డప్పు రమేష్ (ఫైల్)
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/తెనాలి: డప్పు రమేష్‌గా ప్రాచుర్యం పొందిన జన నాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ (61) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అంగలకుదురు ఆయన స్వగ్రామం. తెనాలిలోని వీఎస్సార్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారు. 1981లో పీపుల్స్ వార్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ సాంస్కృతిక దళమైన జన నాట్యమండలి శిక్షణ తరగతులకు వెళ్లారు. ఆ తరువాత పూర్తిస్థాయి విప్లవ కళాకారుడిగా మారారు.
చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం
గద్దర్, దివాకర్‌లతో పాటు జన నాట్యమండలిలో పనిచేశారు. నల్లమల అడవులు, దండకారణ్యంలో సంచరించారు. కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపారు. అంతకుముందు ఉద్యమ కళాకారిణి కుమారిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె మలేరియా బారినపడి మరణించడంతో జ్యోతి అనే ఉద్యమకారిణిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. రమేష్ అంత్యక్రియలు శనివారం పల్నాడులోని జూలకల్లు గ్రామంలో జరుగుతాయని ఆయన భార్య జ్యోతి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment