⇒ ‘ఏకగ్రీవ’ సర్పంచులను మరిచిన సర్కారు
⇒ ప్రొత్సాహకాలను పట్టించుకోని వైనం
⇒ రెండేళ్లుగా 74 పంచాయతీల ఎదురుచూపు
⇒ రూ.6.11 కోట్ల విడుదలపై నిర్లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాస్వామ్య భారతావనిలో తొలిదశ పాలనా వ్యవస్థ పంచాయతీలదే. ఇందులో గ్రామీణుల బాగోగులు, ప్రగ తి పనులు, మౌలిక సదుపాయల కల్పన తదితర బాధ్య తలన్నింటినీ నెరవేర్చాల్సింది సర్పంచులే. అందుకే పల్లెలను రాజకీయ సంగ్రామానికి దూరంగా ఉంచేందుకు సర్కా రు ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించింది.
ఈ క్రమంలో పలువురు సర్పంచులు పోటీ లేకుండానే పల్లె పీఠంపై కూర్చున్నారు. వారు పదవులు చేపట్టి రెం డేళ్లు గడుస్తున్నా నేటికీ, నజరానాలు రాకపోవడంతో వారు నైరాశ్యం లో మునిగిపోయారు. నజరానా వస్తుందని, గ్రామాలలో మౌలిక వసతులు కల్పించవచ్చని ఆశించినా ఫలితం లే కుండాపోరుుంది. అభివృద్ధికి సంబంధించి ప్రజలకు జవా బు చెప్పలేని స్థితిలో పడిపోయారు.
మూడు దశలుగా ఎన్నికలు
జిల్లాలో 718 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి 2013 జూలై 23,27,31 తేదీలలో ఎన్నికలు జరిగాయి. మూడు డివిజన్ల పరిధిలో ఎలాంటి ఘర్షణలు, పోటీ లేకుండా 74 గ్రామ పంచాయతీలకు ప్రజలు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లో 38 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి డివిజన్‌లో 22, బోధన్ డివిజన్‌లో 14 పంచాయతీలు ఎలాంటి ఉత్కంఠ లేకుండా ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీలన్నింటికీ జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏకగ్రీవ సర్పంచుల ఆశలు నీరుగారుతున్నారుు. పల్లెల అభివృద్ధి కోసం వస్తున్న ఆర్థిక సంఘం నిధులను ఒక పక్క విద్యుత్ బకాయిల పేరుతో లాక్కుంటూ, ఇంకోపక్క ప్రోత్సహకాలు విడుదల చేయక తాత్సారం చేస్తున్నారని సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి సాధిస్తాయనే
పోటీ లేకుండా పాలకవర్గాన్ని ఎన్నుకుంటే, ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వాలు ‘ఏకగ్రీవాలను’ ప్రోత్సహించాయి. ప్రభుత్వం ఇ చ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు పలుచోట్ల సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోలిస్తే, మన జిల్లాలోనే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఏకగ్రీవంగా ఎన్నికైనవాటిలో మైనర్ గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీకి రూ. 10 ల క్షలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నజరానాలు పెంచింది. మైనర్ పంచాయతీలకు రూ.7 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో ఏకగ్రీవమైన మొత్తం 74 గ్రామ పంచాయతీలలో 31 మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 3.10 కోట్లు, 43 మైనర్ పంచాయతీలకు రూ.3.01 లక్షల నజరానా రావాలి.
ఇంకా ఎన్నాళ్లు?
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన ప్రోత్సాహం ఇవ్వడాన్ని ప్రభుత్వం మరచిపోయింది. సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండేళ్లు కావస్తున్నా ప్రోత్సాహం ఊసే లేదు. నిధులు లేక గ్రామపంచాయతీలు నిర్వీర్యమైపోతున్నాయి. కనీసం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహమైనా ఆసరాగా ఉంటుందంటే అది కూడా రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రోత్సాహకాలను విడుదల చేయాలి.
-గడ్డం నర్సారెడ్డి, సర్పంచ్, కొత్తపల్లి(ఎన్)
ఏదీ నజరానా!
Published Wed, May 6 2015 2:44 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement