దండేపల్లి : గ్రంథాలయాలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్ బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో అ భివృద్ధి కుంటుపడుతోంది. సెస్ ద్వారానే గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. వసూళ్లు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 గ్రంథాలయాలు ఉండగా.. 16గ్రంథాలయాలకు మా త్రమే సొంత భవనాలున్నాయి.
35 గ్రంథాలయాలను పంచాయతీ కార్యాలయాలు, ఉచిత భవనాల్లో నిర్వహిస్తుండగా ఖానాపూర్‌లోని శాఖ గ్రంథాలయాన్ని అద్దె భ వనంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 5 వేల మంది పాఠకులు గ్రంథాలయాల సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 వేల మంది గ్రంథాలయ డి పాజిట్‌దారులు ఉన్నారు.
రూ.50 లక్షల వరకు బకాయిలు..
గృహ వినియోగదారులు చెల్లించే ఇంటి పన్నులో నుంచి 8 శాతం పన్ను గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. జిల్లాలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏటా రూ. కోటి వరకు సెస్ వస్తుంది. ఇందులో మున్సిపాలిటీల ద్వారా సుమారుగా రూ.70 లక్షలు, పంచాయతీల ద్వా రా రూ.30 లక్షలు. అయితే సెస్‌లో అధిక బాగం మున్సిపాలిటీల నుంచే రావాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదని గ్రంథాలయ సంస్థ అధికారులు అంటున్నారు.
గ్రామ పంచాయతీల్లో కేవలం మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల పంచాయతీలు మాత్రమే సెస్ చెల్లిస్తుండగా మిగతా జీపీల నుంచి అసలు సెస్ రావడం లేదంటున్నారు. మున్సిపాలిటీలు కూడా పూర్తిస్థాయిలో చెల్లించడం లేదు. ఏటా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే వసూలవుతోంది.
కుంటుపడుతున్న అభివృద్ధి..
గ్రంథాలయాల అభివృద్ధికి సెస్ ప్రధానం. గ్రంథాలయాలకు వచ్చే సెస్‌ను పుస్తకాలు, వివిధ దినపత్రికల కొనుగోలుకు, పార్ట్‌టైం వర్కర్లకు వేతనాలు, పుస్తక నిక్షిప్త కేం ద్రాల నిర్వహణకు వినియోగిస్తుంటారు. ఇవే కాకుండా నూతన భవనాల నిర్మాణానికి కూడా వాడుతుంటారు. సెస్ వసూలు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు.
లక్షల్లో సెస్ బకాయిలు
Published Thu, Nov 20 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement