
సాక్షి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ షాకిచ్చారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ భావజాలలలో ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
కాగా, ప్రశ్నించే గొంతును మూగబోనివ్వకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, రాజీనామా వల్లే నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, సిరిసేడు, మర్రివానిపల్లి, బూజునూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రచ్చబండ తరహాలో ప్రజల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధలను, కష్టాలను ఈటలతో పంచుకున్నారు. అనంతరం పలువురు ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
చదవండి : మోదీ సూచనలతోనే అక్రమ కేసులు, సోదాలు
Comments
Please login to add a commentAdd a comment