‘సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమాను ఆపాలని కోర్టులకు వెళుతున్నారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలనే చూడాలి. ఆయనను వ్యతిరేకించిన వారిని బతకనివ్వరు. చంద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు ఉండవు’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.