నాతవరం : జిల్లాలోని ఏకైక తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం ద్వారా కోటి పిల్లలను ఉత్పత్తి చేసినట్టు మత్స్యశాఖ అధికారి శ్రీదేవి తెలిపారు. చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వాతావరణం అనూకూలించకపోవడంతో ఆలస్యంగా చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభించామన్నారు. గతంలో తాండవ రిజర్వాయర్ మొయిన్‌గేట్లు నుంచి లీకేజీ నీరు వచ్చేదని, ఆ నీటితో చేప పిల్లలు ఉత్పత్తికి బాగుండేదన్నారు. పెద్ద ఇంజన్లతో నీరు తోడి ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో మాత్రమే చేప పిల్లల ఉత్పత్తి చేపడతామన్నారు. ప్రస్తుతం బోచ్చు, రాగండి, ఎర్రమైల రకాల పిల్లలను కోటి వరకు ఉత్పత్తి చేశామన్నారు. వాటిని తాండవ రిజర్వాయరులో, నర్సీపట్నం మత్స్యశాఖ కార్యాలయంలో ఉన్న నీటిలో విడుదల చేశామన్నారు. రెండు మత్స్యకార సంఘాలకు ఒక్కోదానికి 15లక్షలు చోప్పున 30 లక్షలు వరకు పిల్లలు సరఫరా చేశామన్నారు. త్వరలో మిగతా సంఘాలకు సరఫరాకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వారం రోజులుగా చేప పిల్లలు ఉత్పత్తికి వాతావరణం అనుకూలంగా ఉందన్నారు.
కోటి చేప పిల్లలు ఉత్పత్తి
Published Fri, Aug 5 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
Advertisement