సాక్షి, పుత్తూరు(చిత్తూరు) : రైతులకు కరువు రావాలంటే చంద్రబాబు రావాలి.. ఎరువు కావాలంటే జగన్ రావాలని వైఎస్సార్‌సీపీ నగరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్కే రోజా స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రోజా ప్రసంగిస్తూ.. చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని తెలిపారు. అధికారం కోసం బాబు అడ్డమైన గడ్డి తింటూ.. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు భార్య ఆస్తులు మాత్రం ఐదు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఓ వైపు చిత్తూరులో చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతుంటే.. బాబు కోడలు మాత్రం ఐస్‌క్రీమ్ కంపెనీలు ప్రారంభిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినా సొంత జిల్లాకు చేసిందేంలేదని మండిపడ్డారు. జాతీయ నాయకులు అప్పుడు కలిసొచ్చారు.. ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు.. పొత్తు మాత్రం సేమ్ టూ సేమ్ అంటూ దుయ్యబట్టారు. తెలుగువాడి గుండె ధైర్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. దివంగత మహానాయకుడు వైఎస్ హయాంలోనే నగరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. గాలేరు - నగరి ప్రాజెక్ట్ పూర్తయితేనే పుత్తూరులో నీటి సమస్య తీరుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment