తొలిరోజు రెండే | ZPTC, MPTC Elections Nominations Adoption Began | Sakshi
Sakshi News home page

తొలిరోజు రెండే

Published Tue, Mar 18 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

ZPTC, MPTC Elections Nominations Adoption Began

 ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పర్వం సోమవారం ప్రారంభమైంది. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 903 ఎంపీటీసీ పదవులకు జెడ్పీ సీఈవో ద్వారంపూడి వెంకటరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ పదవులకు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు. నరసాపురం జెడ్పీటీసీ స్థానం నుంచి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంగలపూడి ఏషయ్య నామినేషన్ దాఖలు చేశారు. శ్యాంసన్ అనే ఓటరు ఆయన పేరును ప్రతిపాదించగా,  బొక్కా నాగేశ్వరరావు, మాదాసు శ్రీరాములు అనేవారు బలపరిచారు.
 
 ఏషయ్య 2009 ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యే పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇదిలావుండగా, ఉండ్రాజవరం జెడ్పీటీసీ పదవికి బీజేపీ తరఫున తాడిపర్రు గ్రామానికి చెందిన అక్కిన గోపాలకృష్ణ నామినేషన్ వేశారు. ఈనెల 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. మరోవైపు ఎంపీటీసీ పదవులకు పోటీచేసే అభ్యర్థుల నుంచి జిల్లాలోని 46 మండల పరిషత్ కార్యాలయూల్లో నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు 49 నామినే షన్లు దాఖలయ్యాయి. మండల పరి షత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 22లక్షల 40 వేల 336 మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 2,749 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement