విజేతలు రమేశ్, కలైవాణి | ramesh, kalaivani win gold mile run titles | Sakshi
Sakshi News home page

విజేతలు రమేశ్, కలైవాణి

Published Mon, Sep 4 2017 10:48 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM

ramesh, kalaivani win gold mile run titles

గోల్డెన్‌ మైల్‌ రన్‌


సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన ‘గోల్డెన్‌ మైల్‌ రన్‌– 2017’ ఈవెంట్‌లో బి. రమేశ్, కలైవాణి సత్తా చాటారు. హైదరాబాద్‌ అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగు పోటీలో పురుషుల, మహిళల విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో సికింద్రాబాద్‌ పీజీ కాలేజ్‌కు చెందిన బి. రమేశ్‌ మైలు దూరాన్ని 5 నిమిషాల 59.9 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలవగా, ఎస్‌. మహేశ్‌ రెడ్డి (గచ్చిబౌలి స్టేడియం, 6ని.01.2సె.), ఎస్‌. వినోద్‌ (గచ్చిబౌలి స్టేడియం; 6ని. 10.2సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో ఆర్‌. కలైవాణి (సెయింట్‌ ఆన్స్‌) లక్ష్యదూరాన్ని 7 నిమిషాల 50.5 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. బి. కావ్యశ్రిత (ఓయూ, 8ని.00.1సె.), టి. హిమబిందు (ఆర్‌బీవీఆర్‌; 8ని. 25.2సె.) తర్వాతి స్థానాలను సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎన్‌. గౌతమ్‌ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు.  



ఇతర వయో విభాగాల విజేతల వివరాలు

అండర్‌–16 బాలురు: 1. అజయ్‌ కుమార్‌ (కేవీ, కాంచన్‌బాగ్‌), 2. బి. భరత్‌ కుమార్‌ (నిజామ్‌ కాలేజ్‌), 3. డి. సాయినాథ్‌ (‘శాట్‌’). బాలికలు: 1. కె. అఖిల (సాయి చైతన్య), 2. సిరి వెన్నెల (సీఎంఆర్‌ స్కూల్‌), 3. పూజ పటేల్‌ (సీఎంఆర్‌).  
అండర్‌–13 బాలురు: 1. కె. జితేందర్‌ (సాయి చైతన్య), 2. ఎం. అరవింద్‌ (శాంతినికేతన్‌), 3. నవీన్‌ (జడ్పీహెచ్‌ఎస్, మేకగూడ). బాలికలు: 1. ఎన్‌. విజయలక్ష్మి (సీఎస్‌ఎస్‌), 2. ఎస్‌కే. తస్లీమా (తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌), 3. పి. యువిక (కెన్నడీ).  
అండర్‌–10 బాలురు: 1. సిద్ధార్థ (సీఎంఆర్‌), 2. టి. మణి శంకర్‌ (కేవీ, ఉప్పల్‌), 3. సుమన్‌ థాపా (సీఎంఆర్‌). బాలికలు: 1. ఎ. మౌనిక (సీఎస్‌ఎస్‌), 2. ఆర్‌. మేఘన (సీఎంఆర్‌), 3. కె. మహేశ్వరీ (సీఎస్‌ఎస్‌).  
మాస్టర్‌ మెన్‌ (35+): 1. ఎన్‌. వెంకట్‌ మల్లు (ఓయూ), 2. కె. తాయప్ప (రంగారెడ్డి),
3. హరీందర్‌ (ఏఓసీ సెంటర్‌). మహిళలు:
1. సీహెచ్‌ కవిత (హైదరాబాద్‌), 2. శ్రీవాణి (హైదరాబాద్‌), 3. సి. నాగవల్లి (హైదరాబాద్‌).

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement