సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలోని గ్రామ పంచాయితీల హోదా మారబోతుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయితీలను గ్రేటర్‌లో విలీనం చేయాలని చేసిన ప్రభుత్వ ప్రయత్నానికి న్యాయ పరమైన అడ్డంకులు ఏర్పడడంతో మధ్యే మార్గంగా ఆ పంచాయితీలను మున్సిపాలిటీలుగానో, నగర పంచాయితీలుగానో చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.
మున్సిపాలిటీల్లో విలీనమయ్యే గ్రామ పంచాయితీల జనాభా ఆధారంగా నగర పంచాయితీగా గానీ, మున్సిపాలిటీగా గాని నిర్ణయిస్తారు. ఈ మేరకు తొలుత 15 మున్సిపాలిటీలు/నగర పంచాయితీల ప్రతిపాదనలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిం చారు. అయితే అందులో వివిధ కారణాల వల్ల కాల్వంచ, మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లిలను తోసిపుచ్చిన ప్రభుత్వం.. మిగతా పన్నెండింటికీ ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కొత్త మున్సిపాలిటీ/ నగర పంచాయితీలకు కార్యరూపం ఇచ్చే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర విభజన అంశం దుమారం లేపుతున్న తరుణంలో త్వరలోనే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రతిపాదిత మున్సిపాలిటీ/ నగర పంచాయితీలు ఇవే...
మున్సిపాలిటీ/నగర పంచాయితీ- విలీనమయ్యే గ్రామాలు- మండలం
శంషాబాద్- శంషాబాద్, శాతం రాయి, కొత్వాల్ గూడ- శంషాబాద్
నార్సింగి నార్సింగి, గండిపేట, వట్టినాగులపల్లి,నెక్నంపూర్, పుప్పాలగూడ, ఖానాపూర్, మంచిరావుల, కోకాపేట- రాజేంద్రనగర్
బండ్లగూడ జాగీర్ -బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, హిమయత్ సాగర్, పీరంచెరువు, హైదర్‌షా కోట్-
రాజేంద్రనగర్
నిజాంపేట- నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి- కుత్బుల్లాపూర్
కొంపల్లి- కొంపల్లి, దూలపల్లి- కుత్బుల్లాపూర్
జిల్లెలగూడ- జిల్లెలగూడ- సరూర్‌నగర్
కొత్తపేట- కొత్తపేట, బాలాపూర్‌లో కొంత భాగం(సర్వేనంబర్ 140 నుంచి 253)
మీర్‌పేట మీర్‌పేట- సరూర్‌నగర్
జల్‌పల్లి జల్‌పల్లి, పహడీషరీఫ్ సరూర్‌నగర్
బోడుప్పల్- బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్, చెంగిచెర్ల- ఘట్‌కేసర్
జవహర్‌నగర్- జవహర్‌నగర్- షామీర్‌పేట
నాగారం -నాగారం, దమ్మాయిగూడ -కీసర
కొత్తగా 12 మున్సిపాలిటీలు!
Published Tue, Dec 24 2013 12:22 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement