గణపురం(ములుగు, వరంగల్ జిల్లా): గణపురం(ములుగు) మండలం చెల్పూరు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఊరి చివరన ఉన్న పెద్దచెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటనలో చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మేదిపల్లి రమణ(11), మల్లోజు ప్రదీప్(11), కొంపెల్లి శంకర్(12), కేతిరి రమేశ్(14) లు మృత్యువాతపడ్డారు. సెలవు రోజు కావడంతో ఈతకు వెళ్లిన విద్యార్థులు ఇటీవల మిషన్ కాకతీయ కోసం తీసిన గుంతలో చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ముందుగా చెరువులో దిగిన నలుగురు గుంతలో ఇరుక్కుపోవడంతో వారితో వచ్చిన మరోఇద్దరు పిల్లలు తమ స్నేహితులను కాపాడాలంటూ కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న వారు అక్కడకు వచ్చి కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం మునిగిపోయిన విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో పడి నలుగురు విద్యార్థుల మృతి
Published Sun, Dec 6 2015 5:13 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement