Honorary wage
-
స్థానిక సంస్థలకు గౌరవం
గుర్తింపు ఇచ్చిన సర్కారు {పజాప్రతినిధులకు పెరిగిన వేతనం జిల్లాలో 1,891 మందికి ప్రయోజనం {పభుత్వ నిర్ణయంపై {పతినిధుల ఆనందం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి.. మే 1న వేతనం వరంగల్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దీర్ఘకాలిక డిమాండ్ ఫలించింది. గౌరవ వేతనం లేదని అసంతృప్తిగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. గౌరవ వేతనంగా వీరికి ప్రతీనెలా ఇస్తున్న మొత్తాన్ని భారీగా పెంచింది. స్థానిక సంస్థల్లో హోదాల మేరకు గౌరవ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పెంచిన గౌరవ వేతనాలు అమల్లోకి రానున్నాయి. మే 1 నుంచి పెంచిన వేతనాలు అందుకుంటారు. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి 1,891 మంది ఉన్నారు. మంగపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన అన్ని పదవులకు ప్రతినిధులు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు ఇప్పటివరకు నెలకు రూ.7,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. ప్రభుత్వం లక్ష రూపాయలకు పెరిగింది. వరంగల్ నగరపాలక సంస్థ పరిపాలనలో కీలకమైన మేయర్‌కు ప్రస్తుతం నెలకు రూ.14వేల గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు దీన్ని రూ.50 వేలకు పెంచారు. డిప్యూటీ మేయర్‌కు ప్రస్తుతం రూ.8 వేలు ఉంది. దీనిని రూ.25 వేలకు పెంచారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో 58 డివిజన్లు ఉన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ను మినహాయిస్తే మిగిలిన కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. ఈ మొత్తం నెలకు రూ.3.36 లక్షలు ఉంటుంది. వరంగల్ మహా నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. జిల్లాలో 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంగపేటలోని 18 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 944 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మేరకు వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం దక్కనుంది. మొత్తంగా జిల్లాలోని సర్పంచ్ల గౌరవ వేతనం కోసం ప్రతి నెల రూ.48.10 లక్షలు ఖర్చు కానుంది. జిల్లాలో 705 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) సభ్యులు ఉన్నారు. పెంచిన గౌరవ వేతనం ప్రకారం వీరికి నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఎంపీటీసీల్లో 50 మంది మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల రూ.10 వేల చొప్పన గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీల గౌరవ వేతనం కోసం ప్రతి నెల రూ.37.75 లక్షలను ప్రభుత్వం ఇవ్వనుంది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జెడ్పీటీసీ) సభ్యులు 50 మంది ఉన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మేరకు వీరికి నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం అందనుంది. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఈ గౌరవ వేతనం అందుతుంది. ఇది ప్రతి నెల రూ.4.80 లక్షలు ఉంటుంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు జెడ్పీ చైర్పర్సన్, మరొకరు డిప్యూటీ చైర్పర్సన్ ఉన్నారు. జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ 28 మంది చొప్పున మొత్తం 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగరపంచాయతీలు ఉన్నాయి. ఈ మూడు నగర పంచాయతీల్లోనూ 20 మంది చొప్పున కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తంగా ఐదు పురపాలక సంఘాల్లో.. ఐదుగురు చైర్మన్లకు నెలకు రూ.7,500 చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. డిప్యూటీ చైర్పర్సన్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. చైర్పర్సన్, డిపూటీ చైర్పర్సన్లను మినహాయిస్తే ఉండే 86 మంది కౌన్సిలర్లకు ప్రతి నెల రూ.2500 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలకు గుర్తింపు ప్రజలకు నేరుగా సేవలు అందించే స్థానిక సంస్థలకు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ప్రజలతో ఎన్నికైనా.. ఇన్నాళ్లు తక్కువ గౌరవ వేతనంతో సమాజంలో ఒకరకమైన ఇబ్బంది ఉండేంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని తొలగించింది. పెంచిన గౌరవ వేతనంతో అన్ని స్థాయిల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన కొత్త గౌరవ వేతనంతో మాపై బాధ్యత పెరిగింది. రాజకీయ అవినీతిని అంతం చేస్తానని చెప్పిన కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. గౌరవ వేతనం పెంపు మాలాంటి ప్రజాప్రతినిధులకు ఎంతో మనోధైర్యం పెంచింది. - గద్దల పద్మ, జెడ్పీ చైర్పర్సన్ -
గౌరవం లేదు..
గౌరవ వేతనం ఇంకెప్పుడిస్తారు.. ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రామాల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండేది సర్పంచులే అయినందున సర్పంచు మమ్మల్ని గుర్తించాలి. జూలై 27 వస్తే సర్పంచ్‌లు గెలిచి సంవత్సరం కావస్తున్నా వేతనాల గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సర్పంచులను ప్రభుత్వం గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు చేయాలి. సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే వరకు అందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తాం. - సీదర్ల రమేశ్, సర్పంచ్, కిష్టాపూర్ ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం లేదు. మేజర్ గ్రామ పంచాయతీ(జీపీ) సర్పంచ్‌లకు గౌరవ వేతనం నెలకు రూ.1,500, మైనర్ జీపీ సర్పంచ్‌లకు నెలకు రూ.1000 చొప్పున ఇవ్వాలి. ఇందులో ప్రభుత్వం వాటా సగమైతే, మిగతా సగం గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు ఎన్నికై పది నెలలు అవుతున్నా వేతనం రావడం లేదు. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలలో 27 మేజర్ జీపీ సర్పంచ్‌లకు రూ.750, మిగతా 839 జీపీ సర్పంచ్‌లకు రూ.500 చొప్పున రూ.4.39 లక్షలు ఏప్రిల్ నెల వేతనంగా మాత్రమే ఇచ్చారు. కాగా, ప్రస్తుత సర్పంచ్ల తొమ్మిది నెలల వేతనం రూ.39.57 లక్షలు, గత సర్పంచ్‌లకు రావాల్సిన 30 నెలల వేతనం రూ.11.87 కోట్లు కలిపి మొత్తం రూ.12.26 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రూ.12.26 కోట్లు 2006లో సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని 866 మంది సర్పంచ్‌లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.4.39 లక్షలు చెల్లిస్తారు. గత సర్పంచ్ల పదవీ కాలం ఐదేళ్లలో 30 నెలలకు సంబంధించి గౌరవ వేతనాలు ఇచ్చారు. మిగతా 30 నెలలకు చెందిన వేతనాలు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల వేతనం ఇచ్చిందన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే గత సర్పంచ్‌లకు చెందిన 30 నెలల వేతనం కింద రూ.11.87 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సర్పంచ్‌లు ఎన్నికై పది నెలలు అవుతుంది. వీరికి ఇప్పటివరకు వేతనాలు లేవు. ఒక ఏప్రిల్ నెల వేతనం కింద రూ.4.39 లక్షలు అందజేశారు. మిగతా తొమ్మిది నెలల గౌరవ వేతనం రావాల్సి ఉంది. పాత వారి వేతనాలు అటుంచితే కొత్త వారికి రావాల్సిన వేతనాలు ఇవ్వాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు. పెరగని గౌరవం ప్రభుత్వం సర్పంచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనం పెరగలేదు. గతంతో ఇచ్చిన వేతనాలే ఇప్పుడూ ఇస్తుంది. అయితే ఆ వేతనాలు సక్రమంగా కూడా ఇవ్వడం లేదు. అసలు వేతనాలు ఇస్తుందో లేదో కూడా తెలియదని పలువురు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సర్పంచ్ల రావాల్సిన వేతనాలు వస్తాయా.. రావా.. అనేది కచ్చితంగా చెప్పలేమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఒక నెల వేతనాలు ఇచ్చి దానినే మూడు నెలలకు సరిపడా వేతనాలుగా సర్దుకోమని ప్రభుత్వం పలుమార్లు సూచించినట్లుగా అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గ్రామాభివృద్ధిలో భాగస్వాములమయ్యే తమకు ఇప్పటికైనా ప్రభుత్వం నెలనెల వేతనాలు ఇవ్వాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు. -
‘ఎంపీటీసీలకు 6 వేల గౌరవ వేతనమివ్వాలి’
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎంపీటీసీల ద్వారానే ఖర్చు చేయాలని, వారికి నెలవారీ గౌరవ వేతనం కింద రూ.6 వేలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎంపీటీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఫోరం(టీఎస్ ఎంపీటీసీ ఫోరం) కన్వీనర్ బొల్లి స్వామి డిమాండ్ చేశారు. తెలంగాణలోని 6,277 మంది ఎంపీటీసీల్లో 1,497 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని, రాష్ర్ట అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన ఫోరం ఆవిర్భావ సభలో స్వామి మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపీటీసీలకు అధికారాలు, హోదా కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం కానున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఫోరం నేతలు విజయ్‌కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా ‘గౌరవం’
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించి న ఉద్యోగులు తమకు చెల్లించిన గౌరవ వేతనంపై అసంతృప్తితో ఉన్నారు. ఆయా ప్రాంతా ల దూరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ ఒకే రీతిలో భత్యం చెల్లించడంపై గుర్రుగా ఉన్నారు. సమీప, సుదూర నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించిన వారికి ఒకే విధమైన భత్యం ఇవ్వ డం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు పోలింగ్ కేం ద్రాల్లో అవస్థలు పడ్డామని ఆవేదనతో ఉన్నారు. ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించే స్థానం నుంచి దూరాన్నిబ ట్టి గౌరవ వేతనం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మండు వేసవిలో గంటల తరబడి ప్రయా ణం చే యడం, తిరుగు ప్రయాణంలోనూ అదే స్థా యిలో అవస్థలు ఎదుర్కొన్నా తమకు నిబంధనలు సాకుగా చూపి తక్కువ చెల్లించడం సరికాదని పేర్కొంటున్నారు. నిబంధనలు హుష్‌కాకి జిల్లావ్యాప్తంగా పీవోలు, ఏపీవోలు 5,297, ఓపీవోలు 10,707 మంది సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించారు. వీరికి పోలింగ్ ఆఫీసర్(పీవో)కు రూ.350, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్(ఏపీవో), అదర్ పోలింగ్ ఆఫీసర్(ఓపీవో)లకు రోజుకు రూ.250 చెల్లించారు. ఎన్నికల విధుల్లో భాగంగా రెండ్రోజుల శిక్షణ, రెండ్రోజుల విధి నిర్వహణ ఉంటుంది. మొదట శిక్షణ ఉద్యోగి తాను విధులు నిర్వర్తించే మండలంలో ఉంటుంది. రెండో శిక్షణతోపాటు ఎన్నికల విధుల కోసం సంబంధిత నియోజకవర్గానికి వె ళ్లాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు సంకటంగా మారింది. ఉదాహరణకు ముథోల్‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పలువురికి సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు వేశారు. వారు ఒక సారి శిక్షణకు వచ్చి వెళ్లేసరికే రూ.350 ఖర్చు అవుతాయి. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణ సమయం అదనం. విధుల నిర్వహణ గౌరవ వేతనం తక్కువగా ఉన్నా టీఏ, డీఏ చెల్లించడంలో నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు. ఎనిమిది కిలోమీటర్ల పైబడి విధులు నిర్వహించేవారికి కిలో మీటర్లను బట్టి ప్రయాణ భత్యం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. కానీ, అధికారులు అవేమి పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహా సమస్య ఎదురైందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అధికారులతో అవస్థలు.. కానరాని ఏర్పాట్లు.. పోలింగ్ రూట్లు, ఏర్పాట్లపై అవగాహన లేకుండా వ్యవహరించిన కొందరు ఎన్నికల అధికారుల వల్ల ఇబ్బందు లు ఎదుర్కొన్నట్లు సిబ్బంది వాపోతున్నారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి వరకు సామగ్రి పంపిణీ చేయకపోవడంతో ఇక్కట్లు పడ్డట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అధికారులతో పలువురు సిబ్బంది గొడవకు దిగారు. రాత్రి వేళల్లో సామగ్రిని తీసుకొని ఇబ్బందుల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో దాదాపు సగం చోట్ల సిబ్బందికి వసతులు కల్పించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయా ప్రాంతాల్లో కనీసం విశ్రాంతి తీసుకునే వాతావరణం లేకపోవడం పోలింగ్ విధులు చేపట్టేందుకు వెళ్లిన వారిని అసహనానికి గురి చేసింది. మహిళా సిబ్బంది బాధలైతే వర్ణనాతీతం. కనీస అవసరాలు కల్పించకపోవడంతో మారుమూల ప్రాంతాలతోపాటు మండల కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన వారు ఇబ్బంది పడ్డారు. సంబంధిత మండలాల్లోని రేషన్ డీలర్లను ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్లు ఆదేశించారు. వారు సిబ్బందికి ఏర్పాట్లు చేయలేక ఇబ్బందులు పడ్డారు. రీఫ్రెష్మెంట్ అలవెన్స్ కింద ఒక్కో ఉద్యోగికి రూ.150 రోజుకు చెల్లించాల్సి ఉంది. ఇవి ఉద్యోగులకు అందించలేదు. మరోవైపు వారికి భోజన ఏర్పాట్లు రేషన్‌డీలర్ల చేత చేయించారు. ఈ నేపథ్యంలో రీఫ్రెష్మెంట్ కోసం కేటాయించిన రూ. లక్షల నిధులు ఖర్చుచేసినట్లు మాయ చేస్తారా లేక తిరిగి ప్రభుత్వానికి పంపిస్తారా అనేది తేలాల్సి ఉంది. -
పెరిగిన పార్ట్‌టైమ్ వీఆర్వోల గౌరవ వేతనం
సాక్షి, హైదరాబాద్: పార్ట్‌టైమ్ గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓల) గౌరవ వేతనం రూ. 4900 నుంచి రూ. 10,000కు పెరిగింది. ఈమేరకు రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వీఆర్వోల సమాఖ్య అధ్యక్షుడు భక్తవత్సల నాయుడు, తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌కు, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్పరాజు వెంకటేశ్వర్లు -
సాక్షర భారత్ కు నిధుల గండం
= నిలిచిన రూ. 6.61 కోట్ల నిధులు = మండల, గ్రామ కో ఆర్డినేటర్లకు అందని జీతాలు = 15 నెలలుగా పస్తులుంటున్నామని ఆవేదన యర్రగొండపాలెం, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాక్షర భారత్ కార్యక్రమం నీరుగారే దశలో ఉంది. మండల, గ్రామ కోఆర్డినేటర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా గ్రామాల్లో సాక్షర భారత్ కార్యక్రమాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం, మహిళా సంఘాలకు చెందిన సభ్యులకు ఇది ఇంతో ఉపయోగకరం. ఉదయంపూట అందరి చేత పత్రికలు, కథల పుస్తకాలు చదివి వినిపించి, పనులకు వెళ్లి తిరిగి వచ్చాక రాత్రి వేళల్లో అక్షరాలు నేర్పించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే మండల, గ్రామ కోఆర్డినేటర్లకు వారికిచ్చే స్వల్ప వేతనం కూడా నెలల తరబడి ఇవ్వడం లేదు. జిల్లాలోని 1041 పంచాయతీల్లో 2082 సాక్షర భారత్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక్కో గ్రామ కోఆర్డినేటర్ ఉంటారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరు చొప్పున జిల్లాలో 56 మంది మండల కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్‌కు నెలకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్‌కు నెలకు రూ. 2 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. మండల కోఆర్డినేటర్లకు 11 నెలలుగా రూ. 36.92 లక్షలు, గ్రామ కోఆర్డినేటర్లకు 15 నెలలుగా రూ. 6,24,60,000 ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి గౌరవ వేతనాలను నెలల తరబడి నిలుపుదల చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన వేతనాలను తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోఆర్డినేటర్లు కోరుతున్నారు. రూ. 30 వేలు రావాలి చేదూరి కాంతమ్మ, గ్రామ కో ఆర్డినేటర్, వై పాలెం 15 నెలల నుంచి మాకు గౌరవ వేతనం అందడం లేదు. నాకు రూ. 30 వేలు రావలసి ఉంది. వెంటనే ఇప్పించి ఆదుకోండి. ఇబ్బందులు పడుతున్నాం పరిమి త్రిపురమ్మ, గ్రామ కో ఆర్డినేటర్, వై పాలెం గౌరవ వేతనం నెలల తరబడి అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటిని నెట్టుకొచ్చేందుకు అప్పులు చేస్తున్నాం. అధికారులు మాపై దయచూపాలి.