Parliament Monsoon Session Starts 20 July 2023 - Sakshi
Sakshi News home page

Parliament Monsoon Session: నేటి నుంచే సభా సమరం

Published Thu, Jul 20 2023 4:16 AM | Last Updated on Thu, Jul 20 2023 8:18 PM

Parliament Monsoon Session starts 20 july 2023 - Sakshi

అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు రాజ్‌నాథ్, మేఘ్వాల్, పలు పార్టీల నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చలు, సంవాదాలకు రంగం సిద్ధమయ్యింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు గురువారం ఆరంభం కానున్నాయి. ఇరుపక్షాలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.

మణిపూర్‌లో జాతుల మధ్య రగులుతున్న హింస, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం  వంటి అంశాలపై సభలో గట్టిగా నిలదీసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కూటమి సిద్ధమవుతోంది. తిప్పికొట్టేందుకు అధికార పక్షం ప్రతివ్యూహాలు పన్నుతోంది.  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

23 రోజుల పాటు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 17 రోజుల పాటు పార్లమెంట్‌ భేటీ కానుంది. పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం.. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్‌ భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో నూతన భవనానికి మారుతాయి. ఈసారి మొత్తం 21 బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైంది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు.   

యూసీసీ, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై రగడ తప్పదా?  
మణిపూర్‌లో హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యూసీసీ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీఎంసీ సహా ఇతర విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే అన్ని స్థాయిల్లో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఢిల్లీ విషయంలో కేంద్ర ఆర్డినెన్స్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన బీఆర్‌ఎస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల మద్దతు కూడగట్టారు.

జోషి ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. జోషి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలకపార్టీల నేతలు పాల్గొన్నారు.   32 అంశాలు పార్లమెంట్‌లో ప్రస్తావనకు రానున్నట్లు జోషి చెప్పారు. కాగా, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా కోరుకుంటే, సభలో ప్రతిపక్షాలు లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ అధిర రంజన్‌ చౌదరి అన్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని వ్యాఖ్యానించారు.  

మా డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్‌ మద్దతు: బీజేడీ  
వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని బిజూ జనతాదళ్‌(బీజేడీ) ఎంపీ శశి్మత్‌ పాత్రా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తమ డిమాండ్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement