Putturu
-
Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ
-
తిరుపతి: పుత్తూరు రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడిన బొలోరో
-
‘నారాయణ’ నాటకాలు.. స్కూల్ భవనం లేదు, అనుమతులు లేవు! కానీ ఫీజులు మాత్రం..
సాక్షి,పుత్తూరు రూరల్(తిరుపతి): ‘‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’’అన్న సామెత పుత్తూరు పట్టణంలో నారాయణ విద్యా సంస్థ నాటకాలకు తెరదీసింది. సదరు సంస్థ గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను ప్రలోభ పెడుతూ అడ్మిషన్ల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తోంది. నారాయణ స్కూల్ పేరుతో బస్సు ఒకటి పట్టణంలో తిరుగుతూ, అందులోంచి కొంత మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించామని, కరపత్రాలను పంచుతూ తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు రూ.3,500 అని, 6వ తరగతికి రూ.28 వేలు, 8వ తరగతికి రూ.30 వేలుగా చెబుతూ వాట్సాప్, ఫోన్ల ద్వారా ఊదరగొట్టేస్తున్నారు. కనీసం భవనం లేకుండా అడ్మిషన్లు ఏంటని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే చూపిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొందరు అడ్మిషన్ ఫీజులు చెల్లించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పుత్తూరు పట్టణంలో ఎక్కడా భవనం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం నారాయణ విద్యా సంస్థకు పుత్తూరులో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తొందర పడి వేలాది రూపాయలను చెల్లించి మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ‘నారాయణ’కు అనుమతులు లేవు నారాయణ విద్యా సంస్థకు పుత్తూరు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేవు. దరఖాస్తు చేసుకోలేదు. అయినా పుత్తూ రు ప్రచారం నిర్వహిస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని డీఈఓ దృష్టికి తసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. – ఎంఈఓ తిరుమలరాజు -
పుత్తూరు మున్సిపల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
-
MLA Roja: డాక్టర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా..
పుత్తూరు(చిత్తూరు జిల్లా): పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో ఆదివారం సుభాషిణి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రారంభించారు. ఓ వృద్ధుడికి బీపీ చెక్ చేసి ఆరోగ్యకరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. చదవండి: భిక్షగాడికి అమరావతి రైతు గెటప్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుత్తూరు పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, మాత్రలు పంపిణీ చేశారు. సుభాషిణి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుభాషిణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పుత్తూరులో వైస్ ఆర్ సీపీ లో చేరిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
-
డప్పు కొట్టి.. అభిమానుల్లో జోష్ నింపిన రోజా
సాక్షి, చిత్తూరు: నగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సారి ఏకంగా డప్పు కొట్టి సందడి చేశారు రోజా. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు. పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం జరిగిన డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. డప్పు కళాకారులు అందరికీ డప్పులను అందించి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని తెలిపారు. కులవృత్తులను, కళాకారులను ఆదుకోవడం కోసం జగన్ సర్కార్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు రోజా. రోజా డప్పు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
కుంగిన అవినీతి 'కట్ట'.. చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా
పుత్తూరు రూరల్ (చిత్తూరు జిల్లా): అడుగడుగునా అవినీతి మేటలు నింపి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంక్ గట్టు మంగళవారం కుంగిపోయింది. రూ.55 కోట్ల వ్యయంతో మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ బినామీ కంపెనీ పేరుతో దీని నిర్మాణం చేపట్టారు. నాలుగేళ్లపాటు జరిగిన ఈ పనుల్లో నాణ్యత ఏమాత్రం లేదని అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నీరు నింపి ఏడాది కాకుండానే ట్యాంక్ గట్టు 10 అడుగుల లోతున, దాదాపు 200 మీటర్ల పొడవున కుంగిపోయింది. గండి పడితే పుత్తూరులోని భవానీ నగర్, ఈశ్వరాపురం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ట్యాంకు నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని, పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని నిర్మాణ సమయంలో ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకోలేదని.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని పుత్తూరు వాసులు అంటున్నారు. కాసుల కక్కుర్తితో.. 2006లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో అప్పటి పుత్తూరు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు చెరువును సమ్మర్ స్టోరేజీ ట్యాంకుగా మార్పు చేయించారు. నియోజకవర్గానికి రూ.55 కోట్లతో మంజూరైన అతి పెద్ద కాంట్రాక్ట్ కావడంతో తన కుమారుడు గాలి భానుప్రకాష్‌కు ఆ పనులు అప్పగించారు. జయ్‌గణేష్ అండ్ కన్స్ట్రక్షన్కు చెందిన గురు అనే బినామీ పేరిట గాలి భానుప్రకాష్ ఈ పనులు చేయించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని పెడచెవిన పెట్టిన ముద్దుకృష్ణమ నాయుడు 2010 నాటికి పని పూర్తయ్యిందనిపించారు. 2009 ఎన్నికల నాటికే టీడీపీలో చేరిన ఆయన నగరి ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడటంతో ట్యాంక్‌ను అధికారికంగా ప్రారంభించలేదు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా.. ట్యాంక్ నిర్మాణం పూర్తయి 11 ఏళ్లు పూర్తవగా.. పదేళ్లుగా ట్యాంకులోకి చుక్కనీరు కూడా చేరలేదు. ఎమ్మెల్యే ఆర్కే రోజా చొరవతో గతేడాది నుంచి వృథాగా పోతున్న పుత్తూరు చెరువు నీటిని ట్యాంక్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. ఇటీవల వర్షాలు విస్తారంగా కురవడంతో ట్యాంక్‌లోకి సుమారు 60 శాతం నీరు చేరింది. ఈ నేప«థ్యంలో ట్యాంక్ కట్ట లోపలే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టండి: ఎమ్మెల్యే ఆర్కే రోజా రూ.కోట్లను దోచేసి అరకొర పనులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించిన జయ్‌గణేష్ అండ్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు కలెక్టర్ హరినారాయణ్‌ను కోరారు. పుత్తూరు ఎస్ఎస్ ట్యాంకు కుంగిపోయిన వైనాన్ని, పొంచి ఉన్న ప్రమాద విషయాలను కలెక్టర్‌కు ఆమె ఫోన్ ద్వారా వివరించారు. అస్తవ్యస్తంగా, అవినీతిమయంగా నిర్మించిన సదరు కాంట్రాక్టర్ ద్వారానే కట్టను పునరుద్ధరించాలని కోరారు. అప్పటి క్వాలిటీ కంట్రోల్ అధికారులపైనా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదం జరగకుండా తక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. ట్యాంక్‌ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంక్‌ను ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వందేళ్ల కిత్రం నిర్మించిన పిచ్చాటూరు ట్యాంకు నేటికీ చెక్కు చెదరలేదని, పదేళ్ల క్రితం నిర్మించిన కట్ట కుంగిపోవడం అవినీతిని బట్టబయలు చేస్తోందని అన్నారు. ప్రమాదం జరిగితే దిగువ గ్రామాలు దెబ్బతింటాయని, వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకును కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించి వెంటనే మరమ్మతు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పుత్తూరు, ఈశ్వరాపురం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయమని ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
చిత్తూరు జిల్లా పుత్తూరులో టిడిపి నేత వీరంగం
-
ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు
-
పుత్తూరుకు తెలుగుగంగ
సాక్షి, పుత్తూరు: పుత్తూరు జనాభా ఏటా పెరుగుతోంది. తాగునీటి అవసరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2008లో పుత్తూరులో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో చిన్నరాజుకుప్పం మీదుగా వెళుతున్న గాలేరు నగరి కాలువ నుంచి నీటిని తరలించే విధంగా పుత్తూరు చెరువునే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుగా నిర్మించేశారు. దీనిపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయినప్పటికీ రాజకీయ ఒత్తిడితో పనులు పూర్తి చేశారు. గాలేరు నగరి పూర్తికాకపోవడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిరుపయోగంగా మారిపోయింది. తెరపైకి తెలుగుగంగ ప్రాజెక్ట్ రోజురోజుకూ పట్టణంలో తాగునీటి కష్టాలు తీవ్రతరం అవుతుండడం, గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభమైంది. ఈ సమయంలో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరాకు గత ఏడాది రూ.137 కోట్లు రుణం మంజూరు చేసింది. శ్రీకాళహస్తి నుంచి పైపులైన్ శ్రీకాళహస్తి మండల పరిధిలోని లక్ష్మీపురం నుంచి (తెలుగు గంగ ప్రాజెక్ట్ 91వ కిలోమీటరు) పైపులైన్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. లక్ష్మీపురం వద్ద ఒక సంపు, కేవీబీ పురం వద్ద మరొక సంపు నిర్మించనున్నారు. 58 కిలోమీటర్ల పైపులైన్ పుత్తూరు సమ్మర్‌స్టోరేజ్‌కు నీటిని తరలించనుంది. అక్కడి నుంచి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి, నీరు సరఫరా చేయనున్నారు. కేవలం సంవత్సరం వ్యవధిలో పైపులైన్ ప్రాజెక్ట్ పూర్తికానుంది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న ఎన్సీసీ కంపెనీ రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. శుభపరిణామం పుత్తూరుకు తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ 1.3 టీఎంసీల నీటిని కేటాయించడం శుభపరిణామం. పట్టణ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నా విజ్ఞప్తిని మన్నించి తెలుగు గంగ నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయిస్తాను. పుత్తూరుకు నీటి కేటాయింపు ఫైల్‌పై తొలి సంతకం చేసిన రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు నా కృతజ్ఞతలు. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి -
పుత్తూరు బహిరంగ సభలో వైఎస్ జగన్
-
‘చంద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు ఉండవు’
-
పొలిటికల్ సూపర్ స్టార్.. అసెంబ్లీ టైగర్ జగన్
సాక్షి, పుత్తూరు(చిత్తూరు) : రైతులకు కరువు రావాలంటే చంద్రబాబు రావాలి.. ఎరువు కావాలంటే జగన్ రావాలని వైఎస్సార్సీపీ నగరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్కే రోజా స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రోజా ప్రసంగిస్తూ.. చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని తెలిపారు. అధికారం కోసం బాబు అడ్డమైన గడ్డి తింటూ.. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు భార్య ఆస్తులు మాత్రం ఐదు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఓ వైపు చిత్తూరులో చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతుంటే.. బాబు కోడలు మాత్రం ఐస్‌క్రీమ్ కంపెనీలు ప్రారంభిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినా సొంత జిల్లాకు చేసిందేంలేదని మండిపడ్డారు. జాతీయ నాయకులు అప్పుడు కలిసొచ్చారు.. ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు.. పొత్తు మాత్రం సేమ్ టూ సేమ్ అంటూ దుయ్యబట్టారు. తెలుగువాడి గుండె ధైర్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. దివంగత మహానాయకుడు వైఎస్ హయాంలోనే నగరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. గాలేరు - నగరి ప్రాజెక్ట్ పూర్తయితేనే పుత్తూరులో నీటి సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. -
చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది
-
కబ్జాలకు కేరాఫ్..అతడు
పుత్తూరులో కి చెందిన ఓ తృతీయశ్రేణి నాయకుడు కబ్జాలకు కేరాఫ్ ‘అతడే’ అన్నట్లు మారాడు. ఇటీవల కాలంలో ఆయన ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఖాళీగా ఉన్న డీకేటీ స్థలాలను కబ్జా చేయడం అతని పని. ఇటీవల సదరు నాయకుడి కబ్జాపర్వాన్ని ఎదురించిన ఓ మహిళపై కూడా తన మనుషులతో భౌతిక దాడి చేయించాడు. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపైనా సదరు నాయకుడి మనుషులు ఎదురు తిరగబోయారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో ! పుత్తూరు : మున్సిపల్ పరిధిలోని భవానీనగర్‌లో టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పెట్రేగుతున్నాడు. ఖాళీ స్థలాలను కబ్జా చేయడం, ప్రశ్నించిన స్థానికులపై దాడులకు చేయించడం ఆయనకు నిత్యకృత్యమైపోయింది. రాత్రయితే చాలు సదరు నాయకుడి గ్యాంగ్ పట్టణంలో స్వైరవిహారం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకుడు సాగిస్తున్న ఆగడాలకు స్థానికులను బెంబేలెత్తుతున్నారు. మున్సిపల్ పరి« దిలో ఇళ్లులేని నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గత ప్రభుత్వం భవానీనగర్‌లోని ఇంటిపట్టాలను మంజూరు చేసినా వారికి స్థలాలను చూపలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. అయితే అంతకుమునుపు అనుభవంలో ఉన్న డీకేటీ పట్టాదారులు న్యాయస్థానం ఆశ్రయించడంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఏరియా ఒకటి..పది ప్లాట్లు కబ్జా ప్రస్తుతం సుమారు వంద కుటుంబాల వరకు భవానీనగర్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. బైపాస్కు ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఫ్లాట్ ధర రూ.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆ చోటా నాయకుడి కన్ను ఖాళీ స్థలాలపై పడింది. న్యాయస్థానం ఆదేశాలు ఉండడంతో ఇక్కడ కొత్తగా ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి. అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న చోటా నాయకుడు సుమారు పది ప్లాట్ల వరకు కబ్జా చేసేశాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. కాలనీలో పెరియపాలితమ్మ అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న సుమారు 10 సెంట్ల వరకు ఖాళీ స్థలంపై కూడా చోటా నాయకుడి కన్ను పడింది. ఆలయ అభివృద్ధి సాకుతో ఆ స్థలాలను విక్రయించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. మహిళపై దాడి.. ఇటీవల సదరు నేత కబ్జా పర్వాన్ని ఎదురించిన ఒక మహిళపై ఆయన బ్యాచ్ రాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. తనపై జరిగిన దాడి విషయాన్ని ఆ మహిళ 100కు ఫోన్ చేయడంతో స్థానిక పోలీసులు భవానీనగర్‌కు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న చోటా నాయకుడి బ్యాచ్ పోలీసు వాహనాన్ని నిర్బంధించారు. ఆ అల్లరిమూకలను పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తప్పించుకున్నారు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సదరు నాయకుడి ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని భవానీనగర్ వాసులు వేడుకుంటున్నారు. ఫిర్యాదు వచ్చింది వాస్తవమే భవానీనగర్‌లో ఒక మహిళపై దాడికి పాల్పడినారనే ఆరోపణలపై ఆ మహిళ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. భవానీనగర్ ప్రాంతంలో ఎవరైనా రౌడీయిజం, పంచాయతీలు చేయడం, స్థాని కులపై దాడులకు పాల్పడడం వంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. -
జాబ్ రావాలంటే బాబు పాలన పోవాలి
పుత్తూరు: జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు పాలన అంతం కావాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అథ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రత్యేక హోదా హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెవిలో పూలతో పట్టణంలోని ఆరేటమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఆమె బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, అమర్‌నాధ్‌రెడ్డిలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారు యువతకు ఉద్యోగాలు కల్పించలేని అసమర్థులని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం చంద్రబాబు యువతకు అన్యాయం చేస్తున్నారని రోజా విమర్శించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా సుమారు 25 వేల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను వీధిన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా హామీని ఓటుకు నోటు కేసుతో తాకట్టు పెట్టి యువత ఆశలకు సజీవ సమాధి కట్టిన బాబు పాలనకు చరమ గీతం పాడేందుకు యువత ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. లోకేష్‌కు జాబ్ వచ్చింది నిరుద్యోగులకు జాబ్ రాలేదు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రి ఉద్యోగం వచ్చిందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అథ్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు నోటు కేసుతో ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టి చంద్రబాబు నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. అంతకుమునుపు నిరుద్యోగులను వంచించిన రాష్ట్ర ప్రభుత్వంపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అథ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్యాంలాల్, ఇమామ్, యువజన విభాగం చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అథ్యక్షుడు మధు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ రాయల్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై పాల్గొన్నారు. -
తీవ్రవాదుల ఇల్లు సోదా
పుత్తూరు, న్యూస్‌లైన్: పట్టణంలోని మేదరవీధిలో నివాసం ఉన్న తీవ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్ ఇంటిని ఆదివారం ఉదయం పుత్తూరు డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ చంద్రశేఖర్‌ల బృందం సోదా చేశారు. పుత్తూరులో శనివారం ఆంధ్ర, తమిళనాడు పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో తీవ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసుల సాయం తీసుకున్నారు. అనంతరం తీవ్రవాదులను చెన్నైకి తరలించారు. కాగా తీవ్రవాదుల్లో ప్రధాన సూత్రదారి ఫక్రుద్దీన్ మేదరవీధికి పక్కవీధిలో మేడపై నివాసం ఉండేవాడు. ఆ ఇంటిని శనివారం సాయంత్రం ఆంధ్రపోలీసులు తనిఖీ చేసి అక్కడున్న పేలుడు పదార్థాల విడిభాగాలు, ఇతర వస్తు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మేదరవీధిలో నివాసముండిన బిలాల్ ఇంటిని డీఎస్పీ ఆరీఫుల్లా తనిఖీ చేశారు. వంటగదిని, హాల్‌ను, పడకగదిని సోదా చేశారు. అక్కడున్న గ్యాస్ సిలిండర్, వివిధ వస్తువులు, టీవీ, తమిళంలో ఉన్న ఖురాన్(పుస్తకం) స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి వచ్చిన తమిళనాడు సీఐ లక్ష్మణ్‌పై దాడి జరిగిన ముఖద్వారం వద్ద పరిశీలించారు. సీఐపై దాడికి ఉపయోగించిన రాడ్డు, ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి సంబంధించి నమూనా రూపొందించి ఉగ్రవాదులు ఆ ఇంటిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారన్న అంశాలపై ఆరాతీశారు. ఆ ఇంటిలో చిందరవందరగా పడవేసిన దుస్తులు, తమిళ దినపత్రికలు, మిగిలిన వస్తువులను అక్కడే ఉంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులతో సంబంధాలు ఉన్న ఎవరైనా ఆ ప్రదేశంలో అనుమానంగా సంచరిస్తున్నట్లయితే అదుపులోకి తీసుకోవాల్సిందిగా డీఎస్పీ పోలీసులను ఆదేశించారు.