dappu
-
Dappu Ramesh: డప్పు రమేష్ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/తెనాలి: డప్పు రమేష్‌గా ప్రాచుర్యం పొందిన జన నాట్యమండలి కళాకారుడు ఎలియాజర్ (61) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అంగలకుదురు ఆయన స్వగ్రామం. తెనాలిలోని వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారు. 1981లో పీపుల్స్ వార్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ సాంస్కృతిక దళమైన జన నాట్యమండలి శిక్షణ తరగతులకు వెళ్లారు. ఆ తరువాత పూర్తిస్థాయి విప్లవ కళాకారుడిగా మారారు. చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం గద్దర్, దివాకర్‌లతో పాటు జన నాట్యమండలిలో పనిచేశారు. నల్లమల అడవులు, దండకారణ్యంలో సంచరించారు. కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపారు. అంతకుముందు ఉద్యమ కళాకారిణి కుమారిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె మలేరియా బారినపడి మరణించడంతో జ్యోతి అనే ఉద్యమకారిణిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. రమేష్ అంత్యక్రియలు శనివారం పల్నాడులోని జూలకల్లు గ్రామంలో జరుగుతాయని ఆయన భార్య జ్యోతి వెల్లడించారు. -
ఆగిన ‘డప్పు’ చప్పుడు
డప్పు కళను ఎల్లలు దాటించిన కళాకారుడు.. చేతిలో ఢం ఢం మని మోగే శబ్దాన్నే తన గుండె చప్పుడుగా మార్చుకున్న ఘనుడు.. అట్టడుగున మగ్గిపోతున్న డప్పు విద్యకు కొత్త హంగులు అద్ది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన విద్వాంసుడు.. స్వతహాగా ప్రదర్శనలివ్వడమే కాక, దేశ విదేశాల్లో అనేక మందికి తరీ్ఫదునిచ్చి ప్రోత్సహించిన కళాత్ముడు.. ఆ డప్పునకు ప్రాణ హితుడు.. డప్పునే తన ఇంటి పేరుగా మార్చుకున్న సూర్య భగవంతరావు ఇక లేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘంటసాల(అవనిగడ్డ): డప్పు చప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకున్న హంస అవార్డు గ్రహీత కుంపటి సూర్య భగవంతరావు(72) గుండె పోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంకు చెందిన కుంపటి సూర్య భగవంతరావు (డప్పు భగవంతరావు) మరణ వార్త తెలుసుకున్న ప్రజా నాట్యమండలి బృందం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ కండువా కప్పి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఘంటసాల మండల, నియోజకవర్గ పరిధిలోని పలువురు కళాకారులు భగవంతరావు భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. డప్పు కళాకారుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని చిట్టూర్పు ఈపూరివానిగూడెంలోని ఆయన స్వగృహంలో ఉంచగా.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. భగవంతరావుకు భార్య సువార్తమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదీ ‘సూర్య’ ప్రస్థానం.. చిన్న నాటి నుంచే డప్పుపై ఆసక్తి పెంచుకొని ఆ వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డప్పుపై ఉన్న మమకారంతో వివిధ శబ్దాలను పలికిస్తూ.. ఆ విద్యలో ఆరితేరారు. మూస పద్ధతిలో డప్పు వాయించడానికి స్వస్తి పలికి.. కొత్త రీతుల్లో ఆడుతూ, పాడుతూ డప్పు కొడుతూ భగవంతరావు క్రమక్రమంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ డప్పు శబ్దాన్ని వినాలని, ఆయన చేసే విన్యాసాలను చూడాలని ఆశించే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోవడంతో భాషా, భావాలకు అతీతంగా భగవంతరావు ప్రదర్శనలకు వీక్షకులు హాజరయ్యేవారు. 15 ఏళ్ల పాటు ప్రజా నాట్యమండలిలో పని చేసిన భగవంతరావు ఉదయ్‌పూర్‌లో జరిగిన ఉత్సవాల్లో చేసిన ప్రదర్శన చూసిన ఫ్రాన్స్ దేశస్తులు.. వారి దేశానికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించుకున్నారు. సినిమాలలో అవకాశం.. డప్పు కళలో ప్రావీణ్యం సాధించడంతో సినిమాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు సన్నివేశాల్లో కూడా భగవంతరావు నటించారు. బ్రహ్మంగారి జీవిత చరిత్ర, నవయుగం, మరో క్విట్ ఇండియా, కూలన్న, వర్షం తదితర సినిమాల్లో తన ప్రతిభను కనబరిచారు. డప్పు కళ అధ్యాపకునిగా.. డప్పుకళను ప్రోత్సహించేందుకు జానపద కళల కింద ఒక కోర్సుగా ఉన్న డప్పు కళను అందరికీ తెలిసేలా చేశాడు. డప్పు కళ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి సుమారు 32 ఏళ్లపాటు విద్యార్థులకు తరీ్ఫదునిచ్చారు. అంతేకాక గ్రామాల్లో వేలమందికి నేరి్పంచి సుమారు 20 వేల మంది డప్పు కళాకారులను తయారు చేశారు. సేవలకు గుర్తింపు.. డప్పు భగవంతరావు సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వాలు 1992లో హంస అవార్డు, ధర్మనిధి పురస్కారం, 1998లో డప్పు జానపద రత్న, 1994లో డప్పు విద్వాన్, 1992లో డప్పు ప్రవీణ, 1991లో డప్పు విద్య ప్రవీణ అవార్డులతో సత్కరించాయి. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీల వారు వందలాది అవార్డులను బహూకరించారు. -
డప్పు కొట్టి.. అభిమానుల్లో జోష్ నింపిన రోజా
సాక్షి, చిత్తూరు: నగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సారి ఏకంగా డప్పు కొట్టి సందడి చేశారు రోజా. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు. పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం జరిగిన డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. డప్పు కళాకారులు అందరికీ డప్పులను అందించి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని తెలిపారు. కులవృత్తులను, కళాకారులను ఆదుకోవడం కోసం జగన్ సర్కార్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు రోజా. రోజా డప్పు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
కళాకారులతో కలిసి డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా
-
బతుకుచిత్రం : డప్పు కళాకారులు
-
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా ..
దుబ్బాకరూరల్ : ‘ఇందుమూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా...’ అని దండోరా ద్వారా పంచాయతీలో జరిగే కార్యక్రమాలను తెలియజేసేవారు. అయితే, ఇప్పుడా దండోరా మూగపోనుంది. దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి గ్రామాలు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులకు పంచాయతీ తరపున ఏదైనా సమాచారం చేరవేయాలంటే మైక్సెట్లను వినియోగిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ వినిపించేందుకు ప్రతి వీధి, వాడలో మైక్సెలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సమాచారం తెలిజేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఒక్క రోజు ముందుగానే గ్రామస్తులకు విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఇలా ప్రచారం చేసేందుకు విలేజ్ హెల్పర్‌ను నియమించారు. పోతారెడ్డిపేటలో.. గ్రామస్తులకు సమచారాన్ని తెలియజేసేందుకు 30 మైక్‌సౌండ్‌లు ఏర్పాటుచేశారు. గ్రామంలో ఉన్న 10 వార్డుల్లో వీటిని అమర్చారు. ప్రచారం చేయడానికి ప్రత్యేకించి విలేజ్ హెల్పర్‌ను నియమించారు. గ్రామంలో మొత్తం జనాభా 3500 ఉండగా.. ఓటర్లు 2100, ఇళ్లు 1000, కుటుంబాలు దాదాపు 1,600 ఉన్నాయి. తాళ్లపల్లిలో.. గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉన్నాయి. జనాభా 1000, ఇళ్లు దాదాపు 150, కుటుంబాలు 200 ఉండగా మైక్‌సౌండ్‌లు 15 ఏర్పాటుచేశారు. మా ఊరిలోనూ.. ఊరి ప్రజలకు ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ప్రతిసారి దం డోర వేసేవాళ్లం. రెండు నెలల నుంచి ప్రతి వీధి, వాడకు 30 వరకు మైక్‌సౌండ్‌లు ఏర్పాటు చేశాం. ఇందుకోసం ప్రత్యేకించి విలేజ్ హెల్పర్‌ని నియమించాం. – చింతల జ్యోతి, మాజీ సర్పంచ్, పోతారెడ్డిపేట అందరికీ తెలుస్తోంది మా ఊరిలో 12 మైక్‌సౌండ్‌లు ఏర్పాటు చేశాం. ఏదైనా సమాచారం తెలియాలంటే మైక్‌తో చెప్పడం వలన అందరికీ వెంటనే తెలుస్తుంది. డప్పుతో దండోరా వేయిస్తే కొంత మందికి తెలిసేది కాదు. మైక్‌తో ప్రచారం సులువుగా మారింది. – శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు, తాళ్లపల్లి ఒక్క రోజు ముందుగా.. మా గ్రామంలో ఏదైనా సమాచారం ఉంటే నేనే మైక్ ద్వారా ప్రచారం చేసి చెబుతా. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సమస్యలు ఏవైనా మైక్ ద్వారానే ప్రచారం చేస్తా. ఒక్క రోజు ముందుగానే ఉదయం, సాయంత్రం ప్రచారం చేస్తా. – కాసి సుధాకర్, విలేజ్ హెల్పర్, పోతారెడ్డిపేట మైక్‌తో స్పష్టంగా.. ప్రతి వీధిలో మైక్‌లు బిగించిండ్రు. మైక్ ద్వారా సమాచారం చెప్పడం వల్ల మా ఇంటి దాకా వినబడుతంది. మా ఇంటి దగ్గర కూడా మైక్ సౌండ్ బిగించిండ్రు. గ్రామంలో ఎక్కడ ఉన్నా మైక్ ద్వారా చెబుతుండటంతో స్పష్టంగా వినబడుతుంది. – ఉప్పరి రాములు, గ్రామస్తుడు -
చావుడప్పు కొడుతూ పరలోకాలకు..
మంచాల: శవయాత్రలో డప్పు కొడు తూ గుండెపోటుకు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన గ్యార రమేష్ (36) వృత్తిరీత్యా పెయింటర్. గ్రామంలో కాల్యా లచ్చయ్య అనే వృద్ధుడు చనిపోవడంతో డప్పు వాయించడానికి కూలీకి వెళ్లాడు. శవయాత్రలో డప్పు వాయించిన రమేష్ ఆకస్మికంగా ఛాతీలో నొప్పి వచ్చిందంటూ సమీపంలోని వికలాంగుల భవనానికి వచ్చాడు. అక్కడే మంచి నీళ్లు తాగి ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.