సాక్షి, చిత్తూరు: నగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సారి ఏకంగా డప్పు కొట్టి సందడి చేశారు రోజా. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు. పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం జరిగిన డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు.
డప్పు కళాకారులు అందరికీ డప్పులను అందించి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని తెలిపారు. కులవృత్తులను, కళాకారులను ఆదుకోవడం కోసం జగన్ సర్కార్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు రోజా. రోజా డప్పు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment