Heart Touching: After Wife Killed In Accident Her Husband Died By Suicide In Pune - Sakshi
Sakshi News home page

అన్యోన్యం కాస్త విషాదంగా.. కళ్ల ముందే భార్యకు అలా జరిగేసరికి..

Published Fri, Nov 18 2022 1:43 PM | Last Updated on Fri, Nov 18 2022 3:09 PM

Wife Killed In Accident Pune Man Dies By Suicide - Sakshi

క్రైమ్‌: భర్తను చంపి అడ్డుతొలగించుకున్న భార్య.. భార్యను కిరాతకంగా చంపిన భర్త.. వివాహేతర సంబంధాల మోజులో పడి.. నిత్యం దాదాపు ఇలాంటి నేరాలే వింటున్నాం ఈ రోజుల్లో. కానీ, భార్యాభర్తల ప్రేమకు పరాకాష్టగా నిలిచే విషాద గాథలు చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిదే ఇది..  ప్రాణంగా ప్రేమించిన భార్య మీది ప్రేమను చంపుకోలేని ఓ వ్యక్తి, తన ప్రాణమే తీసుకున్నాడు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

పుణే(మహారాష్ట్ర) జున్నుర్‌ తాలుకా ధోండ్‌కార్వాడి నిమ్‌దారికి చెందిన రమేష్‌(29), విద్య(23)లు చాలా కాలంగా ప్రేమించుకున్నారు. విద్యకు తండ్రి లేడు. ఆమె చదువులకు అయ్యే ఖర్చు సైతం రమేష్‌ భరించాడు. ఆమె ఇంటి బాధ్యతలను సైతం మోశాడు. రమేష్‌కు అతని నుంచి మద్దతు కూడా లభించింది. చివరికి.. పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల కిందట వివాహం జరిగింది. నెల కిందట విద్య గర్భం దాల్చడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభవార్త తెలియగానే కూతురికి బంగారు గొలుసు చేయించాలని కూతురు-అల్లుడికి కబురు పెట్టింది విద్య తల్లి.

నారాయణగావ్‌లో నగలు కొనడానికి ఆ భార్యభర్తలు బైక్‌ మీద బయలుదేరారు. షాపింగ్‌ ముగిసిన తర్వాత దారిలో ఓ పాలబూత్‌ దగ్గర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. బైక్‌ దిగింది దివ్య. ఈ క్రమంలో ఎదురుగా చెరుకులోడుతో వస్తున్న ఓ ట్రాక్టర్‌ ఆమెను ఢీకొట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెనక చక్రాల కింద పడి దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. నవంబర్‌ 14వ తేదీన ఈ ఘోరం జరిగింది.

భార్య మరణానికి కళ్లరా చూసిన రమేష్‌.. మెంటల్‌షాక్‌కి గురయ్యాడు. మూడురోజుల పాటు ఏడుస్తూ.. కుంగిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన దివ్య దూరం అయ్యేసరికి భరించలేకపోయాడు. ఆమె చావుకు తానే కారణం అని పశ్చాత్తప పడ్డాడు. ఆమె లేని జీవితం తనకు ఎందుకు అనుకున్నాడు. విషం తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు నారాయణ్‌గావ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో రమేష్‌ కన్నుమూశాడు. 

ఇదీ చదవండి: బావను ప్రేమించింది.. నమ్మింది, ఈలోపే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement