టీడీపీ నేత పల్లెవీధి రమేష్ నివాసం, దుకాణాల వద్ద ఐటీ అధికారుల తనిఖీలు (ఇన్‌సెట్) రమేష్
తిరుపతి రూరల్: తిరుపతిలో ఫైనాన్షియర్, ఎమ్మెల్యే సుగుణమ్మ అనుచరుడు కందిశెట్టి రమేష్ ఇళ్లు, కార్యాలయంపై మంగళవారం ఆదాయపు పన్నుశాఖాధికారులు మెరుపుదాడులు చేశారు. పూలవీధి, పల్లివీధిలోని అతని ఇళ్లు, కార్యాలయం, గిడ్డంగులు మొత్తం ఐదు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. అతని సన్నిహితురా లు, ఓ బ్యాంకు అకౌంటెంట్ శ్రీవాణి ఇంటిలో కూడా తనిఖీలు చేశారు. దాదాపు 30 మంది ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి ఈ సోదాలు చేస్తున్నారు. రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించినట్లు సమాచారం.
బినామీ ఆస్తులు, కోట్లలో ఫైనాన్స్‌లు, నిబంధనలకు విరుద్ధంగా చిట్‌లు వేస్తున్న ట్లు గుర్తించారు. మంగళవారం సాయంత్రం వరకు దాదాపు రూ.30 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. బుధవారం కూడా ఈ దాడులు కొనసాగనున్నాయి. తిరుపతిలో పెద్దల ముసుగు వేసుకున్న కొందరు తమ నల్లధనాన్ని రమేష్ ద్వారా రొటేషన్ చేయిస్తున్నారనే ఆరోపణలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
పీఆర్పీ, టీడీపీ నేతల్లో అలజడి..
రమేష్ ప్రజారాజ్యం ఆవిర్భావం సమయంలో ఆ పార్టీలో కీలకనేతగా వ్యవహరించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు సన్నిహితుడుగా మారాడు. తిరుపతికి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువుతో కలిసి భారీగా వ్యాపార, ఫైనాన్స్ లావాదేవీలను నడుపుతున్నట్లు ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం రావడంతో టీడీపీ, మాజీ పీఆర్పీ నేతల్లో అలజడి మొదలైంది. పీఆర్పీలో హడావుడి చేసిన ఓ సినీ నిర్మాతకు దగ్గరగా ఉండే యువకుడైన మాజీ కౌన్సిలర్‌ను సైతం ఐటీ అధికా రులు విచారించినట్లు సమాచారం.
రమేష్‌తో టీడీపీ ప్రజా ప్రతినిధి బంధువుకు ఉన్న గిల్లుడు సంబంధంపై ఐటీ అధికారులు కన్నువేశారని తెలియడంతో హైదరా బాదు స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. రమేష్ ఆస్తుల వ్యవహారంలో టౌన్‌బ్యాంక్ అకౌంటెంట్ శ్రీవాణి పేరు బయటకు రావడం, ఆమె ఇంట్లో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. బు«ధవారం రమేష్ అక్రమ ఆస్తుల చిట్టా బయటకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment