పుత్తూరు(చిత్తూరు జిల్లా): పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో ఆదివారం సుభాషిణి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రారంభించారు. ఓ వృద్ధుడికి బీపీ చెక్ చేసి ఆరోగ్యకరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
చదవండి: భిక్షగాడికి అమరావతి రైతు గెటప్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుత్తూరు పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, మాత్రలు పంపిణీ చేశారు. సుభాషిణి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుభాషిణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment