
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అలాగే టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదులు తెలుపుతూ, శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుంటామని, వాటిని విశ్లేషించుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఈవీఎంలపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని, తర్వాత విశ్లేషిస్తామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత అంటూ... ప్రెస్‌మీట్‌ను మూడు ముక్కల్లో ముగించేశారు చంద్రబాబు.
Comments
Please login to add a commentAdd a comment