సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆదివారం లేఖ రాశారు.
ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వీరికి కనీస వేతనం కూడా దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40వేల మంది కారోబార్, బిల్ కలెక్టర్, పారిశుధ్య సిబ్బంది పంచాయతీల్లో పనిచేస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంచాయతీ ఉద్యోగులను క్రమబద్ధీకరించారన్నారు. పంచాయతీ పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరిని క్రమబద్ధీకరిస్తే మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment