పణజి: గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్‌పీ)ను అధికార బీజేపీలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదనకు గోవా అసెంబ్లీ స్పీకర్ రమేశ్ ఆమోద ముద్రవేశారు. కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇస్తూ బుధవారం ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరిన విషయం తెల్సిందే. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మూడుకు పడిపోయింది.
బీజేపీలో కొత్తగా చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, ప్రమాణస్వీకార తేదీల ఖరారు కోసం చర్చించేందుకు గవర్నర్‌తో సీఎంసావంత్ భేటీ అయ్యారని మీడియాలో వార్తలు వినవచ్చాయి. ఈ వార్తలను సీఎం ఖండించారు. మోదీ పుట్టినరోజు వేడుకపై చర్చించానని చెప్పారు.
(చదవండి: గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్)
Comments
Please login to add a commentAdd a comment