
మండ్య రమేశ్ (ఫైల్ ఫొటో)
మండ్య: కన్నడ హాస్య నటుడు మండ్య రమేశ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో రమేశ్ ప్రాణాపాయం నుంచి సురక్షింతంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బెంగళూరు నగరంలో ఓ కన్నడ ఛానల్‌లో కార్యక్రమ చిత్రీకరణ షూటింగ్‌ను ముగించుకొని మైసూరుకు తిరుగు పయనమయ్యారు.
ఈ క్రమంలో జిల్లాలోని శ్రీరంగపట్టణ సమీపానికి చేరుకోగానే ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం, లోపలి భాగం ధ్వంసం కాగా, కారును నడుపుతున్న మండ్య రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీరంగపట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.