వసూలు కాని సెస్ | collecting non-tax | Sakshi
Sakshi News home page

వసూలు కాని సెస్

Published Sat, Nov 19 2016 3:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

వసూలు కాని సెస్

వసూలు కాని సెస్

గ్రంథాలయూలకు రాబడి కరువు
  సహకరించని మున్సిపల్, గ్రామ పంచాయతీలు..
  లక్ష్యం రూ.కోటి 50 లక్షలు.. వసూలు రూ.40 లక్షలే..
  సౌకర్యాలు లేక అవస్థలు.. పాఠకులకు సేవలు అంతంతే..

 
ఆదిలాబాద్ కల్చరల్/దండేపల్లి :  విజ్ఞాన భాంఢాగారాలు.. సరస్వతీ క్షేత్రాలుగా పేరొందిన గ్రంథాలయూలకు సెస్ బకారుులు ఏటా పెరిగిపోతున్నారుు. ఏళ్ల తరబడి మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు పన్ను ఎగనామం పెడుతున్నారుు. లక్ష్యాన్ని మించి వసూలైన దాఖలాలు ఇప్పటికీ లేవు. పన్నులు వసూలు కావడం లేదనే సాకుతో కొన్ని మున్సిపాల్టీలు సగమే పన్నులు చెల్లిస్తుండగా.. మరికొన్ని 20 శాతం మాత్రమేచెల్లిస్తున్నారుు. వీటికి తోడు గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూలు కావడం లేదని సెస్ చెల్లించడమే మానేశారుు. ఫలితంగా గ్రంథాల యూలకు రాబడి కరువై సౌకర్యాల కల్పనలో వి ఫలమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 గ్రంథాలయూలు, 81 బుక్ డిపో సెంటర్లు ఉన్నారుు. వీటిలో రెండు మాత్రమే అద్దె భవనాల్లో కొనసాగుతండగా.. మిగితా వాటికి గ్రామ పంచాయతీ కార్యాలయూలు, పాఠశాలల ఆవరణలో గదులు కేటారుుంచారు.

వసూలు కాని పన్ను... ఎక్కడి పనులు అక్కడే..
ప్రతీ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు వసూలు చేసే ఆస్తి పన్నుల్లో 8 శాతం పన్ను గ్రంథాలయ పన్నుగా గ్రంథాలయూలకు చెల్లించాల్సి ఉంటుంది. వాటితో పుస్తకాల కొనుగోలు, భవనాల నిర్మాణాలు, పత్రికల బిల్లులు, పార్ట్ టై ఉద్యోగులు, స్వీపర్ల వేతనాలు, విద్యుత్ చార్జీలు ఇతరత్రా ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. సెస్ చెల్లించకపోవడంతో కొత్త పుస్తకాల కొనుగోలు, భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయూరుు. 2012-13 సంవత్సరంలో కొనుగోలు చేసిన పుస్తకాలనే ఇప్పటికీ పాఠకులు చదువుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త పుస్తకాలు వచ్చిన దాఖలాలు లేవు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని పలుమార్లు విద్యార్థులు అధికారులకు విన్నవించినా.. సెస్ వసూలు కాక కొనలేని పరిస్థితి నెలకొంది. తలమడుగు, మామడ మండల కేంద్రాల్లో గ్రంథాలయ నిర్మాణానికి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చినా నిర్మాణానికి నిధులు సమకూరడం లేదు.

నామమాత్రమే చెల్లింపులు
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రధాన వనరు సెస్. ఈ పన్ను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో గ్రంథాలయాలు సమస్యలకు చేరువవుతున్నాయి. 2013-14 సంవత్సరంలో రూ.కోటి 25 లక్షల పన్ను రావాల్సి ఉండగా.. రూ.79,77,719 మాత్రమే వచ్చాయి. 2014-15లో రూ.కోటి 30 లక్షలు లక్ష్యం ఉండగా రూ.84,16,724 పన్ను వసూలైంది. 2016 సంవత్సరంలో రూ.కోటిన్నర సెస్సు వసూలు లక్ష్యం కాగా రూ.89,74,143 గ్రంథాలయాలకు వచ్చింది. 2016-17 సంవత్సరానికి గాను రూ.కోటి 50 లక్షల సెస్సు వసూలు లక్ష్యం ఉండగా అక్టోబర్ మాసం వరకు రూ.40 లక్షలు మాత్రమే చెల్లించారు. ఏళ్లుగా గ్రంథాలయాలకు ఇదే తీరుగా పన్ను వసూలు అవుతుండడంతో గ్రంథాలయాల్లో సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తుతున్నారుు.

50 శాతం కంటే తక్కువే..
ఉమ్మడి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి వచ్చే ఆస్తి పన్నులో 8 శాతం గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మున్సిపాలిటీలు 50 శాతం వరకు పన్నులు ఏటా చెల్లిస్తున్నాయి. భైంసా, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో నుంచి 20 శాతం కంటే ఎక్కువ సెస్సు రావడం లేదు. గ్రామ పంచాయతీలు అంతంత మాత్రంగానే సెస్సు చెల్లిస్తున్నాయి. పూర్తిస్థాయిలో పన్ను వసూలు కావడం లేదని మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రంథాలయ సెస్సుకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
 
సెస్సు వసూలుకు చర్యలు..
ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యవస్థనే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుండడంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పలుమార్లు లేఖలు రాశాం. ఉన్నతాధికారులు స్పందించి పన్ను వసూలుకి సహకరిస్తే గ్రంథాలయాల అభివృద్ధి సాధ్య పడుతుంది. మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారులకు సైతం లైబ్రేరియన్ల ద్వారా సెస్సు వసూలు అంశాన్ని పరిశీలించే విధంగా చూడాలని చెబుతున్నాం. లైబ్రేరియన్లతోపాటు అధికారులకు ఈ సమస్యను ప్రతిఏటా విన్నవిస్తూనే వస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి గ్రంథాలయ పన్ను వసూలు అయ్యేలా చూడాలి. సెస్సు వసూలు కాక పోటీ పరీక్షల అభ్యర్థులకు కొత్త పుస్తకాలు కొనుగోలు చేయని పరిస్థితిలో గ్రంథాలయాలు ఉన్నాయి.
  - ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement