగార్డులు 34 మంది, హోంగార్డులు 61 మంది, మూడు కంపెనీల స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను బందో బస్తుకు వినియోగిస్తున్నారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థుల ఏజెంట్లు, జర్నలిస్టులు మినహా మరెవ్వరిని లోపలకు అనుమతించడం లేదు. లెక్కింపు కేంద్రానికి వందమీటర్ల దూరంలో అభ్యర్థుల అనుచరులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గానీ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ లెక్కింపు బలగాలు ...
ఈనెల 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నిజామాబాద్, ఆర్మూర్ సబ్‌డివిజన్ల పరిధిలోని 18 మండలల ఎంపీటీసీ, జడ్పీటీసీల బ్యాలెట్ బాక్సులను నగరం నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో తిరుమల నర్సింగ్ కాలేజ్‌లో భద్రపరిచారు. ఇక్కడే కౌటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు , సీఐలు 8 మంది, ఎస్సైలు 16 మంది, ఏఎస్సైలు నలుగురు, హెడ్‌కానిస్టేబుళ్లు 32 మంది, కానిస్టేబుళ్లు 172 మంది , మహిళ కానిస్టేబుళ్లు 15 మంది, హోంగార్డులు 20 మందితో పాటు మూడు కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు.
కామారెడ్డిలో .....
కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన సదాశివనగర్ మండలంలోని మర్కల్ వద్ద గల విజయ ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్‌లోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఎస్సైలు 13 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 19 మంది, కానిస్టేబుళ్లు 39 మంది , మహిళ కానిస్టేబుళ్లు 18 మంది, హోంగార్డులు 20 మంది, స్పెషల్ పార్టీ పోలీసుల బృందం విధులను నిర్వహించనున్నారు.
బోధన్‌లో ....
బోధన్ సబ్‌డివిజన్ పరిధిలోకి వచ్చే మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పట్టణ సమీపంలోని ఆర్‌కే కాలేజ్‌లో చేపట్టనున్నారు. ఇక్కడ డీఎస్పీ ఒకరు, సీఐలు ఐదుగురు, ఎస్సైలు 19 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది, కానిస్టేబుళ్లు 141 మంది, మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు 23 మంది, హోంగార్డులు 33 మంది , రెండు స్పెషల్‌పార్టీల పోలీసుల బృందం బందోబస్తు నిర్వహించనున్నారు.
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
Published Sun, May 11 2014 1:40 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement