ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రతపై రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. న్యాయవాదుల బృందంతో జిల్లా ఏఎస్పీ,ఆర్డీవోను కలిసి వైఎస్సార్‌సీసీ నేతలు మెమోరాండంను సమర్పించారు. అనుమతులు లేకుండా స్ట్రాంగ్‌రూమ్‌లోకి ఇతరులు ప్రవేశిస్తున్నారని మండిపడ్డారు. అధికారులే అనుకూల న్యూస్ చానెల్ రిపోర్టర్‌లను వీడియో గ్రాఫర్ పేరుతో స్ట్రాంగ్‌రూమ్‌కు తీసుకువెళ్లడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈవీఎంలకు కల్పించే భద్రత ఇదేనా అని అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు వీడియో కవరేజ్ పేరుతో టీడీపీ నేతలు చెప్పిన వారికే బాధ్యతలు అప్పగించడం విస్మయం కల్గిస్తోందని మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ పుటేజ్ బయటకు వచ్చినా.. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో కలెక్టర్ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సిలార్ దాదా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment