sad story
-
బిడ్డా శ్యామ్.. గుండెలు అవిసేలా ఏడుస్తూ కుప్పకూలింది
సాక్షి, కరీంనగర్: భార్య మృతిని తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడితే.. అది తట్టుకోలేక అతని తల్లి గుండె బద్ధలైంది. తిమ్మపూర్ మండలం నెదునూరు గ్రామంలో చోటు చేసుకున్న విషాదానికి మరో మరణం తోడయ్యింది. భార్య మృతితో ఒంటరి జీవనం గడుపుతున్న శ్యామ్ సుందర్.. భార్య ఎక్కడైతే ఆత్మహత్యకు పాల్పడిందో అదే ప్రదేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తెలిసే ఉంటుంది. అయితే.. కొడుకు మృతిని తట్టుకోలేక 24 గంటలు గడవకముందే అతని తల్లి సైతం ప్రాణం విడిచింది. కొడుకు అంత్యక్రియల తర్వాత ఇంటికి చేరుకున్న కనకలక్ష్మి గుండెలు అవిసేలా ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధువులు. కానీ, మార్గం మధ్యలోనే కన్నుమూసింది. కొడుకు చనిపోయిన కొద్దిగంటలకే కనకవ్వ సైతం కన్నుమూయడంతో ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్(35) ఆర్కెస్ట్రా గాయకుడు. ఏడాది కిందట.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన శారదతో వివాహం జరిగింది. దాదాపు ఏడు నెలల కిందట.. శారద హుస్నాబాద్ లోని ఓ బహిరంగ ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. మనస్పర్థల కారణంగా ఆమె చనిపోయినట్లు తేలింది. అయితే.. భార్య ఎడబాటును తట్టుకోలేని భర్త శ్యాంసుందర్ తన పెళ్లి రోజునే అతని భార్య ఉరివేసుకొని చనిపోయిన చెట్టు దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఆ బాధను తట్టుకోలేని తల్లి కూడా కొడుకు దగ్గరికే చేరుకుందేమో!. -
బిడ్డ కోసం రక్తం అమ్ముకున్న ఓ తండ్రి కథ
జనాభాలో భారత్ చైనాను అధిగమించింది. మరి మానవాభివృద్ధిలో ఎక్కుడున్నాం?. ఎక్కడో చివర్లో ఉన్నాం. సాంకేతికత, సోషల్ మీడియా గురించి నిత్యం మాట్లాడుకునేం మనం.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం మాటకొచ్చేసరికి చర్చల్లో వెనకబడిపోతాం. దేశంలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కథలు కళ్లకు కట్టేలా కనిపిస్తున్నా.. ‘అయ్యో అనుకోవడం’ తప్పించి అంతకు మించి ఏం చేయని పరిస్థితి మనలో చాలామందిది. ఇప్పుడు చెప్పుకోబోయేది కథ కాదు.. కూతురి కోసం పోరాడుతూ జీవితంలో ఓడిన ఓ తండ్రికి సంబంధించిన విషాద గాథ. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన కూతురి కోసం తాను చేయగలిగిందంతా చేశాడు ఓ వ్యక్తి. సాయం కోసం ఎదురు చూసి.. చూసి విసిగిపోయాడు. చివరకు కూతురిని కాపాడుకోలేనేమో అనే బెంగతో ఆర్థిక కష్టాల నడుమ నిస్సహాయ స్థితిలో ప్రాణం తీసుకున్నాడు. అనుష్కా గుప్తా.. ఐదేళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక విరిగి మంచానికే పరిమితమైంది. ఆమె చికిత్స కోసం తండ్రి ప్రమోద్ ఉన్న ఇంటిని, దుకాణాన్ని అమ్మేశాడు. అప్పులు చేసి మరీ మందులు, థెరపీలు చేయించాడు. అయినా ఆమెకు నయం కాలేదు. ఈలోపు ఆర్థిక సమస్యలు ఇంటిదాకా వచ్చాయి. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ వచ్చే డబ్బు ఏపాటికీ సరిపోలేదు. గత్యంతరం లేక రక్తం అమ్ముకుని.. ఈ లోపు అధికారులు సాయం అందిస్తామని మాటిచ్చారు. ఆ విషయాన్ని కొందరు నేతలు కూడా మైకుల్లో మీడియా ముందు అనౌన్స్ చేసుకున్నారు. అది పట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, స్థానిక నేతల ఇళ్ల చుట్టూ ఏడాదిపాటు తిరిగి తిరిగి అలిసిపోయాడా తండ్రి. ఇంట్లో తినడానికి ఏం లేని పరిస్థితుల్లో.. తరచూ రక్తం సైతం అమ్ముకున్నాడు ప్రమోద్. ఏడాది కాలంగా గుప్తా ఇంటి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. శక్తిహీనుడైన ఆ తండ్రి కూతురి కోసం తానేం చేయలేకపోతున్నాననే నిరాశ, ఆర్థికంగా కుంగిపోయి నిస్పృహలోకి కూరుకుపోయాడు. చివరకు ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. కూతురి ఆరోగ్యం విషయంలో అప్పటికే దిగులుగా ఉన్న ప్రమోద్ కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం సాత్నా రైల్వే పట్టాలపై ప్రమోద్ శవాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు తల్లీ.. ఏం చేయలేపోతున్నానమ్మా! అనుష్కా గుప్తా.. సరస్వతి పుత్రిక. ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైనా సరే పుస్తకాన్ని వదల్లేదు. కూతురిలోని ఆ ఆసక్తికి చంపడం ఇష్టం లేక.. ఇంటి నుంచే ఆమె చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు ప్రమోద్. ఓ మనిషి సాయంతో ఆమె బోర్డు పరీక్షలు రాసింది. బోర్డు ఎగ్జామ్స్‌లో ఆమె సాధించిన ప్రతిభకు విద్యాశాఖ సత్కారం కూడా చేసింది. పై చదువుల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఆ తండ్రి.. కూతురి ట్రీట్మెంట్, ఇంటి అవసరాల ఆర్థిక భారాన్ని మోయలేకపోయాడు. బంగారు తల్లి కోసం ఏం చేయలేకపోయానే అనుకుంటూ నిత్యం కుమిలిపోయాడు. పాపం.. ప్రాణం తీసుకునే ధైర్యం ప్రదర్శించిన ఆ తండ్రి.. బదులు పోరాడి అధికారుల నుంచి రావాల్సిన సాయం రాబట్టుకుని ఉంటే బాగుండేదేమో!. -
చావు వస్తుందని తెలిసి.. ముందే ఏర్పాట్లు చేసుకుని..
ఖమ్మం: ఈరోజుల్లో మనిషికి చావు ఊహించనిది. కానీ, అతనికి మాత్రం ఊహించిందే. అందుకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. కన్నవాళ్లకు, తోడబుట్టిన వాడికి ధైర్యం చెప్పి.. ఓదారుస్తూ వచ్చాడు. విదేశాల్లో ఉంటున్న తాను.. ఎలాగైనా తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేశాడు. ఖమ్మం వాసులను కంటతడి పెట్టిన హర్షవర్థన్ గాథలోకి వెళ్తే.. ఖమ్మం సిటీలో ఉండే ఏపూరి రామారావు, ప్రమీలకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు హర్షవర్థన్ బీఫార్మసీ చేసి.. 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చాడు. కరోనాకి ముందు.. 2020 ఫిబ్రవరిలో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వస్తే భార్యను తీసుకెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వైరస్-లాక్డౌన్ వచ్చి పడ్డాయి. ఇదిలా ఉండగానే.. 2020 అక్టోబర్‌లో జిమ్ చేస్తున్న హర్షవర్ధన్‌కి ఆరోగ్యం తేడాగా అనిపించింది. దగ్గు ఆయాసం అనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. లంగ్స్ క్యాన్సర్ సోకిందని చెప్పారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వాళ్లు రోదించారు. ఇంటికి వచ్చేయమని కోరారు. కానీ, హర్ష వాళ్లకు ధైర్యం అందించాడు. అక్కడే ఉండి చికిత్స తీసుకుంటానని చెప్పాడు. క్యాన్సర్ సోకింది.. తనకు చావు తప్పదని అనుకున్నాడో ఏమో భార్యకు విడాకులిచ్చేశాడు. అంతేకాదు.. ఆమె జీవితంలో స్థిరపడేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో.. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. నయమైందని డాక్టర్లు చెప్పడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 2022 సెప్టెంబర్‌లో ఇంటికి వచ్చి పదిరోజులు ఉన్నాడు. తిరిగి వెళ్లాక.. వ్యాధి తిరగబడింది. ఇక చావు తప్పదని అతనికి అర్థమైంది. విషయం అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. రోజూ వీడియో కాల్లో మాట్లాడడం చేశాడు. ఇంతలో తమ్ముడు అఖిల్‌కు వివాహం నిశ్చయ్యం అయ్యిందని సంతోషించాడు. మే నెలలో ముహూర్తం ఫిక్స్ చేయడంతో.. సంతోషించి ఆరోగ్యం సహకరిస్తే వస్తానంటూ చెప్పాడు కూడా. ఆ సమయంలో అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను చనిపోయాక.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంపై అతను దృష్టిసారించారు. ఆ విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకున్నాడు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఓ లాయర్‌ను పెట్టుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. మార్చి 24వ తేదీన హర్షవర్ధన్ కన్నుమూశాడు. ఏప్రిల్ 5వ తేదీ(బుధవారం) అతని మృతదేహాం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరింది. హర్ష మృతదేహాన్ని చూసి కుటుంబంతో పాటు స్థానికులంతా కన్నీరు మున్నీరుగా విలపించగా.. అంత్యక్రియలు ముగిశాయి. -
భార్యపై ‘పిచ్చి’ ప్రేమ.. భర్త ప్రాణం తీసింది!
క్రైమ్: భర్తను చంపి అడ్డుతొలగించుకున్న భార్య.. భార్యను కిరాతకంగా చంపిన భర్త.. వివాహేతర సంబంధాల మోజులో పడి.. నిత్యం దాదాపు ఇలాంటి నేరాలే వింటున్నాం ఈ రోజుల్లో. కానీ, భార్యాభర్తల ప్రేమకు పరాకాష్టగా నిలిచే విషాద గాథలు చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిదే ఇది.. ప్రాణంగా ప్రేమించిన భార్య మీది ప్రేమను చంపుకోలేని ఓ వ్యక్తి, తన ప్రాణమే తీసుకున్నాడు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పుణే(మహారాష్ట్ర) జున్నుర్ తాలుకా ధోండ్కార్వాడి నిమ్దారికి చెందిన రమేష్(29), విద్య(23)లు చాలా కాలంగా ప్రేమించుకున్నారు. విద్యకు తండ్రి లేడు. ఆమె చదువులకు అయ్యే ఖర్చు సైతం రమేష్ భరించాడు. ఆమె ఇంటి బాధ్యతలను సైతం మోశాడు. రమేష్‌కు అతని నుంచి మద్దతు కూడా లభించింది. చివరికి.. పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల కిందట వివాహం జరిగింది. నెల కిందట విద్య గర్భం దాల్చడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభవార్త తెలియగానే కూతురికి బంగారు గొలుసు చేయించాలని కూతురు-అల్లుడికి కబురు పెట్టింది విద్య తల్లి. నారాయణగావ్‌లో నగలు కొనడానికి ఆ భార్యభర్తలు బైక్ మీద బయలుదేరారు. షాపింగ్ ముగిసిన తర్వాత దారిలో ఓ పాలబూత్ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో.. బైక్ దిగింది దివ్య. ఈ క్రమంలో ఎదురుగా చెరుకులోడుతో వస్తున్న ఓ ట్రాక్టర్ ఆమెను ఢీకొట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెనక చక్రాల కింద పడి దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. నవంబర్ 14వ తేదీన ఈ ఘోరం జరిగింది. భార్య మరణానికి కళ్లరా చూసిన రమేష్.. మెంటల్షాక్కి గురయ్యాడు. మూడురోజుల పాటు ఏడుస్తూ.. కుంగిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన దివ్య దూరం అయ్యేసరికి భరించలేకపోయాడు. ఆమె చావుకు తానే కారణం అని పశ్చాత్తప పడ్డాడు. ఆమె లేని జీవితం తనకు ఎందుకు అనుకున్నాడు. విషం తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు నారాయణ్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో రమేష్ కన్నుమూశాడు. ఇదీ చదవండి: బావను ప్రేమించింది.. నమ్మింది, ఈలోపే.. -
కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ
కాశీబుగ్గ: మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్‌ఫిల్మ్ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..
Tamil Bigg Boss Seanson 5 Namitha Marimuthu Heart Touching Story: బిగ్‌బాస్.. ఈ రియాలిటీ షోను జెన్యూన్‌గా ఆదరించే వాళ్ల శాతం తక్కువే కావొచ్చు. చాలామందికి ఈ రియాలిటీ షో మీద సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. సెలబ్రిటీలు-నాన్ సెలబ్రిటీలను ఓ హౌజ్‌లో టాస్క్‌లు-గేమ్‌ల పేరుతో చేసే గారడీ అని, వాళ్లు పంచేవి ఫేక్ ఎమోషన్స్ అని ఫీలవుతుంటారు. ఇలా ఎవరి అభిప్రాయలు వాళ్లవి. కానీ, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5లో గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 5.. 18 మంది కంటెస్టెంట్లతో అక్టోబర్ 3న ప్రారంభమైంది. సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కంటెస్టెంట్లో ట్రాన్స్‌జెండర్ నమిత మారిముత్తు పాల్గొంటోంది. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 విన్నర్, మోడల్ కమ్ నటి అయిన నమిత.. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం. ఇక ‘ఒరు కథై సొల్లాటుమా’ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పుకుంటూ వచ్చారు. తన వంతు వచ్చేసరికి భావోద్వేగంగా నమిత చెప్పిన కథ తోటి హౌజ్ మేట్స్‌నే కాదు.. షోను తిలకించిన వాళ్లెందరినో కదిలించింది. కొందరి వల్ల సొసైటీలో తనలాంటి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. సమాజం తమను అంగీకరించకపోవడం గురించి ఒక ప్రతినిధిగా దాదాపు అర్థగంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నమిత. #NamithaMarimuthu 😟😟 Paavam la 😐 First time... BB la oru life story paarthu tears😪 Life is not easy for them😔 Hope this society atleast give comfortable space for them to live like us 💫❤#BBTamilSeason5 #BiggBossTamil5 — Yuna ᴹᴵ (@Yuna_Chillz) October 7, 2021 ఇది కదా చర్చించాల్సింది! సొసైటీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాల్నే కథగా అల్లిన నమిత.. ఆ కథను ఆద్యంతం భావోద్వేగాలతో చెబుతూ పోయారు. ‘మన సమాజం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఇదే సమాజంలో మా స్థానం ఎక్కడ? మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్ల మీద అడుక్కుని బతకాల్సి వస్తోంది. Thalaivar Kalaignar Karunanidhi will be Remembered Forever for such Works.. Proud 😍🔥#KalaignarForever #NamithaMarimuthu #BiggBoss5Tamil pic.twitter.com/An4Du5FGXu — நிதன் சிற்றரசு (@Srinileaks) October 8, 2021 మమ్మల్ని మనుషుల్లాగే చూడడం లేదంటూ.. కన్నీళ్లతో మాట్లాడింది నమిత. అంతేకాదు కొందరి వల్ల తనలాంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తోందని, అలాంటి ప్రచారం చేసేవాళ్లతో సహా సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పు రావాలంటూ, తనలా అందరూ రాణిస్తే సంతోషిస్తానని చివర్లో కోరుకుందామె. ఇక స్టార్ విజయ్ ఛానెల్ వాళ్లు కూడా సింగిల్ కట్ లేకుండా, ఎడిట్ చేయకుండా!, బీప్ లేకుండా ఆ అరగంట సీక్వెన్స్‌ను టెలికాస్ట్ చేయడం విశేషం!. అంతకు ముందు ఇదే హౌజ్‌లో ఇసయ్వాణి, చిన్నపొన్నులు సైతం పేదరికంలో తాము పడ్డ కష్టాల్ని పంచుకోగా.. ఆ రియల్ ఎమోషన్స్ సైతం చాలామందిని కదిలించాయి. ట్విటర్లో నమిత.. బిగ్‌బాస్ హౌజ్ వేదికగా కోట్ల మందికి తన గా(వ్య)థను పంచిన నమితను అభినందించని వాళ్లంటూ లేరు. అందుకే రాత్రి నుంచే ఆమెకు మద్దతుగా #NamithaMarimuthu హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో కడదాకా ఉంటుందో లేదో తెలియదుగానీ నమిత కథ మాత్రం.. ఓ బర్నింగ్ ఇష్యూను ఓ బుల్లితెర పాపులర్ షో ద్వారా సాధారణ ప్రజల ముందుకు తీసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్లోనూ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఇదే తరహా ఎమోషన్స్‌ను పంచిన విషయం తెలిసిందే. కంటెంట్ తక్కువతో కలర్ఫుల్గా షోలను నడిపించేవాళ్లు.. తమిళ, తెలుగు బిగ్‌బాస్ హౌజ్‌ల నుంచి చాలా నేర్చుకోవాలనే సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పడు. The pain in #NamithaMarimuthu’s story.💔 Not an ordinary struggle mentally and physically. Jus to hear only was so #exhausing. Can’t imagine what she must have gone through. More power to her and many more achievers from #LGBTQ.#BiggBossTamil #BiggBossTamil5 pic.twitter.com/FaZqJpgRrd — Ajay Ashok🅰️🅰️ (@AjayAsho) October 7, 2021 Her story says how we failed as a society 😭😭 #NamithaMarimuthu #BiggBossTamil5 pic.twitter.com/BY8pGKRxkm — Charan (@Charan_Soz) October 7, 2021 #BiggBossTamil5 She won 17❤️ from #BiggBoss house Million ❤️❤️❤️ from outside the house 🏠#NamithaMarimuthu pic.twitter.com/VQ6gcHzndE — Stay Positive37 (@helothamizha) October 7, 2021 Nameetha Marimuththu She is an icon to showcase the world -People Themselves are more beautiful - She spoke louder her inner feelings and respect @vijaytelevision for not editing her speech ♥️ She is the way beautiful - She is #NamithaMarimuthu #transgenderpride pic.twitter.com/M3NPwIaokl — Bigg Boss Tamil Season 5 (@biggbosstamil_5) October 7, 2021 చదవండి: తెలుగు బిగ్‌బాస్.. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ -
చెల్లి మరణంతో కుంగిపోయిన విజయ్.. డిప్రెషన్‌తో ఏడాది పాటు..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనూ విజయ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ర్టీకి చెందినవారే. తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ కాగా తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక తండ్రి డైరెక్షన్లో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన విజయ్ ఆ తర్వాత నాలయై తీర్పు అనే యూక్షన్ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాను కూడా ఆయన తండ్రి చంద్రశేఖరే డైరెక్ట్ చేశారు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న విజయ్ వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆయన జీవితంలో ఓ తీరని విషాదం నెలకొందని చాలా మందికి తెలియదు. విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేది. ఇద్దరూ కలిసి ఎంతో అల్లరి చేస్తూ సరదాగా గడిపేవారు. చిన్న వయసులోనే విద్య అనారోగ్యం బారిన పడింది. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. అలా రెండేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 'స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడు. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అప్పటిదాకా ఎంతో చలాకీగా, అల్లరి చేస్తూ గడిపిన విజయ్ విద్య దూరం అయ్యాక ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. వయసుకు మించిన నెమ్మదితనం అలవర్చుకున్నాడు. ఇప్పటికీ అంతే. ఆ బాధలోంచి విజయ్ కాస్త కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది' విజయ్ తల్లి వివరించింది. విద్య మరణంతో కుంగిపోయిన విజయ్ ముఖంలో నవ్వు కనిపించింది దానికి కారణం సినిమాలే అని పేర్కొంది. ఇక చెల్లెలిపై ఉన్న ప్రేమతో విజయ్ తన కూతురికి దివ్య సహాస అనే నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ బీస్ట్‌తో పాటు, తెలుగులోనూ ఈ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారు. -
నేను, బావా..మధ్యలో తను
బావా అనే పదంలో ఉండే ప్రేమ, అనుభూతే వేరు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. నా స్టడీ అయిపోయింది. ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అలా జాబ్ సెర్చింగ్‌లో ఉండగా కొన్ని రోజులు బావని దూరం పెట్టాను. ఆ దూరం మమ్మల్ని ఇలా విడదీస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మా ఇద్దరి జీవితంలో తుఫానులా వచ్చింది ఒక అమ్మాయి. తను నా చిన్ననాటి స్నేహితురాలు. తనకు కూడా తెలుసు బావకి నేనంత ఇష్టమో, నాకు బావంటే ఎంత ఇష్టమో. అన్నీ తెలిసి కూడా తను నా బావను ఇష్టపడింది. ఇద్దరూ రిలేషన్లో ఉన్నారని మా ఫ్రెండ్స్ చెప్పారు. అయినా నేనే నమ్మలేదు. ఎందుకంటే నా బావ మీద నాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే బావతో పెళ్లి గురించి మా ఇంట్లో చెప్పాను. మొదట్లో ఒప్పుకోకపోయినా నా బలవంతంతో ఒప్పుకునేలా చేశాను అంత ఇష్టం నాకు బావంటే. అలాంటిది బావ నన్ను మోసం చేసి వెళ్లిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయా. ఎంతో నరకం అనుభవించా ఇప్పటికీ అనుభవిస్తున్నా. మా అమ్మ చనిపోయినప్పుడు తను నాకు బాసటగా నిలిచాడు. అమ్మ లేని బాధను దూరం చేసేంత ప్రేమ కురిపించాడు. ఇప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఎందుకు? నా ప్రేమలో లోటుందా? బావా...నువ్వు నన్ను మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లిచేసుకొని వెళ్లిపోయినా నీమీద నాకు కోపం రావట్లేదు ఎందుకు? నిన్ను మర్చిపోలేక వేరే వాళ్లను పెళ్లిచేసుకోలేక ఇటు నాన్నని బాధపెడుతున్నా. ఇష్టం లేకున్నా..బాధనంతా గుండెల్లో పెట్టుకొని బతకాలా? ఎవరికోసం బతకాలి? తనే నా సర్వస్వం అనుకున్నా. అందరిలో తననే చూసుకున్నా. కానీ తను మాత్రం అందరిలా నన్ను చూశాడు. నా ప్రేమతో ఆడుకున్నాడు. నా మనసుతో ఆడుకున్నాడు. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అని భావించా. అలాంటి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది బావా? --అఖిల (పేర్లు మార్చాం) -
చెక్క డబ్బాలో మాతృమూర్తి దయనీయస్థితి
-
అయ్యోపాపం అనాథ
మెదక్ జిల్లా : తల్లి ప్రేమకు పదేళ్ల క్రితమే దూరమయ్యాడు. తండ్రిని మేనమామ హత్య చేశాడు. తండ్రిని చంపిన కేసులో మేనమామ జైలుకు వెళ్లాడు. పోషణ చూసే అమ్మమ్మ నెలరోజుల క్రితమే చనిపోయింది. నా అనేవాళ్లు లేని ఓ అనాథ దీన గాథ ఇది. వివరాల్లోకి వెళితే..18 ఏళ్ల క్రితం రాయికోడ్ మండలం తుమ్నూర్ గ్రామానికి చెందిన నాగయ్య రేగోడ్ మండలం గజ్వాడ గ్రామానికి చెందిన యాదమ్మను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఆ దంపతుల కుమారుడు కృష్ణ గజ్వాడ గ్రామంలో 10వతరగతి చదువుతున్నాడు. ఆ బాలుని తల్లి పదేళ్ల క్రితమే చనిపోయింది. ఈ నెల 6వ తేదీన ఇంట్లో నిద్రలో ఉన్న బాలుడి తండ్రి నాగయ్యను ఆయన బావమరిది శంకరయ్య హత్య చేశాడు. ఆ హత్య కేసులో బాలుడు మేన మామ జైలుకు వెళ్లాడు. నెల రోజుల క్రితం అమ్మమ్మ కూడా మృతి చెందింది. దీంతో ఆ బాలుడు అనాథగా మారాడు. అనాధగా మిగిలిన కృషను చూసిన గ్రామస్తులు అయ్యోపాపం అంటున్నారు. తండ్రి హత్యానంతరం గ్రామ మాజీ సర్పంచ్ బేతమ్మ దుర్గయ్య దంపతులు కృష్ణను చేరదీసి సుమారు ఇరవై రోజులుగా భోజనం పెడుతున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కృష్ణ చదువుతున్నా తల్లిదండ్రులు లేరనే బెంగతో సరిగా చదువుకోవడం లేదు. మనసున్న మా రాజులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఈ ఆనాధ బాలుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరతున్నారు.